Mumbai-Ahmedabad
-
‘వందే సాధారణ్’ ట్రయల్ రన్
ముంబై: రైల్వే శాఖ దేశంలో తొలిసారిగా ప్రవేశపెడుతున్న ‘వందే సాధారణ్’ రైలు ట్రయల్ రన్ విజయవంతమైంది. తొలి వందే సాధారణ్ రైలును బుధవారం ముంబై–అహ్మదాబాద్ మధ్య విజయవంతంగా నడిపినట్టు రైల్వే శాఖ పేర్కొంది. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్‌అవుతోంది. కొంతకాలం క్రితం ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్లు దేశవ్యాప్తంగా పలు మార్గాల్లో విజయవంతంగా నడుస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాధారణ ప్రయాణికుల కోసం అదే తరహాలో ‘వందే సాధారణ్’ రైళ్లు తేవాలని రైల్వే శాఖ గతంలోనే నిర్ణయించడం తెల్సిందే. వందేభారత్ రైళ్లలో పూర్తిగా ఏసీ కోచ్‌లు ఉండగా ‘వందే సాధారణ్’ నాన్ ఏసీ కోచ్‌లతో నడవనున్నాయి. వీటిలో మొత్తం 22 స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయి. రెండువైపులా ఇంజన్లుండటం వీటి ప్రత్యేకత. సీసీటీవీ నిఘా, సెన్సార్ ఆధారిత సౌకర్యాలు, తదితర సదుపాయాలను ఈ కోచ్‌లలో కలి్పంచనున్నారు. ఒక్కో రైలులో 1,800 మంది దాకా ప్రయాణించవచ్చు. ఇవి గంటకు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయని రైల్వే శాఖ చెబుతోంది. దేశంలో 500 కిలోమీటర్లు దాటిన ప్రఖ్యాతిగాంచిన పలు మార్గాల్లో ఈ కొత్తతరహా రైలు సరీ్వసులను ప్రారంభించాలని రైల్వేశాఖ యోచిస్తోందని సమాచారం. ముంబై– న్యూఢిల్లీ, పటా్న–న్యూఢిల్లీ, హౌరా–న్యూఢిల్లీ, హైదరాబాద్–న్యూఢిల్లీ, ఎర్నాకులం–గువాహటి మార్గాలు ఈ రూట్ల జాబితాలో ఉన్నాయి. -
పట్టాలెక్కనున్న మరో తేజాస్ ట్రైన్
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో తొలి ప్రైవేట్ రైలుగా లక్నో-ఢిల్లీ మధ్య నడిచే తేజాస్ ఎక్స్‌ప్రెస్ విజయవంతమైన క్రమంలో ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో ప్రైవేట్ ఆపరేటర్ అహ్మదాబాద్-ముంబై రూట్లో రెండో తేజాస్ ట్రైన్ పట్టాలెక్కనుంది. అహ్మదాబాద్ నుంచి ముంబైకు బయలుదేరే ఈ రైలుకు రైల్వే మంత్రి పీయూష్ గోయల్, గుజరాత్ సీఎం విజయ్ రూపానీలు శుక్రవారం ఉదయం పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు . రైలు వాణిజ్య రాకపోకలు ఈనెల 19 నుంచి లాంఛనంగా ప్రారంభమవుతాయి. ఇక ఈ రైలు బుకింగ్స్‌ను అధికారులు ఇప్పటికే ప్రారంభించారు. ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ యాప్ ఐఆర్సీటీసీ రైలకనెక్ట్ ద్వారా ప్రయాణీకులు తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో తేజాస్ ట్రైన్‌కు ప్రయాణీకులు టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు లేదు. ఐఆర్సీటీసీ అధీకృత ఏజెంట్ల ద్వారా టికెట్లను బుక్ చేసుకునే సదుపాయం ఉంది. అహ్మదాబాద్- ముంబై మధ్య ఈ రైలు వారానికి ఆరు రోజులు అందుబాటులో ఉంటుంది. ఇక గురువారం మెయింటెనెన్స్ కోసం ఉద్దేశించడంతో ఆ రోజు రైలు సేవలు అందుబాటులో ఉండవు. పూర్తి ఏసీ ట్రైన్‌గా అత్యాధునిక సౌకర్యాలతో తేజాస్ ముందుకొచ్చింది. ఈ రైలులో ఒక్కోటి 56 సీట్ల సామర్ధ్యం కలిగిన రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ చైర్‌కార్స్‌తో పాటు ఎనిమిది చైర్ కార్స్‌తో మొత్తం 736 మంది ప్రయాణీకులు తమ గమ్యస్ధానాలకు చేరుకోవచ్చు. అహ్మదాబాద్ నుంచి బయలుదేరే ఈ ఎక్స్‌ప్రెస్ నదియాద్, వడోదర, బరూచ్, సూరత్, వాపి, బొరివలి మీదుగా ముంబైకు చేరుకుంటుంది. -
చిక్కుల్లో బుల్లెట్ ట్రైన్..?
సాక్షి, ముంబయి : ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు అవసరమైన భూ సేకరణపై అధికారులు తలపట్టుకుంటున్నారు. బుల్లెట్ ట్రైన్‌కు ఎంతకాలమైనా వేచిచూస్తామని, ముందుగా వైద్యులు, మందులు వంటి మౌలిక వసతులను కల్పించాలని అభిప్రాయసేకరణకు గ్రామాలకు వెళ్లిన అధికారులకు స్ధానికుల నుంచి పలు డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన బుల్లెట్ ట్రైన్‌కు నోడల్ సంస్థగా వ్యవహరిస్తున్న నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీఎల్) ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణను చేపడుతోంది. వైద్య సేవలతో పాటు చెరువులు, సోలార్ విద్యుత్ దీపాలు, అంబులెన్స్‌ల వంటి పలు డిమాండ్లను పాల్ఘార్ జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు అధికారులు ముందుంచుతున్నారు. ఆయా గ్రామ కూడళ్లలో గ్రామసభలు నిర్వహించి ప్రాజెక్టుపై అవగాహన కల్పిస్తున్న అధికారులకు స్ధానికులు తమ డిమాండ్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తుండటంతో ఎన్‌హెచ్‌ఆర్‌సీఎల్ రూటు మార్చింది. గ్రామసభలకు బదులు నేరుగా భూయజమానులను కలిసి పరిహారంతో పాటు వారి డిమాండ్లను తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. 2022 నాటికి బుల్లెట్ ట్రైన్‌ను పట్టాలెక్కించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న అధికారులు ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. 508 కిమీ ట్రైన్ కారిడార్‌లో అత్యధిక భాగం 110 కిమీ మేర పాల్ఘార్ జిల్లా మీదుగానే సాగుతుంది. జిల్లాలోని 73 గ్రామాలకు చెందిన 300 హెక్టార్ల భూమి ఈ ప్రాజెక్టుకు అవసరం. అయితే ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు భూసేకరణను జిల్లాలోని గిరిజనులు, పండ్ల పెంపకందారులు తీవ్రంగా వ్యతిరేకిస్తునా్నరు. మరోవైపు గ్రామస్థుల నిర్ధిష్ట డిమాండ్లను నెరవేర్చడం ద్వారా భూసేకరణ సాఫీగా సాగేలా ఎన్‌హెచ్‌ఆర్‌సీఎల్ వ్యవహరిస్తోంది. గ్రామస్థులు వ్యక్తిగత సమస్యలు కాకుండా సామాజిక సమస్యలనే తెరపైకి తెస్తుండటంతో వాటి పరిష్కారానికి అధికారులు చొరవ చూపుతున్నారు. భూసేకరణను వ్యతిరేకిస్తున్న సపోటా, మామిడి పెంపకందార్లను కూడా ఎన్‌హెచ్‌ఆర్‌సీఎల్ అధికారులు ఊరడిస్తున్నారు. మెరుగైన ప్యాకేజ్‌తో పాటు బుల్లెట్ ట్రైన్ పట్టాలెక్కితే స్ధానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఈ ప్రాంత రూపురేఖలు మారుతాయని వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. -
బుల్లెట్ ట్రైన్ : రోజుకు 70 ట్రిప్పులు
సాక్షి, అహ్మదాబాద్ : ముంబయి నుంచి అహ్మదాబాద్‌కు కేవలం రెండుగంటల్లో చేర్చే బుల్లెట్ ట్రైన్ నిర్మాణ పనులను శరవేగంగా చేపట్టి షెడ్యూల్ టైమ్‌లో పట్టాలెక్కించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం ఇప్పటికే భూసేకరణ ప్రక్రియను నేషనల్ హై స్పీడ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఎస్ఆర్సీ) వేగవంతం చేసింది. ముంబయి నుంచి సబర్మతికి ఫాస్ట్ ట్రైన్ రెండు గంటల్లో, రూట్లోని 12 స్టేషన్లలో ఆగే బుల్లెట్ ట్రైన్ రెండుగంటల 58 నిమిషాల్లో గమ్యస్ధానాలకు చేరుకుంటాయని ఎన్హెచ్ఎస్ఆర్సీ అధికారులు తెలిపారు. రద్దీ సమయాల్లో ప్రతి 20 నిమిషాలకూ ఒక బుల్లెట్ ట్రైన్ ఉంటుందని ఎన్హెచ్ఎస్ఆర్సీ పీఆర్ఓ ధనంజయ్ కుమార్ చెప్పారు. బుల్లెట్ ట్రైన్ గంటకు 350 కిమీ వేగంతో దూసుకుపోతుందని, రోజుకు 70 ట్రిప్పులు నడపాలని యోచిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ముంబయి, అహ్మదాబాద్ మధ్య రైలు ప్రయాణానికి దాదాపు ఏడుగంటల సమయం పడుతుండగా, విమాన ప్రయాణానికి గంట సమయం పడుతోంది. -
శతాబ్ది రైలుకు మహిళా టీటీఈలు
న్యూఢిల్లీ: భారత రైల్వే మరో నూతన అధ్యాయానికి తెరతీయనుంది. ముంబై– అహ్మదాబాద్ మధ్య నడిచే శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో కేవలం మహిళా ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ల(టీటీఈ)నే నియమించాలని నిర్ణయించింది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దీనిని ప్రయోగాత్మకంగా అమలుచేయనున్నారు. శతాబ్దిలో 30 మంది మహిళా టీటీఈల బృందం విధులు నిర్వహించనుంది. -
దూసుకొస్తున్న బుల్లెట్
⇒ ముంబై-అహ్మదాబాద్ మధ్య ఏర్పాటుకు నిర్ణయం ⇒ 2018 నుంచి మొదలుకానున్న పనులు ⇒ 2024కల్లా ట్రాక్ పైకి ⇒ 8 గంటల ప్రయాణం ఇక 2 గంటల్లో ప్యాసింజర్.. ఎక్స్‌ప్రెస్.. సూపర్‌ఫాస్ట్.. వీటి మధ్య ఉన్న ప్రధాన తేడా వాటి వేగమే. అదే వాటి పేర్లను మార్చేసింది. ఈ వేగానికి కారణం టెక్నాలజీ. దీనికి ఆ రంగం.. ఈ రంగం అంటూ ఏ తేడా ఉండదు. ఇది ఏ రంగంలోనైనా వినూత్నమైన మార్పులకు నాంది పలుకుతుంది. అలాంటిదే ఇప్పుడు మన రైల్వే రంగంలోనూ జరగబోతోంది. ఒకప్పుడు కొంత దూరానికి కూడా పొగ రైళ్లలో రోజుల తరబడి ప్రయాణించేవాళ్లం. ఇప్పుడు కొన్ని గంటల్లోనే సుదూర గమ్యాలను చేరుకునే అవకాశం అందుబాటులో ఉంది. అదే ‘బుల్లెట్’ ట్రైన్. దీనిని మొదటగా ఆర్థిక రాజధాని అయిన ముంబై, ప్రధానమంత్రి మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లోని అహ్మదాబాద్ మధ్య ప్రవేశపెట్టనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే 508 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 2-3 గంటల్లోనే చేరుకోవచ్చు. బుల్లెట్ రైలు ఏర్పాటు ఆలోచన యూపీఏ ప్రభుత్వం నుంచి ఉంది. దీనిని తొలిగా 2009-10 ైరె ల్వే బడ్జెట్లో