శివుడాజ్ఞ లేకపోతే ఇలానే అవుతది..! | California Man Trying To Burn Spiders But His House On Fire | Sakshi
Sakshi News home page

సాలీళ్లను చంపబోయి...

Published Thu, Oct 25 2018 4:30 PM | Last Updated on Thu, Oct 25 2018 4:30 PM

California Man Trying To Burn Spiders But His House On Fire - Sakshi

సాలీళ్లను చంపడానికి చేసిన ప్రయత్నంలో కాలి బూడిదయిన ఇల్లు

కాలీఫోర్నియా : తానోటి తలిస్తే దైవమొకటి తలిచిందని సామెత. ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది ఓ యువకుడికి. సాలీళ్లను చంపడానికి చేసిన ప్రయత్నంలో అతని ఇల్లే కాలి బూడిదయ్యింది. ఈ సంఘటన కాలిఫోర్నియాలోని ఫ్రెస్నోలో చోటు చేసుకుంది. వివరాలు.. ఫ్రెస్నో పట్టణానికి చెందిన ఓ 23 ఏళ్ల యువకుడు ఇంట్లో కూర్చుని తల్లిదండ్రులకోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సమయంలో నల్ల సాలెపురుగులో ఇంట్లోకి రావడం గమనించాడు. బ్లో టార్చ్‌ ఉపయోగించి వాటిని చంపడానికి ప్రయత్నించాడు.

కానీ అది కాస్తా బెడిసి కొట్టి ఇల్లంతా మంటలు వ్యాపించాయి. అనుకోని ఈ సంఘటనకు బెదిరిపోయిన యువకుడి తేరుకుని ఇంట్లో నుంచి బయటకు పరుగు తీయడంతో ఎటువంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement