రైల్వే టీటీపై మహిళా పోలీసు దాడి
Published Sun, Dec 18 2016 2:33 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
ఏలూరు(సెంట్రల్) : రైల్వే టీటీపై ఓ మహిళా పోలీసు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై టీటీ విజయవాడ రైల్వే ఎస్పీ షీమూషీ వాజ్‌పేయికి ఫిర్యాదు చేయడంతో ఆమె విచారణ చేయాల్సిందిగా ఏలూరు రైల్వే పోలీసులను ఆదేశించారు. బాధితుడి కథనం ప్రకారం.. ఈనెల 15న గురువారం పోలీసు యూనిఫాంలో ఉన్న ఓ మహిళ రాజమండ్రి నుంచి విజయవాడ వైపు వెళ్తున్న రైలులోని ఏసీ బోగీలో ఎక్కింది. ఆ బోగీలో విధులు నిర్వర్తిస్తు్తన్న టీటీ ఎన్.రమణమూర్తి రైలు ఏలూరు రైల్వే స్టేషన్ సమీపంలోకి వచ్చే సరికి ఆ మహిళను టిక్కెట్ అడిగారు. దీనికి ఆమె తాను ఇన్‌స్పెక్టర్‌ని అని, దురుసుగా వ్యవహరించడంతోపాటు టీటీపై దాడి చేసింది. అనంతరం ఆమె ఏలూరు రైల్వేస్టేషన్‌లో దిగి వెళ్లిపోయింది. దీంతో టీటీ రమణమూర్తి విజయవాడలో రైల్వే ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆమె దీనిపై విచారణ చేయాలని ఏలూరు రైల్వే పోలీసులను ఆదేశించారు. విచారణ చేపట్టిన రైల్వే పోలీసులు గత గురువారం నాటి సీసీ టీవీ ఫుటేజీలను సేకరించారు. బాధితుడు చెబుతున్న సమయంలో ఓ మహిళా పోలీసు రైల్వే స్టేషన్ నుంచి వెళ్లడాన్ని గమనించారు.
Advertisement