ప్రస్తుత జనరేషన్‌లో ప్రతీ ఎలక్ట్రానిక్ వస్తువుకు ఏదో ఒక స్పెషాలిటీ ఉంటోంది. ఇక, మనం ధరించే వాచ్‌ల విషయానికి వస్తే.. ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థ అయిన యాపిల్ వాచ్ ఎంతో స్పెషల్. అత్యాధునిక టెక్నాలజీ కలిగి ఉన్న యాపిల్ వాచ్.. క్రేజీ లైఫ్ సేవింగ్ ఫీచర్లతో మార్కెట్‌లోకి వచ్చింది. ఇప్పటికే ఈ యాపిల్ వాచ్ ఎంతో మంది ప్రాణాలకు కాపాడింది. తాజాగా ఎవరూ ఊహించని రీతిలో ఓ బాలిక ప్రాణాలను కాపాడింది. దీంతో, మరోసారి యాపిల్ స్మార్ట్‌వాచ్ తన ప్రత్యేకతను చాటుకుంది.
వివరాల ప్రకారం.. ఇమాని మైల్స్(12)కి యాపిల్ వాచ్ అంటే ఎంతో ఇష్టం. దీంతో, యాపిక్ స్మార్ట్‌వాచ్ కొనుగోలు చేసి తన చేతికి పెట్టుకోవడం ప్రారంభించింది. కాగా, యాపిల్ వాచ్ ధరించిన అనంతరం.. ఇమాన్ హెల్త్ గురించి వాచ్ ఎప్పటికప్పుడు ఆమెకు తెలియజేసింది. ఈ క్రమంలో ఓరోజు.. ఒక్కసారిగా యాపిల్ వాచ్.. ఇమాని హార్ట్‌రేట్ అసాధరణంగా ఎక్కువగా ఉందంటూ పలుమార్లు హెచ్చరించింది. ఈ విషయాన్ని గమనించిన ఆమె తల్లి జెస్సికా కిచెన్ ఆందోళనకు గురైంది. తన కూతురుకు ఏదో ఆరోగ్య సమస్య ఉందని భావించి వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లింది.
దీంతో, ఇమానికి వైద్య చికిత్సలు అందించిన అనంతరం.. ఆమెకు అపెండిక్స్‌లో న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ ఉందని కనుగొన్నారు. ఇటీవలి కాలంలో ట్యూమర్ పెరుగుతూ, ఇతర అవయాలకూ కూడా విస్తరిస్తున్నట్టు వైద్యులు గుర్తించారు. దీన్ని కేన్సర్ ట్యూమర్‌గా గుర్తించిన వైద్యులు.. సర్జరీ చేసి కణతులను తొలగించారు. ఇలా యాపిల్ వాచ్.. ఓ బాలిక ప్రాణాలను కాపాడింది. ఈ ఘటన అనంతరం.. ఇమాని తల్లి జెస్సికా కిచెన్ మాట్లాడుతూ.. వాచ్ కారణంగా నా కూతురుకు ఎంతో మేలు జరిగింది. ఈ విషయం తెలియకపోతే ఇంకా కొన్ని రోజలు ఆసుపత్రికి వెళ్లకుండా అలాగే ఉండిపోయేవాళ్లము అని తెలిపారు. ఇక, అంతకుముందు కూడా యాపిల్ వాచ్ యూకేకు చెందిన ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడింది.
#AppleWatch detects signs of rare #cancer, saves life of 12-year-old girlhttps://t.co/u9mPi3YXQp
— DNA (@dna) October 22, 2022
Comments
Please login to add a commentAdd a comment