life save
-
వైద్యుడే వాచ్ రూపంలో వచ్చినట్టు.. చిన్నారి ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్!
ప్రస్తుత జనరేషన్లో ప్రతీ ఎలక్ట్రానిక్ వస్తువుకు ఏదో ఒక స్పెషాలిటీ ఉంటోంది. ఇక, మనం ధరించే వాచ్‌ల విషయానికి వస్తే.. ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థ అయిన యాపిల్ వాచ్ ఎంతో స్పెషల్. అత్యాధునిక టెక్నాలజీ కలిగి ఉన్న యాపిల్ వాచ్.. క్రేజీ లైఫ్ సేవింగ్ ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది. ఇప్పటికే ఈ యాపిల్ వాచ్ ఎంతో మంది ప్రాణాలకు కాపాడింది. తాజాగా ఎవరూ ఊహించని రీతిలో ఓ బాలిక ప్రాణాలను కాపాడింది. దీంతో, మరోసారి యాపిల్ స్మార్ట్‌వాచ్ తన ప్రత్యేకతను చాటుకుంది. వివరాల ప్రకారం.. ఇమాని మైల్స్(12)కి యాపిల్ వాచ్ అంటే ఎంతో ఇష్టం. దీంతో, యాపిక్ స్మార్ట్‌వాచ్ కొనుగోలు చేసి తన చేతికి పెట్టుకోవడం ప్రారంభించింది. కాగా, యాపిల్ వాచ్ ధరించిన అనంతరం.. ఇమాన్ హెల్త్ గురించి వాచ్ ఎప్పటికప్పుడు ఆమెకు తెలియజేసింది. ఈ క్రమంలో ఓరోజు.. ఒక్కసారిగా యాపిల్ వాచ్.. ఇమాని హార్ట్‌రేట్ అసాధరణంగా ఎక్కువగా ఉందంటూ పలుమార్లు హెచ్చరించింది. ఈ విషయాన్ని గమనించిన ఆమె తల్లి జెస్సికా కిచెన్ ఆందోళనకు గురైంది. తన కూతురుకు ఏదో ఆరోగ్య సమస్య ఉందని భావించి వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లింది. దీంతో, ఇమానికి వైద్య చికిత్సలు అందించిన అనంతరం.. ఆమెకు అపెండిక్స్‌లో న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ ఉందని కనుగొన్నారు. ఇటీవలి కాలంలో ట్యూమర్ పెరుగుతూ, ఇతర అవయాలకూ కూడా విస్తరిస్తున్నట్టు వైద్యులు గుర్తించారు. దీన్ని కేన్సర్ ట్యూమర్‌గా గుర్తించిన వైద్యులు.. సర్జరీ చేసి కణతులను తొలగించారు. ఇలా యాపిల్ వాచ్.. ఓ బాలిక ప్రాణాలను కాపాడింది. ఈ ఘటన అనంతరం.. ఇమాని తల్లి జెస్సికా కిచెన్ మాట్లాడుతూ.. వాచ్ కారణంగా నా కూతురుకు ఎంతో మేలు జరిగింది. ఈ విషయం తెలియకపోతే ఇంకా కొన్ని రోజలు ఆసుపత్రికి వెళ్లకుండా అలాగే ఉండిపోయేవాళ్లము అని తెలిపారు. ఇక, అంతకుముందు కూడా యాపిల్ వాచ్ యూకేకు చెందిన ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడింది. #AppleWatch detects signs of rare #cancer, saves life of 12-year-old girlhttps://t.co/u9mPi3YXQp — DNA (@dna) October 22, 2022 -
కానిస్టేబుల్ ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే దుద్దుకుంట
పుట్టపర్తి టౌన్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ హెడ్ కానిస్టేబుల్‌ను సకాలంలో ఆస్పత్రికి చేర్చి పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ప్రాణాలు కాపాడారు. వివరాలు ఇలా.. తన సొంత పనిపై శనివారం రాత్రి అనంతపురానికి బయలుదేరిన ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి... జిల్లా కేంద్రానికి చేరువవుతుండగా రోడ్డు పక్కనే రక్తం గాయాలతో పడి ఉన్న వ్యక్తిని గమనించారు. వెంటనే తన వాహనాన్ని ఆపి పరిశీలించగా క్షతగాత్రుడు చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ మురళీగా గుర్తించారు. బైక్‌పై వెళుతూ అదుపు తప్పి కిందపడినట్లుగా తెలుసుకున్న ఆయన వెంటనే క్షతగాత్రుడిని తన వాహనంలో అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్సలు అందించాలని సూచించారు. చదవండి: సీఐ విచారణ: స్పృహ తప్పిన నిందితుడు అడ్డగోలు దోపిడీ: సీటీ ‘స్కామ్’ -
టార్చ్ వెలుగులో వెళ్లి ప్రాణం పోశాడు
సాక్షి, ఆత్మకూరు: ఓవైపు వర్షం, మరోవైపు చీకటి. ఆ స్థితిలో ఓ వ్యక్తి బైపాస్‌రోడ్డులో బురదలో పడి ఉన్నాడు. దారిన వెళ్లేవారు కూడా పట్టించుకోని పరిస్థితి. ఆత్మకూరు బైపాస్‌రోడ్డు శివార్లలో నూతనంగా ఓ అపార్ట్మెంట్ నిర్మిస్తున్నారు. ఆదివా రం రాత్రి అపార్ట్మెంట్ ఎదురుగా కాలువలో ఓ వ్యక్తి పడిపోయి ఒళ్లంతా బురదమయమై బాధతో మూలుగుతున్నాడు. ఆ సమయంలో గుర్తుతెలియని వ్యక్తి 100కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో స్పందించిన జిల్లా పోలీసులు ఆత్మకూరు పోలీసులకు సమాచారం తెలిపారు. ఎస్సై సి.సంతోష్‌కుమార్‌రెడ్డి సూచనల మేరకు కానిస్టేబుల్ కె.శ్రీనివాసులు రాత్రి 11.30 గంటల సమయంలో ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కాలువలో పడిపోయిన వ్యక్తిని గుర్తించారు. చదవండి: (నెల రోజుల్లో వివాహం.. అర్ధరాత్రి దారుణహత్య) 108కి ఫోన్ చేయగా పట్టణంతోపాటు సమీపంలోని మూడు మండలాల వాహనాలు అందుబాటులో లేకపోవడంతో కానిస్టేబుల్ శ్రీనివాసులు బాధితుడిని గుర్తించేందుకు టార్చ్ వెలుగులో ప్రయత్నించారు. బాధితుడు వెంకట్రావుపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించి, వర్షంలోనే బాధితుడి ఇంటికి వెళ్లి సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల సహకారంతో ఆ యువకుడిని బయటకు తెచ్చారు. మద్యం మత్తులో పడిపోయాడనే అను మానం వ్యక్తం చేసినా, మూర్ఛతో పడిపోయినట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్నారు. ఎట్టకేలకు గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి వైద్య సహాయం అందించారు. తీవ్ర వర్షంలోనూ మానవత్వంతో స్పందించిన కానిస్టేబుల్ శ్రీనివాసులును పలువురు అభినందించారు. చదవండి: (కన్నా..నీ వెంటే మేమంతా..!) -
దేవుడు జన్మనిస్తే.. అతను పునర్జన్మనిచ్చాడు..!
సాక్షి, ముంబై: ప్రయాణ సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. మన నిత్య జీవితంలో కొంతమంది కదులుతున్న రైలు నుంచి దిగడం మనం చూస్తుంటాం. పట్టు తప్పితే అంతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఓ ప్రయాణికుడు కదులుతున్న ట్రైన్ నుంచి దిగడానికి ప్రయత్నించి రైలు కిందకు పడబోయ్యాడు. అక్కడే ప్లాట్ ఫామ్‌పై ఉన్న టీటీఈ కింద పడుతున్న ఆ వ్యక్తిని గమనించి, అతడ్ని సేవ్ చేశాడు. అతనికి దేవుడు జన్మనిస్తే.. ఆ వ్యక్తి పునర్జన్మను ఇచ్చాడు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తొటి ప్రయాణికులు ఆ టీటీఈని పొకడ్తలతో ముంచెత్తారు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. -
ప్రయాణికుల సమయస్ఫూర్తి... ప్రాణాలు కాపాడింది
ట్రాక్టర్ బోల్తా వ్యక్తి పరిస్థితి విషమం సకాలంలో స్పందించిన వాహనదారులు వి.కోట : ఎదురుగా వస్తున్న లారీని తప్పించే యత్నంలో ఓ ట్రాక్టర్ పొలాల్లోకి దూసుకుని వెళ్లి, బోల్తా పడింది. రహదారిపై ఇతర వాహనాల్లో వెళుతున్న వారందరూ అదిరిపడ్డారు. వెంటనే తమ వాహనాలు నిలిపి, ఉరుకులు, పరుగులతో ట్రాక్టర్ వద్దకు చేరుకున్నారు. బోల్తా పడిన ట్రాక్టర్ కింద ఇరుకున్న వారిని సకాలంలో రక్షించి, ఆస్పత్రికి తరలించడం ద్వారా మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సంఘటన బుధవారం పలవునేరు జాతీÄýæు రహదారిలో కొవ్మురవుడుగు వద్ద జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇవి. వుండలంలోని చిన్నశ్యావుకు చెందిన సీతారావుÄýæ్యు(35), సుబ్రవుణ్యం(40) ట్రాక్టర్లో బైరెడ్డిపల్లెకు బÄýæులుదేరారు. వూర్గవుధ్యలో దానవుÄýæ్యుగారిపల్లె, కొవ్మురవుడుగు వద్ద ఎదురుగా వచ్చిన లారీని తప్పించే Äýæుత్నంలో ట్రాక్టర్ అదుపు తప్పింది. వేగంగా పక్కనున్న పొలాల్లోకి దూసుకెళ్లి, బోల్తాపడింది. ఆ వూర్గం గుండా వెళుతున్న ప్రయాణికులు, వాహనాలు ఆపేశారు. సకాలంలో స్పందించి ట్రాక్టర్ కింద చిక్కుక్నున వ్యక్తులను బÄýæుటకు లాగారు. వారిలో సీతారావుÄýæ్యు పరిస్థితి విషవుంగా ఉండడంతో స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. ప్రథవు చికిత్స అనంతరం 108లో కుప్పం పీఈఎస్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వాహనదారుల సమయస్ఫూర్తి వల్ల ప్రమాద భాధితులకు సకాలంలో సేవలు అందాయి.