ప్రస్తావించారు.. అప్పటి యూపీఏ ప్రభుత్వం పుణే రైల్వేస్టేషన్ నుంచి అహ్మదాబాద్ రైల్వేస్టేషన్ వరకు ముంబై మీదుగా దాదాపు 650 కిలోమీటర్ల మేర హైస్పీడ్ రైల్వే కారిడార్‌ను ఏర్పాటు చేయాలని భావించింది. ఈ రైలు గరిష్ట వేగం గంటకు 350 కిలోమీటర్లు అనుకున్నారు. ప్రాజెక్టు అధ్యయనానికి సంబంధించి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, జపాన్ ప్రధాని షింజో అబే మధ్య 2013లో ఒక ఎంవోయూ కూడా కుదిరింది. తర్వాత కాలానుగుణంగా కొన్ని మార్పులు జరిగాయి. చివరికి 2015 డిసెంబర్లో భారత్, జపాన్ మధ్య ముంబై- అహ్మదాబాద్ కారిడార్‌కు సంబంధించిన ఒప్పందం జరిగింది. ప్రాజెక్టు విశేషాలు ఇవి..! ఈ బుల్లెట్ రైలు దేశ పారిశ్రామిక రాజధాని అయిన ముంబై నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వరాష్ట్రమైన గుజరాత్ అహ్మదాబాద్ మధ్య సేవలందించనుంది. ఈ రెండు నగరాల మధ్య దూరం సుమారు 508 కిలోమీటర్లు. బుల్లెట్ రైలు గరిష్ట వేగం గంటకు 350 కిలోమీటర్లు. ఇది 11 స్టేషన్లను కలుపుతూ వెళ్తుంది. ప్రస్తుతం ముంబై నుంచి అహ్మదాబాద్‌కు సాధారణ రైళ్లలో వెళ్లాలంటే దాదాపు 8 గంటల సమయం పడుతోంది. అదే బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే సుమారు 2 నుంచి 3 గంటల్లో ముంబై నుంచి అహ్మదాబాద్ చేరుకోవచ్చు. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.97,636 కోట్లు. దీనికి జపాన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఏజెన్సీ(జైకా) 81 శాతం నిధులు అంటే రూ.76,165 కోట్లను రుణంగా అందించనుంది. రుణంలో వ్యయ పరిమితి, వడ్డీ, దిగుమతి సుంకాలన్నీ కలగలిపి ఉన్నాయి. 15 ఏళ్ల మారటోరియంతో 50 ఏళ్ల పాటు 0.1 శాతం వార్షిక వడ్డీ చెల్లించేలా రుణ ఒప్పందం జరిగింది. భారత రైల్వే రూ.9,800 కోట్లను అందించనుండగా.. మిగతా మొత్తాన్ని మహారాష్ట్ర, గుజరాత్‌లు భరిస్తాయి. ట్రాక్ నిర్మాణానికి కిలోమీటర్‌కు రూ.140 కోట్ల నుంచి 200 కోట్లు ఖర్చవుతుందని జైకా అధ్యయనంలో తేలింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి ఒప్పందం ఈ ఏడాది చివరికల్లా పూర్తి కానుండగా.. పనులు 2018లో ప్రారంభమవుతాయి. 2024 నాటికి బుల్లెట్ ట్రాక్ మీదకి దూసుకొచ్చే అవకాశం ఉంది. బ్రేక్ వేయాల్సిందిక్కడే.. ముంబై-అహ్మదాబాద్ మధ్య రైలు 11 చోట్ల ఆగనుంది. ముం బై, థానే, విరార్, దహను, వల్సద్, వపి, సూరత్, భరూచ్, వడోదరా, ఆనంద్/నడియాద్, అహ్మదాబాద్ స్టేషన్లు ప్రతిపాదనలో ఉన్నాయి. చార్జీలిలా..! సాధారణ రైళ్ల ఫస్ట్‌క్లాస్ ఏసీ టికెట్ ధరతో పోలిస్తే బుల్లెట్ రైలు టికెట్ ధర దాదాపు 1.5 రెట్లు అధికంగా ఉంటుంది. అంటే ముంబై-అహ్మదాబాద్ మధ్య ఏసీ మొదటి తరగతి టికెట్ ధర రూ.2,200 ఉంటే.. అదే బుల్లెట్ రైలులో అయితే దాదాపు రూ.3,300గా ఉంటుంది. కాగా, ఈ రైలులో 10 నుంచి 16 కోచ్‌లు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. తద్వారా 1,300 నుంచి 1,600 మంది ప్రయాణించే అవకాశం ఉంది. ఈ రైలులో వైఫై వంటి సదుపాయాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. జపాన్‌దే తొలి బుల్లెట్.. చైనాదే వేగం ప్రపంచంలో మొట్టమొదటి హైస్పీడ్ రైల్వే వ్యవస్థను 1964లో జపాన్ నిర్మించింది. ఆ తర్వాత 1981లో ఫ్రాన్స్, 1989లో ఇటలీ, 1991లో జర్మనీ, 1992లో స్పెయిన్, 1997లో బెల్జియం దేశాలు నిర్మించగా.. 2007లో చైనాలో అందుబాటులోకి వచ్చింది. కాగా, చైనాకు చెందిన షాంఘై మాగ్లేవ్ రైలు ప్రపంచంలోనే అత్యంత వేగంగా వెళ్లే రైలుగా రికార్డులకెక్కింది. దీని గరిష్ట వేగం గంటకు 430కి.మీ కాగా, సగటు వేగం గంటకు 251 కి.మీ. దీనిని 2004 ఏప్రిల్‌లో ప్రారంభించారు. అలాగే చైనాకే చెందిన హార్మొనీ సీఆర్‌హెచ్ 380ఏ ఈ రైలును 2010 అక్టోబర్‌లో ప్రారంభించారు. దీని గరిష్ట వేగం 380 కి.మీ. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా వెళ్లే రెండో రైలు. ఇదీ బీజింగ్-షాంఘై మధ్య సేవలందిస్తోంది. కాగా, జపాన్‌కు చెందిన జపనీస్ మాగ్లేవ్ రైలు(గంటకు 603 కి.మీ) పట్టాలెక్కితే ఇదే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా రికార్డులకెక్కనుంది. అవసరమా? దాదాపు రూ.లక్ష కోట్లు వెచ్చించి రెండు రాష్ట్రాల మధ్య హైస్పీడ్ ట్రైన్ కారిడార్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా? అని కొందరు నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తాన్ని ఇదివరకే దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే నెట్‌వర్క్‌ను పునరుద్ధరిస్తే మంచి ఫలితా లు పొందొచ్చని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే దేశంలో నడుస్తోన్న పలు రైళ్లను వాటి శక్తిసామర్థ్యాల మేర వినియోగించుకోలేకపోతున్నామని గుర్తు చేస్తున్నారు. ధనవంతులు, వ్యాపారవేత్తలను దృష్టిలో ఉంచుకొని కాకుండా సామాన్యులను పరిగణనలోకి తీసుకొని సంస్కరణలు జరగాలంటున్నారు. సంపన్నులు విమానాల్లో కూడా ప్రయాణించగలరని, వారి కోసం ఎయిర్ కనెక్టివిటీ సౌలభ్యాన్ని మెరుగుపరిస్తే సరిపోతుందని పేర్కొంటున్నారు. అలాగే దీని స్థాపనకు జపాన్ (50 ఏళ్లకు) రుణమిస్తోంది. ఇంత సుదీర్ఘకాలానికి అప్పుచేసి పప్పు కూడు తినడం అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. - గుండ్ర వెంకటేశ్ - సాక్షి, సెంట్రల్ డెస్క్ సముద్రంలోనూ బుల్లెట్.. అరేబియా సముద్రం కింద ఈ రైలు బుల్లెట్లా దూసుకుపోనుంది. దాదాపు రైలు మార్గమంతా భూ ఉపరితలంపైనే ఉంటుంది. అయితే థానే నుంచి విరార్ వరకు సుమారు 21 కిలోమీటర్ల మేర మాత్రం సముద్రగర్భంలో ప్రయాణించొచ్చు. ఇందుకోసం ఓ భారీ టన్నెల్‌ను నిర్మించనున్నారు. -
500 కిలోమీటర్లు.. 2 గంటల్లో వెళ్లిపోవచ్చు!
న్యూఢిల్లీ: దేశంలో తొలి బుల్లెట్రైలు 2023 నాటికి పట్టాలెక్కుతుందని రైల్వే మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. భారత ఉపఖండ రైల్వేల్లో ఇది మైలురాయిగా నిలుస్తుందన్నారు. ముంబై-అహ్మదాబాద్‌ల మధ్య అండర్ సీ టన్నెల్ లో ఈ బుల్లెట్రైలు పరుగు తీయనుంది. దీని గరిష్ట వేగం 350 కి.మీ కాగా, నిర్వహణా వేగాన్ని 320 కి.మీకి తగ్గించారు. దీని ద్వారా ముంబై-అహ్మదాబాద్‌ల మధ్య 508 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లోపు చేరుకోవచ్చు. నిర్మాణ పనులు 2018లో మొదలయ్యే అవకాశం ఉంది. రూ. 97,636 కోట్లతో ఈ ప్రాజెక్టును పట్టాలకెక్కించనున్నారు. ఇందులో 81 శాతం నిధులను జపాన్ నుంచి తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ఈ మొత్తాన్ని 0.1 శాతం వార్షిక వడ్డీతో 50 ఏళ్లలో తిరిగి చెల్లించనున్నట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదికను జపనీస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఏజెన్సీ(జేఐసీఏ) తయారు చేసిందని తెలిపారు. -
‘హైస్పీడ్ రైలు’కు రెక్కలు!
సాక్షి, ముంబై: కొద్ది నెలలుగా అటకెక్కిన ముంబై-అహ్మదాబాద్ మధ్య ప్రవేశపెట్టనున్న హై స్పీడ్ రైలు ప్రతిపాదన మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ రెండు కీలక నగరాల మధ్య రాకపోకలు సాగించే వ్యాపారులు, పారిశ్రామిక వేత్తల విలువైన సమయాన్ని తగ్గించేందుకు పశ్చిమ రైల్వే ముందుకు వచ్చింది. అందుకు గంటకు 160 కి.మీ. వేగంతో పరుగులు తీసే హైస్పీడ్ రైళ్లు నడిపేందుకు అవసరమైన రూ.1,200 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు పశ్చిమ రైల్వే స్పష్టం చేసింది. అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టు ప్రతిపాదన మంజూరు కోసం త్వరలో రైల్వే బోర్డుకు పంపించనుంది. బోర్డు ద్వారా మంజూరు లభించగానే అధ్యయనం, భూ సేకరణ లాంటి కీలకమైన పనులు ప్రత్యక్షంగా ప్రారంభమవుతాయి. ఈ పనులు పూర్తిచేయడానికి సంవత్సర కాలం పట్టవచ్చని అధికారులు అంచనావేశారు. ఆ తర్వాత కాంట్రాక్టర్ల నియామకం పనులు పూర్తిచేస్తారు. 495 కి.మీ. పొడవైన ఈ మార్గం కార్యరూపం దాలిస్తే ప్రయాణికుల విలువైన సమయం దాదాపు రెండు గంటలకుపైగా ఆదా కానుందని పశ్చిమ రైల్వే చీఫ్ పీఆర్వో శరత్ చంద్రాయన్ తెలిపారు. సాధారణంగా ముంబై-అహ్మదాబాద్‌ల మధ్య ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లలో వెళితే ఏడు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతుంది. అదే గంటకు 160 కి.