
గాయపడిన టీటీఈ రమణారెడ్డి
అనంతపురం, హిందూపురం: హిందూపురం రైల్వే పరిధిలోని టీటీఈ రమణారెడ్డిపై ప్రయాణికుడు దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మంగళవారం రాత్రి బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న కర్ణాటక ఎక్స్‌ప్రెస్ రైలులో టీటీఈ రమణారెడ్డి గౌరిబిదనూర్ స్టేషన్ దాటిన తర్వాత టికెట్ల తనిఖీలు చేపట్టారు. జనరల్ టికెట్ తీసుకున్న నిఖిల్‌పటేల్ రిజర్వేషన్ బోగీలో ప్రయాణిస్తుండటాన్ని గుర్తించి, ఫైన్ కట్టాలని ఆదేశించాడు. ఒక వేళ ఫైన్ కట్టలేకుంటే దిగిపోవాలని చెప్పాడు. తాను దిగిపోయేది లేదని నిఖిల్ పటేల్ టీటీఈపై దాడి చేసి గాయపరిచాడు. దీంతో టీటీఈ రమణారెడ్డి హిందూపురం రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జీఆర్పీ పోలీసులు నిఖిల్‌పటేల్‌పై కేసునమోదు చేసి, అరెస్టుచేశారు. విధి నిర్వహణలో ఉన్న టీటీఈపై విచక్షణారహితంగా దాడి చేయడాన్ని ఎస్‌డబ్ల్యూఆర్‌ఎంయూ నాయకులు శేఖర్, కిరణ్ ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment