సీఎం జగన్‌కు తన గోడు వెళ్లబోసుకుంటున్న సరస్వతి , చెక్కు అందిస్తున్న మంత్రి బొత్స
దత్తిరాజేరు : క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఓ మహిళ పట్ల సీఎం జగన్ పెద్దమనసుతో స్పందించారు. మరడాం హెలిప్యాడ్ వద్ద విజయనగరం జిల్లా కొండదాడికి చెందిన సరస్వతి సీఎంను కలిసి తన కష్టాలు చెప్పుకుంది. తల్లిదండ్రులిద్దరూ క్యాన్సర్‌తో మృతి చెందారని, తను కూడా క్యాన్సర్‌తో బాధపడుతున్నానని, ఆస్పత్రి, ఇతరత్రా ఖర్చులకు ఇబ్బంది పడుతున్నానని, ఆదుకోవాలని వేడుకుంది.
స్పందించిన సీఎం రూ.3 లక్షల సాయంతో పాటు ఉచిత వైద్యం అందించాలని కలెక్టర్ నాగలక్ష్మిని ఆదేశించారు. ఈ మేరకు కొద్ది గంటల్లోనే బాధితురాలికి మంత్రి బొత్స సత్యనారాయణ రూ.3 లక్షల చెక్కు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment