క్యాన్సర్ బాధితుడిని పరామర్శించిన ఎన్టీఆర్ | Jr.NTR to meet Cancer patient | Sakshi
Sakshi News home page

క్యాన్సర్ బాధితుడిని పరామర్శించిన ఎన్టీఆర్

Published Sat, Jul 30 2016 1:26 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM

క్యాన్సర్ బాధితుడిని పరామర్శించిన ఎన్టీఆర్

క్యాన్సర్ బాధితుడిని పరామర్శించిన ఎన్టీఆర్

యంగ్ జనరేషన్ హీరోలు సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా ఉత్సాహం పాల్గొంటున్నారు. ముఖ్యంగా నయం కానీ వ్యాధులతో బాధపడుతున్న రోగుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు ప్రతీ ఒక్కరు కదలివస్తున్నారు. ఇటీవల క్యానర్తో బాధపడుతున్న అమ్మాయిని తమిళ హీరో ధనుష్ పరామర్శించగా, తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్కు క్యాన్సర్ బాధితున్ని కలిసి ధైర్యం చెప్పాడు.

బెంగళూరుకు చెందిన నాగార్జున కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నాడు. ఎన్టీఆర్ను కలవటమే తన ఆఖరి కోరిక అని తెలపటంతో.. ఆ అభిమానిని కలిసేందుకు ఎన్టీఆర్ సమయమిచ్చాడు. నాగార్జునతో కొంత సమయం గడిపిన జూనియర్, అతని ఆరోగ్యపరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నాడు. ఎన్టీఆర్ చేసిన పనికి అభిమానులతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులనుంచి కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement