New Spider Species In Maharashtra Named After 26/11 Martyr Tukaram Omble - Sakshi
Sakshi News home page

2 కొత్త జాతుల సాలీళ్లకు 26/11 హీరో కాప్‌ పేరు

Published Mon, Jun 28 2021 3:54 PM | Last Updated on Mon, Jun 28 2021 5:34 PM

2 New Species Of Spiders Named After Tukaram Omble - Sakshi

ముంబై : శాస్త్రవేత్తలు సాలీళ్లలో రెండు కొత్త జాతుల్ని కనుగొన్నారు. మహారాష్ట్రలో కనుగొన్న ఈ రెండు కొత్త జాతులకు 26/11 టెర్రరిస్ట్‌ దాడిలో మృతి చెందిన ఏఎస్‌ఐ తుకారామ్‌ ఓంబుల్‌ పేరు పెట్టారు. ‘‘ ఐసియస్‌ తుకారామి’’ అని వీటికి నామకరణం చేశారు. ఐఎఫ్‌ఎస్‌ అధికారి పర్వీన్‌ కుశ్వాన్‌ తన అధికారిక ట్విటర్‌ ఖాతా ద్వారా ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ‘‘ మనం శోధించాల్సిన పకృతి ఇంకా ఎంతో మిగిలి ఉంది.. మహారాష్ట్రలో కనుక్కోబడిన సాలీళ్లలోని రెండు కొత్త జాతులకు పోలీసు అమరవీరుడు తుకారామ్‌ పేరు వచ్చేలా ‘‘ ఐసియస్‌ తుకారామి’’ అని శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. ఇలా అమర వీరులను గౌరవించుకోవటం చాలా మంచిది’’ అని పేర్కొన్నారు. 

కాగా, ముంబైకి చెందిన తుకారామ్‌ ఓంబుల్‌ 2008లో తాజ్‌హోటల్‌లో జరిగిన టెర్రరిస్ట్‌ దాడిలో మృత్యువాతపడ్డారు. 26/11న నిరాయుధుడైన తుకారామ్‌ కసబ్‌ను పట్టుకోవటానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో కసబ్‌ జరిపిన కాల్పుల్లో తుకారామ్‌ వీర మరణం పొందారు. 2009లో భారత ప్రభుత్వం ఆయనకు అశోక చక్ర ఇచ్చి గౌరవించింది.

చదవండి : వీడియో వైరల్‌: భారీగా బరువు తగ్గిన కిమ్‌ జాంగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement