సాక్షి, ముంబై: ప్రయాణ సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. మన నిత్య జీవితంలో కొంతమంది కదులుతున్న రైలు నుంచి దిగడం మనం చూస్తుంటాం. పట్టు తప్పితే అంతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఓ ప్రయాణికుడు కదులుతున్న ట్రైన్ నుంచి దిగడానికి ప్రయత్నించి రైలు కిందకు పడబోయ్యాడు. అక్కడే ప్లాట్ ఫామ్‌పై ఉన్న టీటీఈ కింద పడుతున్న ఆ వ్యక్తిని గమనించి, అతడ్ని సేవ్ చేశాడు. అతనికి దేవుడు జన్మనిస్తే.. ఆ వ్యక్తి పునర్జన్మను ఇచ్చాడు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తొటి ప్రయాణికులు ఆ టీటీఈని పొకడ్తలతో ముంచెత్తారు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది.
దేవుడు జన్మనిస్తే.. అతను పునర్జన్మనిచ్చాడు..!
Published Sat, Feb 17 2018 3:57 PM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment