పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ,రెండుసార్లు ఒలింపియన్ పీవీ సింధు వివాహ వేడుక అంగరంగ వైభంగా ముగిసింది. పెళ్లి కూతురులుక్‌లో ముగ్ధమనోహరంగా అందర్నీ మెస్మరైజ్ చేసింది.
హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త వెంకట దత్త సాయితో ఆదివారం, (డిసెంబర్ 22,2024న) ఉదయపూర్‌లో వివాహం చేసుకుంది పీవీ సిందు. ఈ సందర్భంగా సింధు డిజైనర్ సారీ, పెళ్లి కూతురి ముసుగు, వరుడు బ్రోకేడ్ షేర్వాని ఇలా ప్రతీదీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.
ఒక్కో వేడుకకు, ఒక్కో డిజైనర్ రూపొందించిన ఫ్యాషన్ ఔట్‌ఫిట్స్‌తో తన వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్‌గా ఉండేలా జాగ్రత్త పడింది పీవీ సింధు. ముఖ్యంగా వధూవరుల మ్యాచింగ్ ఆభరణాలు కొత్త ట్రెండ్‌కు అద్దం పట్టాయి. ఫ్యాషన్ అభిమానులు, ముఖ్యంగా కాబోయే వధువుల మనసు దోచేశాయి. ఆటలోనూ కాదు, ఫ్యాషన్‌లోనూ ట్రెండ్ చేసిందంటూ మురిసిపోతున్నారు అభిమానులు.
పీవీ సింధు, సాయి మ్యాచింగ్ ఆభరణాలు
ప్రఖ్యాత డిజైనర్ మనీష్ మల్హోత్రా జ్యువెలరీ కలెక్షన్లోని పచ్చలు పొదిగిన డైమండ్ నెక్లెస్ ధరించగా, వరుడు దత్త సాయి ఆభరణాలు అందరి దృష్టినీ కట్టిపడేశాయి. సింధు జాంబియన్ పచ్చలు పొదిగిన మల్టీ-లేయర్డ్ నెక్లెస్,పట్టీ, మ్యాచింగ్ చెవిపోగులు ధరిస్తే, వరుడు డబుల్ లేయర్ నెక్లోస్ ధరించాడు. ఇంకా వజ్రాలు పొదిగిన కడియాలు, బంగారు గొలుసు సింధు బ్రైడల్ లుక్‌నుమరింత ఎలివేట్ చేశాయి. కాబోయే వధూవరులకు కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేశారు అంటున్నారు ఫ్యాషన్ ప్రియులు,
Comments
Please login to add a commentAdd a comment