spiders
-
సాలీళ్లు బాబోయ్! సాలీళ్లు! ఇళ్లల్లోకి చొరబడుతున్నాయి..
ఒకనాడు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఏలిన బ్రిటిష్ రాజ్యాన్ని ఇప్పుడు సాలీళ్లు గడగడలాడిస్తున్నాయి. సాలీడు పేరు చెబితేనే బ్రిటిష్ ప్రజలు భయంతో వణుకుతున్నారు. సాలీళ్లలో ‘ఫెన్ రాఫ్ట్ స్పైడర్’ జాతికి చెందిన భారీ సాలీళ్లు ఇళ్లల్లోకి చొరబడి గూళ్లు ఏర్పాటు చేసుకుంటూ, జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. మామూలు సాలీళ్లలా ఇవి చిన్నగా ఉండవు. ఏకంగా అరచేతి పరిమాణంలో ఉంటాయి. బ్రిటన్‌లోని సఫోక్, ససెక్స్, నార్ఫోక్ ప్రాంతాల్లో ఈ భారీ సాలీళ్ల బెడద కొద్దిరోజులుగా ఎక్కువైంది. నీటి ఉపరితలంలోను, నేల మీద కూడా జీవించగలిగే ఫెన్ రాఫ్ట్ స్పైడర్ సాలీళ్లలో అరుదైన జాతి. జలాశయాల పర్యావరణాన్ని ఇవి కాపాడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సాలీళ్లు కీటకాలతో పాటు చిన్న చిన్న చేపలను కూడా తింటాయి. ఇదివరకు ఇవి జలాశయాల పరిసరాల్లోనే కనిపించేవి. ఇప్పుడివి ఇళ్లల్లోకి కూడా చొరబడటమే బెడదగా మారింది.నల్లులతో నానా యాతన..!అగ్రరాజ్యం అమెరికాను నల్లులు హడలెత్తిస్తున్నాయి. అమెరికాలోని దాదాపు ఇరవై రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో నల్లుల బెడద విపరీతంగా పెరిగింది. చాలా చోట్ల ఇళ్లు, హోటళ్లు తదితర ప్రదేశాల్లోని మంచాలు, కుర్చీలు, సోఫాల్లోకి చేరిన నల్లులు జనాలను కుట్టి చంపుతున్నాయి.అమెరికాలో ఎక్కువగా ‘ఆసియన్ లాంగ్హార్న్డ్ టిక్’ జాతికి చెందిన నల్లులు కొద్దికాలంగా విజృంభిస్తున్నాయి. అమెరికాలో ఈ జాతి నల్లులను తొలిసారిగా 2017 సంవత్సరంలో ఓక్లహామాలో గుర్తించారు. వీటి నిర్మూలనకు ఎన్ని చర్యలు తీసుకున్నా, ఇవి అన్నింటినీ తట్టుకుంటూ ఇప్పుడు ఇరవై రాష్ట్రాలకు విస్తరించాయి. ఈ నల్లులు వ్యాప్తి చేసే లైమ్ వ్యాధి ఇప్పటికే పలువురి ప్రాణాలను బలిగొంది. ఈ నల్లులు లైమ్ వ్యాధికి కారణమయ్యే పరాన్నజీవులను వ్యాప్తి చేస్తాయని అమెరికా పర్యావరణ పరిరక్షణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నల్లి కాటుకు గురైన వారిలో లైమ్ వ్యాధికి గురై, దాదాపు 15 శాతం మంది మృతిచెందినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. -
ఈ విషయం తెలుసా? ఈ సాలీడు కుడితే.. ఇక అంతే!
ప్రపంచంలోని సాలెపురుగుల్లోకెల్లా ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఏదో బూజు గూడు అల్లుకునే మామూలు సాలెపురుగే అనుకుంటే పొరపాటే! ఇది కుట్టిందంటే, ఇక అంతే సంగతులు! ‘సిడ్నీ ఫన్నెల్ వెబ్ స్పైడర్’ అనే ఈ సాలెపురుగు ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి వంద కిలోమీటర్ల వ్యాసార్ధం పరిధిలోని అడవుల్లో కనిపిస్తుంది. ఒక్కోసారి ఈ సాలెపురుగులు ఇళ్లల్లోకి కూడా చేరుతుంటాయి.ఈ సాలెపురుగు కుట్టినప్పుడు శరీరంలోకి చేరే విష పదార్థాలు నిమిషాల్లోనే నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. తక్షణ చికిత్స అందించకుంటే, అరగంటలోనే ప్రాణాలు పోయే పరిస్థితి తలెత్తుతుంది. ఈ సాలెపురుగు కాటు వల్ల మనుషులకు ప్రాణాపాయం ఉంటుంది గాని, కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులకు ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇదొక అరుదైన విశేషం.ఒళ్లంతా ముళ్లున్న స్టార్ఫిష్..సముద్రంలో స్టార్‌ఫిష్‌లు అరుదుగా కనిపిస్తాయి. స్టార్ఫిష్లలో మరీ అరుదైనది ఈ ముళ్ల స్టార్ఫిష్. ఇది సముద్రం లోలోతుల్లో ఉంటుంది. ఒళ్లంతా ముళ్లు ఉండటం వల్ల దీనిని ‘క్రౌన్ ఆఫ్ థాన్స్ స్టార్ఫిష్’ అని అంటారు.ఈ ముళ్ల స్టార్‌ఫిష్‌లు రకరకాల రంగుల్లో ఉంటాయి. ఎక్కువగా నలుపు, ముదురు నీలం, ఊదా, ఎరుపు, గోధుమ రంగు, బూడిద రంగుల్లో ఉంటాయి. ఇవి ఎక్కువగా పగడపు దిబ్బలను ఆశ్రయించుకుని బతుకుతాయి. పర్యావరణ మార్పుల వల్ల పగడపు దిబ్బలు రంగు వెలిసిపోతుండటం, పగడపు దిబ్బల విస్తీర్ణం నానాటికీ తగ్గిపోతుండటంతో ఈ ముళ్ల స్టార్ఫిష్ల సంఖ్య కూడా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. పగడపు దిబ్బలను కాపాడుకునేందుకు తగిన చర్యలు చేపట్టకుంటే, ఈ ముళ్ల స్టార్ఫిష్ జాతి అంతరించిపోయే ప్రమాదం కూడా ఉంది.అత్యంత పురాతన గుహాచిత్రాలు..ప్రపంచంలో పురాతన మానవులు సంచరించిన ప్రదేశాల్లో పలుచోట్ల ఆనాటి మానవులు చిత్రించిన గుహాచిత్రాలు బయటపడ్డాయి. సహస్రాబ్దాల నాటి గుహాచిత్రాలు పురాతన మానవుల ఆదిమ కళా నైపుణ్యానికి అద్దంపడతాయి. ఇటీవల ఇండోనేసియాలోని సూలవేసీ దీవిలో అత్యంత పురాతన గుహాచిత్రాలు బయటపడ్డాయి. ఈ దీవిలోని మారోస్ పాంగ్కెప్ ప్రాంతానికి చెందిన లీంగ్ కరాంపాంగ్ సున్నపురాతి గుహల్లో ఈ పురాతన చిత్రాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.వీటిలో ఎర్రరంగుతో చిత్రించిన మూడడుగుల పంది బొమ్మ, చిన్న పరిమాణంలో నిలబడి ఉన్న భంగిమలో మూడు వేటగాళ్ల బొమ్మలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ యూనివర్సిటీకి చెందిన పురాతత్త్వ శాస్త్రవేత్తలు ఈ గుహాచిత్రాలపై క్షుణ్ణంగా పరిశోధనలు జరిపారు. గుహ లోపలి భాగంలో ఒకే రాతిపై వరుసగా చిత్రించిన ఈ బొమ్మలను కార్బన్ డేటింగ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరీక్షించి, ఇవి కనీసం 51,200 ఏళ్ల కిందటివని అంచనాకు వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు దొరికిన గుహా చిత్రాలలో ఇవే అత్యంత పురాతనమైన గుహా చిత్రాలని గ్రిఫిత్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాక్సిమ్ ఆబర్ట్ వెల్లడించారు. -
సాలీడు పురుగులంటే భయమా? ఈ యాప్‌తో..
గాలి భయం, నేల భయం, నిప్పు భయం, నీరు భయం.. ఇలా మనిషికి అంతా భయంమయం. నల్లిని చూసినా, పిల్లిని చూసినా.. భయంతో, అసహ్యంతో కుంగిపోతుంటాడు. అయితే కొందరు ఆ భయాల్ని పొగొట్టుకునేందుకు రకరకాల థెరపీలను ఆశ్రయిస్తుంటారు. ఈ క్రమంలో సాలీడు పురుగులంటే భయపడేవాళ్ల కోసం ఓ యాప్‌ను రూపొందించారు స్విట్జర్లాండ్ సైంటిస్టులు. స్విట్జర్లాండ్ బాసెల్ యూనివర్సిటీ రీసెర్చర్లు ‘డబ్బ్‌డ్ ఫోబిస్’ పేరుతో ఓ కొత్త యాప్‌ను డెవలప్ చేశారు. ఇందులో అగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీతో రూపొందించిన సాలీడు పురుగుల బొమ్మలు డిస్ప్లే అవుతాయి. వీటి ద్వారా నిజమైన సాలీడు పురుగుల వల్ల కలిగే భయాన్ని దూరం చేసుకోవచ్చని రీసెర్చర్లు చెప్తున్నారు. సాలీడు పురుగుల వల్ల మనిషికి కలిగే భయాన్ని అరాచ్నోఫోబియా(అరాక్నోఫోబియా) అంటారు. దీని నుంచి బయటపడేందుకు చాలామంది మానసిక వైద్యులు, థెరపిస్టుల చుట్టూ తిరుగుతూ డబ్బు ఖర్చు చేస్తుంటారు. అయితే డబ్బ్‌డ్ ఫోబిస్ పూర్తిగా ఫ్రీ యాప్. అగుమెంటెడ్ రియాలిటీ 3డీ స్పైడర్ బొమ్మల వల్ల.. రియల్ లైఫ్ స్పైడర్లు ఎదురైనప్పుడు కలిగే భయాన్ని ఫేస్ చేయొచ్చు. మొత్తం పది లెవల్స్‌లో ఈ యాప్ ట్రీట్మెంట్(సెల్ఫ్) చేసుకోవచ్చు. రీసెంట్గా ఈ యాప్ వల్ల అరాచ్నోఫోబియా బయటపడ్డ కొందరి అభిప్రాయాల్ని ‘యాంగ్జైటీ డిజార్డర్స్’ అనే జర్నల్‌లో పబ్లిష్ చేశారు. వీళ్లంతా సుమారు రెండువారాలపాటు ఆరున్నర గంటలపాటు శిక్షణ తీసుకున్నారు. సంప్రదాయ పద్ధతిలో థెరపీ కంటే మెరుగైన ఫలితాలను ఇచ్చాయని రీసెర్చర్లు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ప్లేస్టోర్‌లో డమ్మీ ఫోబిస్ యాప్‌లు చాలానే ఉన్నాయి. కానీ, ఏఆర్ టెక్నాలజీ ఎక్స్‌పీరియన్స్‌తో కూడిన డబ్బ్‌డ్ ఫోబిస్ యాప్ రావడానికి కొంత టైం పడుతుందని చెప్తున్నారు. చదవండి: ఔరా.. అద్దాలలో ఈ స్మార్ట్ అద్దాలు వేరయా! -
2 కొత్త జాతుల సాలీళ్లకు 26/11 హీరో కాప్ పేరు
ముంబై : శాస్త్రవేత్తలు సాలీళ్లలో రెండు కొత్త జాతుల్ని కనుగొన్నారు. మహారాష్ట్రలో కనుగొన్న ఈ రెండు కొత్త జాతులకు 26/11 టెర్రరిస్ట్ దాడిలో మృతి చెందిన ఏఎస్ఐ తుకారామ్ ఓంబుల్ పేరు పెట్టారు. ‘‘ ఐసియస్ తుకారామి’’ అని వీటికి నామకరణం చేశారు. ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కుశ్వాన్ తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ‘‘ మనం శోధించాల్సిన పకృతి ఇంకా ఎంతో మిగిలి ఉంది.. మహారాష్ట్రలో కనుక్కోబడిన సాలీళ్లలోని రెండు కొత్త జాతులకు పోలీసు అమరవీరుడు తుకారామ్ పేరు వచ్చేలా ‘‘ ఐసియస్ తుకారామి’’ అని శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. ఇలా అమర వీరులను గౌరవించుకోవటం చాలా మంచిది’’ అని పేర్కొన్నారు. కాగా, ముంబైకి చెందిన తుకారామ్ ఓంబుల్ 2008లో తాజ్హోటల్లో జరిగిన టెర్రరిస్ట్ దాడిలో మృత్యువాతపడ్డారు. 