మనం ఉంటున్న ఇంట్లో ఒక్క సాలె పురుగు(స్సైడర్)ను చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది.. మరి అలాంటిది ఒకే గదిలో కొన్ని వందల సాలీడును చూస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. సరిగ్గా అలాంటి ఘటనే ఆస్ట్రేలియాలోని సిడ్నీలో చోటుచేసుకుంది. వివరాలు.. పిటీ.ఆర్ అనే మహిళ తన కూతురు బెడ్‌రూమ్‌ను శుభ్రం చేద్దామని ఆమె గదికి వెళ్లింది. రూమ్ డోర్ తీయగానే వందల సంఖ్యలో సాలీడు గోడమీద పాకుతూ ప్రత్యక్షమయ్యాయి.
వాటిని చూడగానే ఆమెకు ఆశ్చర్యం వేసి తన స్నేహితురాలిని పిలిచింది. అసలు ఇంట్లోకి ఇన్ని సాలె పురుగులు ఎలా వచ్చాయా అనుకుంటూ వాటిని వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. కాగా ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. 'ఇలాంటి సీన్ ఎప్పుడు చూడలేదు.. స్పైడర్‌మ్యాన్ సినిమా గుర్తుకు రావడం గ్యారంటీ.. ఒకరోజు ఇలాగే వందల సంఖ్యలో సాలీడులు నా మీదకు వస్తున్నట్లు కల వచ్చిందంటూ' వినూత్న రీతితో కామెంట్లు పెడుతున్నారు. చదవండి: కూతురి కోసం గుండు గీసుకున్న తల్లి
So, for everyone saying it's Photoshopped, here is her actual video. pic.twitter.com/2Zcro0nra7
— 💧 Petie R 🇦🇺🌟🦄🌱🌈🌏 (@PrinPeta) January 28, 2021
Comments
Please login to add a commentAdd a comment