TTE
-
టీటీఈని రైలు నుంచి తోసేసిన ప్రయాణికుడు!
కేరళలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ములంగున్నాతుకావు, వడక్కంచెరి రైల్వే స్టేషన్ల మధ్య వెలప్పయ్య త్రిస్సూర్‌లో ఈ ఘటన జరిగింది. ఎర్నాకుళం-పాట్నా ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్ 11 కోచ్‌లో టీటీఈ వినోద్ ప్రయాణికుల టిక్కెట్ల తనిఖీలో భాగంగా ఒక ప్రయాణికుడిని టిక్కెట్ చూపించమని అడిగాడు. ఈ నేపధ్యంలో ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. ఆగ్రహంతో ఆ ప్రయాణికుడు టీటీఈని వేగంగా వెళుతున్న రైలు నుండి కిందకు తోసేశాడు. దీంతో టీటీఈ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని కేరళ రైల్వే పోలీసులు మీడియాకు తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ప్రయాణికుడు రజనీకాంత్ టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నాడు. ఇంతలో టీటీఈ వినోద్ అతనిని టిక్కెట్ అడిగాడు. ఈ నేపధ్యంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మద్యం మత్తులో డోర్ దగ్గర నిలుచున్న ప్రయాణికుడు టీటీఈ వినోద్‌ను కదులుతున్న రైలులో నుంచి కిందకు తోసివేశాడు. ఇంతలో అటువైపు నుంచి వస్తున్న మరో రైలు ఆ టీటీఈని ఢీకొంది. దీంతో టీటీఈ అక్కడకక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రయాణికుడు రజనీకాంత్‌ను పాలక్కడ్‌లో అరెస్టు చేశారు. -
జనరల్ టిక్కెట్‌తో ఏసీ కోచ్‌లోకి మహిళ.. ప్రతాపం చూపిన టీటీఈ!
నియమ నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం శిక్ష విధించాలి.. కానీ శిక్ష పేరుతో ఒక్కోసారి అధికారులు చెలరేగిపోతుంటారు. ఇటువంటి ఉదంతమొకటి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓ మహిళ జనరల్ టిక్కెట్‌తో రైలులోని ఏసీ కోచ్ ఎక్కేసింది. ఈ విషయాన్ని గమనించిన టీటీఈ ఆమెపై తన ప్రతాపం చూపాడు. ఈ ఘటన ఢిల్లీ ఎన్సీఆర్ లోని ఫరీదాబాద్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. జనరల్ టిక్కెట్‌తో ఒక మహిళ జీలం ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ బోగీలోకి ఎక్కేసింది. దీనిని గమనించిన అదే రైలులోని టీటీఈ ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైలులో నుంచి తోసివేశాడు. దీంతో ఆమె రైలు- ప్లాట్‌ఫారమ్ మధ్య చిక్కుకుపోయింది. ఆ మహిళ ఆర్తనాదాలు విన్న పోలీసులు అతి కష్టం మీద ఆమెను కాపాడగలిగారు. బాధితురాలికి తల, చేతులు, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను ఝాన్సీలో ఒక వివాహానికి హాజరు కావాల్సి ఉందని, అయితే తను స్టేషన్‌కు చేరుకునే సమయానికి, రైలు నెమ్మదిగా కదులుతున్నదని, దీంతో కనిపించిన బోగీలో వెంటనే ఎక్కేశానని తెలిపింది. ఈ విషయాన్ని టీటీఈకి చెప్పినా పట్టించుకోలేదని, తగిన జరిమానా చెల్లిస్తానని తాను చెప్పినా వినకుండా రైలు నుంచి తోసివేశారని ఆమె ఆరోపించింది. కాగా ఈ ఉదంతపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
టీటీఈలకు బాడీ కెమెరాలు
న్యూఢిల్లీ: టికెట్ల తనిఖీలో పారదర్శకత, రైలు ప్రయాణికుల అనుచిత ప్రవర్తనను అరికట్టేందుకు టికెట్ తనిఖీ అధికారుల(టీటీఈ)లకు బాడీ కెమెరాలు అమర్చేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా సెంట్రల్ రైల్వే పరిధిలోని ముంబై డివిజన్‌కు చెందిన 50 మంది టీటీలకు బాడీ కెమెరాలను సిద్ధం చేసింది. ఒక్కో కెమెరా ఖరీదు రూ.9 వేలు. ఇవి 20 గంటల ఫుటేజీని రికార్డు చేయగలుగుతాయి. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే దేశమంతటా అమలు చేస్తామని అధికారులు తెలిపారు. ఇటీవల సెంట్రల్ రైల్వేలో ఓ టీటీఈ మహిళా ప్రయాణికురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో అధికారులు సస్పెండ్ చేశారు. ఇటువంటి ఘటనలను నివారించి, సిబ్బందిలో బాధ్యత పెంచేందుకు కూడా ఇవి సాయపడతాయని సెంట్రల్ రైల్వే పేర్కొంది. -
ఈ సారి విమానం కాదు ట్రైన్.. ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన టీటీఈ!
లక్నో: ఇటీవల విమానాల్లో ప్రయాణికులు తోటి వారితో లేదా అందులోని సిబ్బందితో అనుచిత ప్రవర్తిస్తున్న ఘటనలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ ఘటనల్లో కొందరు కటకటాల పాలయ్యారు కూడా. అయినా వీటికి ఫుల్ స్టాప్ మాత్రం పడేలా కనిపించడం లేదు. తాజాగా ఈ తరహా ఘటనే ఓ రైల్లో వెలుగుచూసింది. ఈ వ్యవహారంలో నిందితుడు ఓ రైల్వే అధికారి కావడం గమనార్హం. ఆ వ్యక్తి చేసిన పనికి చివరికి కటకటాలపాలయ్యాడు. అక్కడ ఏం జరిగిందంటే... మద్యం మత్తులో టీటీఈ... ఓ మహిళ తన భర్తతో కలిసి అమృత్సర్- కోల్‌కతా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తోంది. అర్ధరాత్రి కావడంతో ప్రయాణికులతో పాటు ఆ జంట కూడా నిద్రలోకి జారుకుంది. ఇంతలో మద్యం మత్తులో ఉన్న ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ) ఆ మహిళపై మూత్రవిసర్జన చేశాడు. మహిళ నిద్రలేచి అరవడంతో ఆమె భర్త టీటీఈని పట్టుకోగలిగాడు. మహిళ అరుపులు విని ఇతర ప్రయాణీకులు కూడా మేల్కొని టీటీఈని కొట్టారు. తర్వాత స్టేషన్ రాగానే టీటీఈని ప్రభుత్వ రైల్వే పోలీసులకు (GRP) అప్పగించారు. నిందితుడిని బిహార్‌కు చెందిన మున్నా కుమార్‌గా గుర్తించారు. ఈ మేరకు టీటీఈపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. గతంలో.. కొన్ని నెలల క్రితం విమానంలో ఇదే తరహాలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తన పక్కనే కూర్చున్న మహిళపై మూత్ర విసర్జనకు పాల్పడ్డాడు. అనంతరం అమెరికాలో పనిచేస్తున్న భారతీయుడు శంకర్ మిశ్రాను అదుపులోకి తీసుకుని ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించకుండా 4 నెలల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా న్యూయార్క్ నుంచి ఢిల్లీకి అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రయాణిస్తున్న సమయంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి తన పక్కనే కూర్చున్న ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. ఆ తర్వాత ఐజీఐ విమానాశ్రయంలో ప్రయాణికుడిని అరెస్టు చేశారు. -
టీటీ వర్సెస్ పోలీస్: ట్రైన్ ఏమి ఎవరి అబ్బ సొత్తు కాదు!
రైలులో టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ పోలీసు బృందం పట్టుబడింది. టిక్కెట్ కలెక్టర్ తనిఖీ చేయడానికి వస్తూ..వారిని టిక్కెట్ చూపించమని అడగగా.. బెదిరింపులకు దిగారు. దాదాగిరి చేసే ప్రయత్నం చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఓ రైలులో చోటు చేసుకుంది. అక్కడ ఉన్న ప్రయాణికులను బెదిరించి మరీ ఈ పోలీసు బృందం కూర్చొన్నారు. ఐతే ఇంతలో టిక్కెట్ కలెక్టర్ వచ్చి టిక్కెట్లు గురించి ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. ఆ పోలీసు బృందం టిక్కెట్ లేకుండా ప్రయాణించడమే కాకుండా ప్రయాణికుల సీట్లను ఆక్రమించారు. దీంతో టిక్కెట్ కలెక్టర్ వారిని ఈ విషయమై నిలదీయగా..రకరకాలుగా బెదిరింపులకు దిగడం, దాదాగిరి చేయడం వంటివి చేశారు. ఐతే టీటీ కూడా ఏమాత్రం తగ్గకుండా వారిని ఆయా సీట్ల నుంచి ఖాళీ చేయించాడు. దాదాగిరి చేసేందుకు రైలు ఏమి ఎవరి అబ్బ సొత్తు కాదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పాడు. దీంతో ఆ పోలీసులు ఇక చేసేది లేక అలా నుంచునే ఉన్నారు. ఎక్కడపడితే అక్కడ పవర్ ఉపయోగించడం కుదరదు. అది కూడా నిజాయితీగా తమ డ్యూటీని నిర్వర్తించే వారి వద్ద అస్సలు కుదరదు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఐతే ఈ విషయంపై స్పందించిన సంబంధిత రైల్వే పోలీసులు ఈ ఘటనపై చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులకు నివేదించినట్లు తెలిపారు. …तू शेर तो मैं सवा शेर.. A team of @Uppolice at receiving end from an empowered senior citizen passenger who objected the ‘दादागिरी’ of men in uniform. A regular in trains crossing UP where reserved passengers are intimidated to share space @RailMinIndia pic.twitter.com/ZJUiDicnCv — Deepak Kumar Jha (@journalistjha) March 13, 2023 (చదవండి: భవనంపై నుంచి పడి ఎయిర్‌హోస్ట్ మృతి.. బాయ్‌ఫ్రెండ్ అరెస్ట్) -
రన్నింగ్ రైలు నుంచి నెట్టివేత.. విషమంగా సైనికుడి పరిస్థితి
క్రైమ్: టికెట్ విషయంలో ఆ ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగింది. అయితే కోపంతో వేగంగా వెళ్తున్న రైలు నుంచి కిందకు నెట్టేయడంతో.. భారత సైన్యంలో పని చేసే ఆ వ్యక్తి తన కాలును కోల్పోయాడు. అంతేకాదు అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తర ప్రదేశ్ బరేలీ జంక్షన్ వద్ద గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సోనూ అనే సైనికుడు.. దిబ్రుఘడ్-కొత్త ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో టీటీఈ సుపాన్ బోర్ అక్కడికి వచ్చాడు. ఇద్దరి మధ్య జరిగిన టికెట్ విషయంలో ఏదో గొడవ జరిగింది. వాగ్వాదం జరుగుతున్న టైంలో కోపం కట్టలు తెంచుకున్న సుపాన్.. సోనూని ఒక్కసారిగా రైలు బయటకు నెట్టేశాడు. దీంతో రైలు కిందకు వెళ్లిపోయి తీవ్రంగా గాయపడ్డాడు సోనూ. అది గమనించిన స్థానికులు రైలును ఆపేసి.. టీటీఈని చితకబాదారు. దీంతో సుపాన్ బోర్ అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే సోనూని మిలిటరీ ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు అతని కాలిని తొలగించినట్లు తెలుస్తోంది. సోను పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం. మర్డర్ అటెంప్ట్ నేరం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న సుపాన్ కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ఏం జరిగిందో పరిశీలిస్తామని రైల్వే అధికారులు చెప్తున్నారు. -
టీటీఈపై రైల్వే ప్రయాణికుడి దాడి
అనంతపురం, హిందూపురం: హిందూపురం రైల్వే పరిధిలోని టీటీఈ రమణారెడ్డిపై ప్రయాణికుడు దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మంగళవారం రాత్రి బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న కర్ణాటక ఎక్స్‌ప్రెస్ రైలులో టీటీఈ రమణారెడ్డి గౌరిబిదనూర్ స్టేషన్ దాటిన తర్వాత టికెట్ల తనిఖీలు చేపట్టారు. జనరల్ టికెట్ తీసుకున్న నిఖిల్‌పటేల్ రిజర్వేషన్ బోగీలో ప్రయాణిస్తుండటాన్ని గుర్తించి, ఫైన్ కట్టాలని ఆదేశించాడు. ఒక వేళ ఫైన్ కట్టలేకుంటే దిగిపోవాలని చెప్పాడు. తాను దిగిపోయేది లేదని నిఖిల్ పటేల్ టీటీఈపై దాడి చేసి గాయపరిచాడు. దీంతో టీటీఈ రమణారెడ్డి హిందూపురం రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జీఆర్పీ పోలీసులు నిఖిల్‌పటేల్‌పై కేసునమోదు చేసి, అరెస్టుచేశారు. విధి నిర్వహణలో ఉన్న టీటీఈపై విచక్షణారహితంగా దాడి చేయడాన్ని ఎస్‌డబ్ల్యూఆర్‌ఎంయూ నాయకులు శేఖర్, కిరణ్ ఖండించారు. -
ఈ శతాబ్దిలో మొత్తం మహిళలే!
మగ టీటీఈ డ్యూటీ చేసినప్పటికంటే మహిళలు డ్యూటీ చేసిన రోజు పెనాల్టీలు 66 శాతం పెరగడాన్ని అధికారులు గుర్తించారు! మహిళలు నిజాయితీగా ఉద్యోగం చేస్తారనడానికి ఇదొక నిదర్శనం. ఇటీవలే ముంబైలోని మాతుంగ రైల్వేస్టేషన్ మొత్తం మహిళా ఉద్యోగులతో వార్తల్లోకొచ్చింది. అలాగే జైపూర్‌లోని గాంధీనగర్ రైల్వేస్టేషన్. అక్కడ కూడా అంతా మహిళా సిబ్బందే. ఇప్పుడు మరో మెట్టు. అహ్మదాబాద్ – ముంబయి మధ్య తిరిగే శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ఇకనుంచీ టీటీఈ (ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్)లందరూ మహిళలే ఉండబోతున్నారు. రానున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నుంచి ఈ నిర్ణయాన్ని అధికారికంగా అమలులోకి తేబోతోంది ఇండియన్ రైల్వే. పెనాల్టీలు పెరగాలంటే మహిళలు ఉండాల్సిందే ఒక రూట్లో టీటీఈలందరూ మహిళలే ఉండాలనే నిర్ణయానికి కారణం వారిలోని నిజాయితీనే అంటున్నారు పశ్చిమ రైల్వే సీనియర్ డివిజినల్ కమిషనర్ ఆర్తి సింగ్. అహ్మదాబాద్– ముంబై రూట్లో టికెట్ లేకుండా ప్రయాణించేవాళ్లు, జనరల్ టికెట్‌తో రిజర్వేషన్లో ప్రయాణించేవాళ్లు ఎక్కువగా కనిపిస్తుంటారు. టికెట్ చూపించమని అడిగితే మొండికేసే ప్రయాణికులు కూడా ఎక్కువే. అయితే ఈ రూట్లో మగ టీటీఈ డ్యూటీ చేసినప్పటికంటే మహిళలు డ్యూటీ చేసిన రోజు పెనాల్టీలు 66 శాతం పెరగడాన్ని అధికారులు గుర్తించారు! ‘‘మహిళలు నిజాయితీగా ఉద్యోగం చేస్తారనడానికి ఇదొక నిదర్శనం’’ అని ఆర్తి సింగ్ అంటున్నారు. ట్రయల్ రన్లో ఇది నిరూపణ అయింది కూడా. అలాగే, టికెట్ లేని ప్రయాణికుడికి వంద రూపాయలు చలాన్ రాయాల్సిన చోట యాభై రూపాయలు జేబులో వేసుకుని చూసీ చూడనట్లు వెళ్లే మగ టీటీఈల అవినీతిని అరికట్టడానికి కూడా ఈ నిర్ణయం తోడ్పడుతుందనే అభిప్రాయం కూడా ఉంది. షిఫ్టుకి ఇద్దరే ఇప్పుడు ఇక నుంచి ఆరుగురు! ఇంతవరకు ‘శతాబ్ది’లో ఆరుగురిలో షిఫ్ట్‌కి ఇద్దరే మహిళా టీటీఈలు ఉండేవారు. ఇక నుంచి మొత్తం మహిళలే ఉంటారు. ప్రస్తుతానికి ఒక షిఫ్ట్.. అంటే ఆరున్నర గంటల టైమ్ మాత్రమే మొత్తం మహిళా టీటీఈలు డ్యూటీలో ఉండగలుగుతారు. ఈ సంఖ్యను ఇంకా పెంచాలనే ఉద్దేశంలో ఉన్నారు అధికారులు. టికెట్ లేకుండా ప్రయాణించడానికి అలవాటు పడిన కరడుగట్టిన ప్రయాణికులతో మగ టీటీఈలకు తరచూ గొడవలు కూడా వస్తుంటాయి. అదే ఆడవాళ్లయితే వాదన పెంచకుండా చలాన్ రాసి డబ్బు కట్టమంటారు. కట్టకపోతే రైల్వే పోలీస్‌కి సమాచారం ఇస్తారు. దాంతో సమస్య తేలిగ్గా పరిష్కారం అవుతుంది. – మంజీర -
శతాబ్ది రైలుకు మహిళా టీటీఈలు
న్యూఢిల్లీ: భారత రైల్వే మరో నూతన అధ్యాయానికి తెరతీయనుంది. ముంబై– అహ్మదాబాద్ మధ్య నడిచే శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో కేవలం మహిళా ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ల(టీటీఈ)నే నియమించాలని నిర్ణయించింది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దీనిని ప్రయోగాత్మకంగా అమలుచేయనున్నారు. శతాబ్దిలో 30 మంది మహిళా టీటీఈల బృందం విధులు నిర్వహించనుంది. -
రన్నింగ్ ట్రైన్ నుంచి దిగడానికి ప్రయత్నించి..
-
దేవుడు జన్మనిస్తే.. అతను పునర్జన్మనిచ్చాడు..!
సాక్షి, ముంబై: ప్రయాణ సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. మన నిత్య జీవితంలో కొంతమంది కదులుతున్న రైలు నుంచి దిగడం మనం చూస్తుంటాం. పట్టు తప్పితే అంతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఓ ప్రయాణికుడు కదులుతున్న ట్రైన్ నుంచి దిగడానికి ప్రయత్నించి రైలు కిందకు పడబోయ్యాడు. అక్కడే ప్లాట్ ఫామ్‌పై ఉన్న టీటీఈ కింద పడుతున్న ఆ వ్యక్తిని గమనించి, అతడ్ని సేవ్ చేశాడు. అతనికి దేవుడు జన్మనిస్తే.. ఆ వ్యక్తి పునర్జన్మను ఇచ్చాడు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తొటి ప్రయాణికులు ఆ టీటీఈని పొకడ్తలతో ముంచెత్తారు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. -
రైల్వే టీటీపై మహిళా పోలీసు దాడి
ఏలూరు(సెంట్రల్) : రైల్వే టీటీపై ఓ మహిళా పోలీసు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై టీటీ విజయవాడ రైల్వే ఎస్పీ షీమూషీ వాజ్‌పేయికి ఫిర్యాదు చేయడంతో ఆమె విచారణ చేయాల్సిందిగా ఏలూరు రైల్వే పోలీసులను ఆదేశించారు. బాధితుడి కథనం ప్రకారం.. ఈనెల 15న గురువారం పోలీసు యూనిఫాంలో ఉన్న ఓ మహిళ రాజమండ్రి నుంచి విజయవాడ వైపు వెళ్తున్న రైలులోని ఏసీ బోగీలో ఎక్కింది. ఆ బోగీలో విధులు నిర్వర్తిస్తు్తన్న టీటీ ఎన్.రమణమూర్తి రైలు ఏలూరు రైల్వే స్టేషన్ సమీపంలోకి వచ్చే సరికి ఆ మహిళను టిక్కెట్ అడిగారు. దీనికి ఆమె తాను ఇన్స్పెక్టర్ని అని, దురుసుగా వ్యవహరించడంతోపాటు టీటీపై దాడి చేసింది. అనంతరం ఆమె ఏలూరు రైల్వేస్టేషన్లో దిగి వెళ్లిపోయింది. దీంతో టీటీ రమణమూర్తి విజయవాడలో రైల్వే ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆమె దీనిపై విచారణ చేయాలని ఏలూరు రైల్వే పోలీసులను ఆదేశించారు. విచారణ చేపట్టిన రైల్వే పోలీసులు గత గురువారం నాటి సీసీ టీవీ ఫుటేజీలను సేకరించారు. బాధితుడు చెబుతున్న సమయంలో ఓ మహిళా పోలీసు రైల్వే స్టేషన్ నుంచి వెళ్లడాన్ని గమనించారు. -
ఐక్లీన్లో జపాన్ కంపెనీ పెట్టుబుడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇంటిగ్రేటెడ్ క్లీన్‌రూమ్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఐక్లీన్)లో 26శాతం వాటాను జపాన్‌కు చెందిన టకసాగో థర్మల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ (టీటీఈ) కొనుగోలు చేసింది. కానీ ఈ వాటాను ఎంత మొత్తానికి కొనుగోలు చేసింది తెలియచేయలేదు. 98 ఏళ్ల నుంచి ఇంజనీరింగ్ సేవల్లో ఉండి 2.5 బిలియన్ డాలర్ల టర్నోవర్ కలిగి ఇంధన పొదుపులో అనేక పేటెంట్లు ఉన్న టీటీఈ భాగస్వామిగా చేరడం ద్వారా మరిన్ని రంగాలకు, దేశాలకు విస్తరించగలమన్న ధీమాను ఐక్లీన్ వ్యక్తం చేసింది. ఈ ఒప్పందం వివరాలను తెలియచేయడానికి బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐక్లీన్ ఫౌండర్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ కె.గోపీ మాట్లాడుతూ టీటీఈ జపాన్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదై ఉండటంతో ఒప్పందం విలువను ఇప్పుడే తెలియచేయలేమన్నారు. ప్రస్తుతం ఐక్లీన్ కంపెనీ టర్నోవర్ రూ. 310 కోట్లని, మూడేళ్లలో ఏటా 40 శాతం వృద్ధితో రూ. 1,000 కోట్ల మార్కును అధిగమించాలని లక్ష్యమని తెలిపారు. ప్రస్తుతం ఐక్లీన్కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో మొత్తం మూడు తయారీ కేంద్రాలు ఉన్నాయి. త్వరలోనే మరో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు గోపి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీటీఈ జనరల్ మేనేజర్ మసాటో నకమురా మాట్లాడుతూ ఐక్లీన్తో చేతులు కలపడం ద్వారా మరిన్ని దేశాలకు వేగంగా విస్తరించే అవకాశం ఉందన్నారు. -
ప్రయాణికురాలితో టీటీఈ అసభ్య ప్రవర్తన
దాడి చేసి రూ. 12 వేలు జరిమానా విధించిన వైనం కేసు నమోదు చేసిన ఆర్పీఎఫ్ పోలీసులు సికింద్రాబాద్: ఎంఎంటీఎస్ రైళ్లో ప్రయాణిస్తున్న మహిళతో రైల్వే టీటీఈ అనుచితంగా మాట్లాడి, అసభ్యకరంగా ప్రవర్తించడం కలకలం సృష్టించింది. సీజన్ టికెట్‌తో ఏసీ బోగీలో ఎక్కిన పాపానికి సదరు మహిళకు రూ.12 వేలు జరిమానా విధిస్తూ చలానా రాయడంతో పాటు ఇదేంటని ప్రశ్నించిన పాపానికి టీటీఈ గాయపర్చడం పోలీసులను సైతం దిగ్భ్రాంతికి గురి చేసింది. శుక్రవారం జరిగిన ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆర్పీఎఫ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్పీఎఫ్ పోలీసులు, బాధితురాలి కథనం ప్రకారం....మియాపూర్‌కు చెందిన లోక్‌సత్తా పార్టీ గ్రేటర్ అధ్యక్షురాలు చంద్ర మధ్యాహ్నం లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్లే రైలులోని ఒకటవ క్లాస్ బోగీ ఎక్కారు. ఆ బోగీలో ఆమె ఒక్కర్తే కూర్చొని ఉన్నారు. ఆ బోగీకి ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గార్డుగా ఉన్నాడు. చందానగర్ దాటగానే నరేష్‌రాజ్ అనే టీటీఈ బోగీలోకి ఎక్కి టికెట్ చూపించమని చంద్రను అడిగాడు. ఆమె తనవద్ద నున్న సీజన్ టికెట్‌ను చూపించింది. ‘టికెట్‌పై నీ సంతకం లేదు. అయినా సీజన్ టికెట్‌తో ఫస్ట్‌క్లాస్ బోగీలో ఎందుకు కూర్చున్నావ్ అంటూనే దుర్భాలాడాడు. అవసరమైతే చలానా విధించుకో.. అమర్యాదగా మాట్లాడితే ఊరుకునేది లేదని చంద్ర అంది. దీంతో ఆగ్రహించిన టీటీఈ ఎక్కువ మాట్లాడుతున్నావేంటని చంద్రను నెట్టివేయడంతో ఆమె చేతులకు గాయాలయ్యాయి. ఆ బోగీలోని గార్డు వారించబోగా టీటీఈ.. ‘ఇది నీ డ్యూటీ కాదు.. నోర్మూసుకుని కూర్చో’ అని అన్నాడు. తర్వాత చంద్రకు రూ. 12 వేల జరిమానా విధిస్తూ చలనా రాసి.. ఆమెను బేగంపేట్ రైల్వేస్టేషన్లో దింపేశాడు. దీంతో బాధితురాలు ఆర్పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి పంపించారు. అనంతరం రైల్వే మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి, టీటీఈ నరేష్ కోసం గాలిస్తున్నారు. ఇదిలాఉండగా చంద్ర అనే మహిళా ప్రయాణికురాలు తనతో అసభ్యకరంగా మాట్లాడి దాడికి యత్నించిందని టీటీఈ నరేష్‌రాజ్ ఆర్పీఎఫ్ పోలీసులకు ప్రతి ఫిర్యాదు చేసి.. అందుబాటు లేకుండాపోయినట్టు తెలిసింది. -
టీటీఈపై ప్రయాణికుల దాడి
గాయపడడంతో ఉస్మానియాకు తరలింపు హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఎంఎంటీఎస్‌లో రైలులో ఓ టీటీఈ(ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్)పై ముగ్గురు మహిళలు దాడికి పాల్పడ్డారు. నాంపల్లి జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం... టీటీఈ కౌసల్య సికింద్రాబాద్ నుంచి లింగంపల్లికి వెళ్లే ఎంఎంటీఎస్(47150) ట్రైన్లో బుధవార ం ఉదయం విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కుమారి, పద్మ, రాధ అనే ప్రయాణికులు బేగంపేట్ రైల్వేస్టేషన్ సమీపంలో టికెట్ లేకుండా పట్టుబడ్డారు. దీంతో వారిపై రూ.250 చొప్పున జరి మానా విధించారు. దీంతో వాగ్వాదానికి దిగి టీటీఈపై దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు బేగంపేట్ స్టేషన్లో పద్మ, కుమారీలను అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ కౌసల్యను ఉస్మానియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలిం చారు. టీటీఈపై దాడిని నిరసిస్తూ మజ్దూర్ యూని యన్ నాంపల్లి జీఆర్పి స్టేషన్ వద్ద నిరసన చేపట్టిం ది. టికెట్టు తీసుకోకపోవడం తప్పే. ఫైన్ కట్టలేదని చేతిలోని సెల్‌ఫోన్‌ను లాక్కున్నారు. బోగీల్లోంచి కిందకు ఈడ్చుకు వెళ్లింది, చెంపపై కొట్టింది. టీటీఈల వెంట సాయుధ పోలీసులు... టీటీఈల వెంట ఇక నుంచి సాయుధులైన పోలీసులు పంపేలా రైల్వే అధికారులు నిర్ణయిం చారు. విధులకు అడ్డుపడి దురుసుగా వ్యవహరిస్తే ఆరునెలల జైలు శిక్ష, రూ.వేయి వరకు జరిమానా విధించనునున్నారు. -
టికెటడిగినందుకు.. రైలు నుంచి తోసేశారు!
-
బేగంపేట రైల్వేస్టేషన్ లో మహిళా టీసీపై దాడి
హైదరాబాద్ : టికెట్ కలెక్టర్ గీత ఘటన మరవక ముందే మరో మహిళా టీటీఈపై దుండగులు దాడి చేశారు. ఈ సంఘటన బుధవారం ఉదయం బేగంపేట రైల్వేస్టేషన్లో చోటు చేసుకుంది. ఎంఎంటీఎస్ రైల్లో విధులు నిర్వహిస్తున్న టీటీఈ కౌసల్య టికెట్ అడిగినందుకు... ఎనిమిది మంది దుండగులు ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే చికిత్స నిమిత్తం కౌసల్యను లాలాగూడ రైల్వే ఆస్పత్రికి తరలించారు. కాగా దాడికి పాల్పడినవారిలో నలుగురిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలినవారి కోసం గాలిస్తున్నారు. మహిళా టీసీలపై దాడి చేయటం వారం రోజుల్లో ఇది రెండో సంఘటన. దాంతో మహిళా రైల్వే టీసీలు తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంగ్లీష్ కథనం కోసం.... ఈ నెల 18న టీసీ గీతను హఫీజ్ పేట రైల్వే స్టేషన్ లో దుండగులు కదులుతున్న రైల్లో నుంచి తోసేశారు. టికెట్ లేకుండా ప్రయాణించినందున జరిమానా కట్టాలని గీత అడిగిన పాపానికి దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. గతంలోనూ కేరళ ఎక్స్‌ప్రెస్‌లో విజయ్ కుమార్ అనే టీసీని దుండగులు రైల్లో నుంచి తోసివేయటంతో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. -
రైలు నుంచి టీటీఈ తోసివేత
టికెట్ లేని ప్రయాణికుల దుశ్చర్య బిజిగిరిషరీఫ్ వద్ద పట్టాలపై తీవ్రగాయాలతో గుర్తింపు హన్మకొండ ఆస్పత్రికి తరలింపు..పరిస్థితి విషమం రామగుండం : త్రివేండ్రం నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న కేరళ ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి సోమవారం ప్రయాణికులు టీటీఈని తోసేశారు. తీవ్రగాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆయనను గేట్మెన్ గుర్తించి ఆస్పత్రికి తరలించారు. వివరాలు.. వరంగల్ జిల్లా కాజీపేట నివాసి అయిన విజయ్‌కుమార్ ట్రెయిన్ టికెట్ ఇన్స్పెక్టర్ (టీటీఈ)గా విధులు నిర్వర్తిస్తున్నారు. సోమవారం కేరళసూపర్ ఫాస్ట్ఎక్స్ప్రెస్ (రైలు నంబరు:12625)లో వరంగల్‌లో ఆయన విధుల్లోకి చేరారు. వెనకవైపు ప్రయాణికులతో కిక్కిరిసి ఉన్న జనరల్ బోగీలో ప్రయాణికుల టికెట్లు చెక్ చేస్తున్న క్రమంలో కొందరి వద్ద టికెట్ లేనట్లు గుర్తించారు. ముగ్గురి వద్ద టికెట్ లేదని నిర్ధారించుకుని డోర్ వద్ద నిలబడి వారిని ప్రశ్నించారు. పరస్పరం జరిగిన వాదులాటతో అతివేగంగా వెళ్తున్న రైలు నుంచి టీటీఈని సదరు ప్రయాణికులు బయట కు నెట్టేశారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఈ ఘటన జరిగి నట్లు సమాచారం. కరీంనగర్ జిల్లా బిజిగిరిషరీఫ్ శివారులో పట్టాలపై రక్తపు మడుగులో ఉన్న టీటీఈని గేట్మెన్ గుర్తించి జమ్మికుంట రైల్వే అధికారులకు సమాచారమందించాడు. అంబులెన్స్‌లో హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. ఈ విషయమై అన్ని రైల్వేస్టేషన్ల జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారమిచ్చినప్పటికీ నాన్‌స్టాప్ ఎక్స్‌ప్రెస్ కావడంతో అప్పటికే రైలు రామగుండం దాటిపోయింది. ఈ ఘటనపై విచారణ నిర్వహిస్తున్నట్లు సీఐ శ్రీనివాస్‌సింగ్ తెలిపారు. -
కేరళ ఎక్స్ ప్రెస్ నుంచి టీటీఈ తోసివేత, పరిస్థితి విషమం!
వరంగల్: కేరళ ఎక్స్ ప్రెస్ లో విధులు నిర్వహిస్తున్న ట్రైన్ టికెట్ కలెక్టర్ (టీటీఈ) ఉదయ్ కుమార్ ను గుర్తు తెలియని వ్యక్తులు కిందకు తోసిన ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట స్టేషన్ కు సమీపంలోని బిజిగీరి షరీఫ్ స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. ట్రాక్ పక్కన పడి ఉన్న టీటీఈని బిజిగీర్ షరీఫ్ గ్రామస్తులు గమనించి.. ఆస్పత్రికి తరళించారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన టీసీ పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. టీటీఈ వరంగల్ పట్టణంలోని సుబేదారి కి చెందినట్టు తెలిసింది. టికెట్ అడిగినందుకు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి. ట్రైన్ నుంచి.తోసి వేసారని గవర్నమెంట్ రైల్వే పోలీసులు తెలిపారు.