26/11న నిరాయుధుడైన తుకారామ్ కసబ్‌ను పట్టుకోవటానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో కసబ్ జరిపిన కాల్పుల్లో తుకారామ్ వీర మరణం పొందారు. 2009లో భారత ప్రభుత్వం ఆయనకు అశోక చక్ర ఇచ్చి గౌరవించింది. చదవండి : వీడియో వైరల్: భారీగా బరువు తగ్గిన కిమ్ జాంగ్ So much nature yet to explore & a good way to pay respect to martyr. A new species of jumping spider is documented Icius tukarami from Maharashtra. Named after the martyr Tukaram by researchers. @Dhruv_spidy pic.twitter.com/VQEbB9xbyE — Parveen Kaswan, IFS (@ParveenKaswan) June 28, 2021 -
వామ్మో.. ఏంటి ఇదంతా.. సాలీళ్లు ఎంత పనిచేశాయి!
సిడ్నీ: భారీ తుపాను ధాటి నుంచి ఆగ్నేయ ఆస్ట్రేలియా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఎడతెరిపిలేని వర్షం కారణంగా సంభవించిన ఆస్తి నష్టం నుంచి తేరుకుని సాధారణ జీవితం గడిపే స్థితికి చేరుకుంటోంది. విద్యుత్ కనెక్షన్ల పునరుద్ధరణ వంటి చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, విక్టోరియా రాష్ట్రంలోని ఈస్ట్ గిప్స్‌ల్యాండ్ ప్రజలను వరదల కంటే కూడా సాలీడుగూళ్లే ఎక్కువగా షాక్‌నకు చేస్తున్నాయట. రోడ్డు పక్కన, చెట్ల మీద, మైదానాల్లో ఎక్కడ చూసినా సాలీడులు అల్లిన గూళ్లే దర్శనమిస్తున్నాయట. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పచ్చిక బయళ్లను కప్పివేసిన భారీ స్ప్రైడర్వెబ్స్ను చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకిలా? ఒకచోట నుంచి మరొక చోటికి వెళ్లే సమయంలో లేదంటే పొదిగే వేళ సాలీళ్లు వీలైనంత మేర ఎత్తుకు చేరుకునేందుకు ప్రయత్నిస్తాయట. ఆ సమయంలో కాళ్లు పైకెత్తి వందల సంఖ్యలో దారాల(గాసమేర్)ను గాల్లోకి విడుస్తాయని, ఈ క్రమంలో వాటంతట అవే త్రికోణాకారంలో పారాచూట్ వంటి నిర్మాణాలు ఏర్పరుస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ ప్రక్రియను బెలూనింగ్ అంటారు. తమను తాము రక్షించేందుకు పెద్ద సాలీళ్లు దీనిని ఉపయోగిస్తాయట. ఈ విషయం గురించి మ్యూజియం విక్టోరియాలో పనిచేసే ఎంటమాలజిస్ట్ డాక్టర్ కెన్ వాకర్ మాట్లాడుతూ.. ‘‘ఇవి చాలా అందంగా ఉన్నాయి. వేగంగా ప్రయాణించేందుకు, ఇతర జీవుల నుంచి తప్పించుకునేందుకు అవి ఇలా చేస్తాయి. చదవండి: షాకింగ్: హిమనీనదాల్లో రక్తం.. ఇదీ అసలు విషయం! -
వందల సంఖ్యలో సాలీడులు.. వారి పరిస్థితి ఏంటో
మనం ఉంటున్న ఇంట్లో ఒక్క సాలె పురుగు(స్సైడర్)ను చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది.. మరి అలాంటిది ఒకే గదిలో కొన్ని వందల సాలీడును చూస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. సరిగ్గా అలాంటి ఘటనే ఆస్ట్రేలియాలోని సిడ్నీలో చోటుచేసుకుంది. వివరాలు.. పిటీ.ఆర్ అనే మహిళ తన కూతురు బెడ్రూమ్ను శుభ్రం చేద్దామని ఆమె గదికి వెళ్లింది. రూమ్ డోర్ తీయగానే వందల సంఖ్యలో సాలీడు గోడమీద పాకుతూ ప్రత్యక్షమయ్యాయి. వాటిని చూడగానే ఆమెకు ఆశ్చర్యం వేసి తన స్నేహితురాలిని పిలిచింది. అసలు ఇంట్లోకి ఇన్ని సాలె పురుగులు ఎలా వచ్చాయా అనుకుంటూ వాటిని వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. కాగా ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. 'ఇలాంటి సీన్ ఎప్పుడు చూడలేదు.. స్పైడర్‌మ్యాన్ సినిమా గుర్తుకు రావడం గ్యారంటీ.. ఒకరోజు ఇలాగే వందల సంఖ్యలో సాలీడులు నా మీదకు వస్తున్నట్లు కల వచ్చిందంటూ' వినూత్న రీతితో కామెంట్లు పెడుతున్నారు. చదవండి: కూతురి కోసం గుండు గీసుకున్న తల్లి So, for everyone saying it's Photoshopped, here is her actual video. pic.twitter.com/2Zcro0nra7 — 💧 Petie R 🇦🇺🌟🦄🌱🌈🌏 (@PrinPeta) January 28, 2021 -
షూలో గుట్టలుగా సాలీళ్లు
మనీలా : ఓ పార్శిల్‌ను ఓపెన్ చేసి చూసిన నినోయ్ అక్వినో ఇంటర్నేషనల్ ఏయిర్పోర్టు అధికారులకు వింతైన అనుభవం ఎదురైంది. షూ జతలో ఏకంగా 119 అరుదైన సాలీళ్లు బయటపడటంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఫిలిప్పీన్స్ ఎన్ఏఐఏ ఏయిర్‌పోర్టులో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. గత నెల 28న ఎన్ఏఐఏ కస్టమ్స్ అధికారులు స్మగ్లింగ్ జరుగుతోందన్న సమచారంతో సోదాలు చేపట్టారు. ఓ పార్శిల్‌ను ఓపెన్ చేసి చూడగా అందులో స్పోర్ట్స్ షూలు కనిపించాయి. ( వారిపై జీవితాంతం నిషేధం విధించండి! ) వాటిని పరీక్షించగా చిన్న పాటి ప్లాస్టిక్ బాటిళ్లలో అరుదైన జాతికి చెందిన 119 సాలీళ్లు బయటపడ్డాయి. దీంతో అధికారులు వాటిని వన్య ప్రాణి సంరక్షణా కేంద్రానికి అప్పగించారు. కేసు నమోదు చేసుకుని స్మగ్లింగ్‌కు పాల్పడిన వారి కోసం అన్వేషిస్తున్నారు. ఆ పార్శిల్‌పై టూ అడ్రస్ కేవిట్లోని జనరల్ ట్రియాస్కు ఉన్నట్లు గుర్తించారు. ( ఇక లేదనుకున్నారు, కానీ 27 ఏళ్ల తరువాత...) -
ఆకాశంలో వింత: ప్రజల్లో భయభ్రాంతులు
సాక్షి, న్యూఢిల్లీ : బ్రెజిల్ దేశంలోని మినాస్ గెరేయిస్ పట్టణంలోని ప్రజలు ఇటీవల ఓ వింతను చూసి భయభ్రాంతులకు గురయ్యారు. కాస్త మబ్బు పట్టిన ఆకాశంలో పదులు, వందలు, వేలల్లో సాలె పురుగులు తేలియాడుతున్న దశ్యాన్ని చూసి ముందుగా అబ్బురపడ్డారు. ఆ తర్వాత అవి వర్షంలా ఆకాశం నుంచి కురుస్తున్నట్లు భ్రమపడి భయభ్రాంతులకు గురయ్యారు. ‘సావో పావులోకు ఈశాన్యంలో ఉన్న మా తాతగారి పొలానికి వెళుతుండగా, ఆకాశంలో నల్లటి మచ్చలు కనిపించాయి. ఇదేమిటంటూ కొంత ఎగువ ప్రాంతానికి Ðð ళ్లి చూడగా, అవన్నీ గాలిలో వేలాడుతున్న సాలె పురుగులని తెల్సింది. సాలె పురుగులు గాలిలో వేలాడడం ఏమిటనుకొని భయపడ్డాను’ అని ఆ దశ్యాన్ని చిన్న వీడియోగా తీసి ఆన్లైన్లో పోస్ట్ చేసిన గెరేయిస్ పట్టణ వాసి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ వింత గురించి ఫెడరల్ యూనివర్శిటీలోని అరక్నాలోజి ప్రొఫెసర్ అడల్బెర్టో డాస్ సాంటోస్‌ను ప్రశ్నించగా, ఆ సాలె పురుగులను ‘పరవిక్సియా బిస్ట్రియాట’ అనే చాలా అరుదైన జాతికి చెందినవని, అవి భూమిలోని వేడి, గాలిలోని తేమను తట్టుకోలేనప్పుడు కొన్ని గుంపులుగా రెండు చెట్ల మధ్య లేదా కొన్ని ఎల్తైన చెట్ల మధ్య గూళ్లను అల్లుతుందని, ఆ గూళ్లు మనిషి కంటికి కనిపించనంత సన్నగా ఉంటాయని, ఆ గూళ్లను అల్లుతూనో, వాటికి వేలాడుతూనో సాలె పురుగులు కనిపిస్తాయని చెప్పారు. కొన్ని సమయాల్లో గాలీ గట్టిగా వీచినప్పుడు చెట్ల అంచుల నుంచి గూడు తెగిపోయి గాల్లో కొంత దూరం ప్రయాణిస్తాయని చెప్పారు. ఆ తర్వాత ఏ చెట్టు మీదనో, నెల మీదనో బారీ సాలె గూడు, సాలె పురుగులతోపాటు పడిపోతుంది. ఈ సాలె గూడుతోగానీ, సాలె పురుగులతోగాని మానవులకు ఎలాంటి ముప్పు ఉండదని అవన్ని భారీ గూడు వల్ల దోమలు, ఇతర క్రిమీకీటకాలు రాకుండా సాలె గూడు అడ్డుపడుతుందని ప్రొఫెసర్ వివరించారు. -
శివుడాజ్ఞ లేకపోతే ఇలానే అవుతది..!
కాలీఫోర్నియా : తానోటి తలిస్తే దైవమొకటి తలిచిందని సామెత. ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది ఓ యువకుడికి. సాలీళ్లను చంపడానికి చేసిన ప్రయత్నంలో అతని ఇల్లే కాలి బూడిదయ్యింది. ఈ సంఘటన కాలిఫోర్నియాలోని ఫ్రెస్నోలో చోటు చేసుకుంది. వివరాలు.. ఫ్రెస్నో పట్టణానికి చెందిన ఓ 23 ఏళ్ల యువకుడు ఇంట్లో కూర్చుని తల్లిదండ్రులకోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సమయంలో నల్ల సాలెపురుగులో ఇంట్లోకి రావడం గమనించాడు. బ్లో టార్చ్ ఉపయోగించి వాటిని చంపడానికి ప్రయత్నించాడు. కానీ అది కాస్తా బెడిసి కొట్టి ఇల్లంతా మంటలు వ్యాపించాయి. అనుకోని ఈ సంఘటనకు బెదిరిపోయిన యువకుడి తేరుకుని ఇంట్లో నుంచి బయటకు పరుగు తీయడంతో ఎటువంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. -
యుద్ధానికి దిగినట్లుగా వేల సాలీడులు..
బ్రిటన్: అదొక అటవీ ప్రాంతంతో నిండిన పార్క్ లాంటి ప్రదేశం. అందులో కొండలు. సరదాగా గడిపేందుకు తమ పిల్లలను తీసుకొని వచ్చిన తల్లిదండ్రులు. సాధారణంగా స్వేచ్ఛగా ప్రకృతిలో విహరించే చిన్నారులంతా ఆ రోజు కూడా గంతులు వేస్తూ ఓ బండరాయి వద్దకు చేరుకున్నారు. దానికి చాలా చోట్ల రంధ్రాలు ఉన్నాయి. వాటిలో ఏమున్నాయా అని తొంగిచూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అందులో కుప్పలుకుప్పలుగా సాలీడు పురుగులు ఉన్నాయి. వాటిని చూడగానే భయంతో వణికిపోయారు. ఇదే విషయం అక్కడ ఉన్న ఓ వ్యక్తికి చెప్పగా ఆశ్చర్యపోతూ.. ఒక వేళ సాలీడులు ఉన్నా అవేం చేయవని, భయపడాల్సిన పనిలేదంటూ వారి భయం పోగొట్టేందుకు ఆ రంధ్రంలో చేయిపెట్టి సాలీడు తుట్టెను కిందపడేశాడు. అంతే.. అందులోని వేలకొలది సాలీడు ఒక్కసారిగా దాడికి దిగినట్లుగా ఎగబాకడంతో భయంతో పిల్లలంతా పరుగులు తీశారు. దానిని బయటకు తీసిన వ్యక్తి కూడా వాటిని చూసి హడలెత్తిపోయాడు. కాసేపట్లోనే వేల సాలీడులు ఆ బండరాయిని చుట్టేశాయి. -
కీటక నాశని విష వలయంలో సాలీళ్ల బందీ!
పంటలపై రసాయన కీటకనాశనుల పిచికారీతో మిత్ర కీటకాలకు జరిగే హాని గురించి తరచుగా వింటున్నదే. కానీ ప్రత్యేకించి సాలీళ్లపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతుందనే అంశంపై ఇటీవలే ఉత్తర అమెరికాలో జరిపిన ఓ పరిశోధన పలు ఆసక్తికర అంశాలను వెలుగులోకి తెచ్చింది. విస్తృతంగా కీటకనాశనుల వాడకం వల్ల సాలీళ్లపై దుష్ర్పభావం చూపుతోందని, ఇది ఇలానే కొనసాగితే వాటి మనుగడ ప్రశ్నార్థకమవుతుందని పరిశోధనలో వెల్లడైంది.. కెనడాలోని ఎంసీగిల్ యూనివర్శిటీకి చెందిన బృందం ఈ పరిశోధన నిర్వహించింది. సాలీళ్ళ సహజ స్వభావంలో పలు మార్పులు రావటాన్ని పరిశోధకులు గుర్తించారు. పంటలకు హానిచేసే కీటకాలను వేటాడటంలో వాటి సామర్థ్యం తగ్గింది. కీటకాల పీడను తగ్గించటంలోను.. కొత్త ప్రాంతాలకు విస్తరించటంలోను సాలీళ్లు నిరాసక్తత కనబరుస్తున్నట్టు కూడా వారు కనుగొన్నారు. ముఖ్యంగా అక్కడి ఉద్యానతోటలు, పంటలపై పిచికారీ కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్న పాస్మేట్ అనే కీటక నాశని ప్రభావం వల్ల శత్రు కీటకాలను నిర్మూలించటంలో వాటి సామర్థ్యం తగ్గినట్టు పరిశోధకులు గుర్తించారు. చీడపీడలను గుర్తించి తక్షణ స్పందించలేకపోవటం, ఎరలను పసిగట్టి ఆహారాన్ని సంపాదించుకునే క్రమంలో అవి వేగంగా