
న్యూఢిల్లీ: భారత రైల్వే మరో నూతన అధ్యాయానికి తెరతీయనుంది. ముంబై– అహ్మదాబాద్ మధ్య నడిచే శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో కేవలం మహిళా ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ల(టీటీఈ)నే నియమించాలని నిర్ణయించింది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దీనిని ప్రయోగాత్మకంగా అమలుచేయనున్నారు. శతాబ్దిలో 30 మంది మహిళా టీటీఈల బృందం విధులు నిర్వహించనుంది.
Comments
Please login to add a commentAdd a comment