కోకోను బ్యాగ్‌లో ఆస్పత్రికి తీసుకెళ్తున్న దృశ్యాలు
సిడ్నీ : క్యాన్సర్‌తో బాధపడుతూ ఇంకొద్దిరోజుల్లో చనిపోతాడని తెలిసి ఆ ముసలాయనకు సర్‌ప్రైజ్ వీడ్కోలు ఇచ్చారు కుటుంబసభ్యులు. అతడికి ఎంతో ఇష్టమైన, బెస్ట్ ఫ్రెండ్‌ను కలుసుకునేలా చేశారు. వివరాల్లోకి వెళితే.. సిడ్నీకి చెందిన పాల్ లీవిస్ అనే ముసలాయన గత కొద్ది సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. వ్యాధి ముదరడంతో కొన్ని రోజుల నుంచి అతడ్ని ఆస్పత్రిలోనే ఉంచి డాక్టర్లు చికిత్స చేస్తున్నారు. పాల్‌కు రోజులు దగ్గర పడ్డాయని భావించిన కుటుంబసభ్యులు బ్రతికున్న కొన్ని క్షణాలైనా అతడ్ని సంతోషపెట్టాలనుకున్నారు.
ఆస్పత్రి బెడ్ వద్ద పాల్ బెస్ట్ ఫ్రెండ్ కోకో
ఇందుకోసం పాల్ బెస్ట్ ఫ్రెండ్ అయిన 19 ఏళ్ల కోకో అనే పిల్లిని అతడి వద్దకు తీసుకొచ్చి సర్‌ప్రైజ్ చేశారు. ఆస్పత్రి బెడ్ మీద కదలలేని పరిస్థితిలో ఉన్న అతడు దాన్ని చూడగానే ఎంతో సంతోషపడ్డాడు. పాల్ మనవరాలు ఎలిసా ఫోటి దీన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచింది. దీంతో వీడియో కాస్తా వైరల్‌గా మారింది. అయితే కోకోను కలుసుకున్న రెండు రోజులకు పాల్ కిడ్నీ ఫేయిల్యూర్ కారణంగా మరణించాడు.
Comments
Please login to add a commentAdd a comment