స్పందించలేకపోతున్నాయి. అయితే ఈ ప్రభావం ఆడ, మగ సాలీళ్లపై చూపే ప్రభావంలో వ్యత్యాసాలున్నాయి.. కీటకనాశనుల ప్రభావానికి గురైనా వాటి ఆహారాన్ని సముపార్జించే సామర్థ్యాన్ని మగ సాలీళ్లు కోల్పోనప్పటికీ బాహ్యవాతావరణానికి అనుగుణంగా అన్వేషించగలిగే లక్షణాన్ని కోల్పోయాయి. ఆడ సాలీళ్లు మాత్రం ఆహారాన్వేషణలో వాటి పూర్వ సామర్థ్యాన్ని కొనసాగించగలిగాయి. ‘పంటకాలం ప్రారంభం నుంచి శత్రుకీటకాలను తిని రైతులకు మేలు చేసే సాలీళ్లు కీటకనాశనుల పిచికారీతో కుదేలవుతున్నాయి. త్వరలోనే ఈ పరిస్థితి మారకుంటే అత్యంత విలువైన వాటిని మనం కోల్పోవచ్చు’ అని ఎంసీగిల్ యూనివర్శిటీకి చెందిన రఫెల్రాయ్ పూర్వ పీహెచ్డీ విద్యార్థి ఆందోళన వ్యక్తం చేశారు. -
సాలీడు భయంతో నడుస్తున్న కారులోంచి దూకేసి.. !
ఇండియానా: బొద్దింకను, బల్లిని చూసి భయపడిపోయి గట్టిగా అరుస్తూ పారిపోయే మహిళలను చాలాసార్లు చూసి ఉంటాం. కానీ, నడుస్తున్న కారులోంచి అలాంటి భయంతో దూకేసిన మహిళలను చూడటం మాత్రం ఎప్పుడూ చూసి ఉండం. ఇండియానాలో మాత్రం ఓ మహిళ ఒక్కసారిగా తాను నడుపుతున్న కారు స్టీరింగ్‌ను వదిలేసి, కారులో ఉన్న కొడుకును మరిచిపోయి ఆ పనే చేసింది. ఏకంగా కారు నడుస్తుండగానే బయటకు దూకేసింది. అయితే అదృష్టం బాగుండి ఆ పిల్లాడు చిన్నపాటి గాయాలతో.. తృటిలో ప్రాణపాయం నుంచి తప్పించుకున్నాడు. అయితే ఆమె ఎందుకు అలా చేసిందో తెలుసా?... సిరాక్యూజ్ చెందిన ఎంజెలా కిప్ (35) అనే మహిళ తన తొమ్మిదేళ్ల కొడుకుతో కారులో బయలుదేరింది. ఇంతలో ఆమె భుజంపై ఒక సాలీడు పాకుతుండటం గమనించింది. ఒక్కసారిగా ఆమె భయపడిపోయింది. అంతే ఏమాత్రం ఆలోచించకుండా స్టీరింగ్ ను వదిలేసి... కదులుతున్న కారులో నుంచి ఒక్క ఉదుటున బయటకు దూకేసింది. దీంతో షాకైన ఆ తొమ్మిదేళ్ల పిల్లాడు డ్రైవింగ్ సీటులోకి జంప్ చేసి బ్రేక్ పై కాలు వేయకుండా గ్యాస్ పెడల్ పై వేశాడు. దీంతో కారు అదుపు తప్పి ఓ స్కూలు వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జయినా ఆ బాలుడు మాత్రం స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు అధికారులు ఆ బాలుడిని ఆస్పత్రిలోకి చేర్చించారు. ప్రమాదానికి కారణమైన తల్లిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇలా అతి చిన్న విషయాలకే అతిగా స్పందించడాన్ని ఆర్కానో ఫోబియా అంటారని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.