మీ. వేగంతో హైస్పీడ్ రైళ్లను నడిపితే సుమారు ఐదు గంటలలోపు తమ గమ్యాన్ని చేరుకోవచ్చని చంద్రాయన్ అభిప్రాయపడ్డారు. కాగా ఇలాంటి హైస్పీడ్ రైళ్లను నడపాలంటే ఇప్పుడున్న రైల్వే ట్రాక్స్, ఓవర్ హెడ్ వైర్ సామర్థ్యాన్ని పెంచాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రమాదకర మలుపులను తగ్గించాలి. ఇదిలాఉండగా, రైల్వే బోర్డు దేశవ్యాప్తంగా సెమీ హై స్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు తొమ్మిది ప్రాంతాలను ఎంపిక చేసింది. అందులో ముంబై-గోవా, ముంబై-అహ్మదాబాద్ మార్గాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం పశ్చిమ రైల్వేలో గంటకు 130 కి.మీ. వేగం లోపు నడిచే రైళ్లు కొన్ని ఉన్నాయి. మొదటి దశలో శతాబ్ధి, దురంతో, రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లను గంటకు 160 కి.మీ. నడిపేందుకు ప్రయత్నాలు చేయనున్నారు. ఆ తర్వాత విడతల వారీగా మిగతా రైళ్లను కూడా నడిపే ప్రయత్నం చేస్తామని చంద్రాయన్ అన్నారు. భారత దేశంలో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య నడిపేందుకు ఇదివరకే సన్నహాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. అందుకు జపాన్ కంపెనీ ఈ మార్గానికి సంబంధించిన తుది నివేదిక 2015లో సమర్పించనుంది. -
దూసుకెళ్లొచ్చు..
సాక్షి, ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబై-అహ్మదాబాద్‌ల మధ్య హై స్పీడ్ బుల్లెట్ ట్రేయిన్లు ప్రవేశపెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ కన్న కలలు త్వరలో సాకారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకు సంబంధించిన ఫైళ్ల కదలికలు వేగం పుం జుకున్నాయి. దేశంలో మొట్టమొదటి రైలు ఛత్రపతి శివాజీ టర్మినస్ (అప్పటి వీ.టీ.)-ఠాణేల మధ్య నడిచి చరిత్ర సృష్టించాయి. ఇప్పుడు మొట్ట మొదటి బుల్లెట్ ట్రేయిన్ బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) నుంచి ఠాణే మీదుగా అహ్మద్‌బాద్ వరకు పరుగులు తీయనుంది. ఈ హై స్పీడ్ రైలు అందుబాటులోకి వస్తే 500 కి .మీ. ప్రయాణాన్ని కేవలం గంట న్నర లోపు అధిగమించవచ్చు. ఈ ప్రాజెక్టుకు సం బంధించిన తుది నివేదిక రైల్వే పరిపాలన విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది.ఈ నివేదికపై ఈ నెల 7వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం చర్చించనుంది. 2008లో ప్రతిపాదన ఈ హై స్పీడ్ బుల్లెట్ ట్రే యిన్ నడపాలని 2008లో ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్లో ప్రకటించారు. ఆ ప్రకా రం ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య నడపాలని సంకల్పించారు. అందుకు అవసరమైన ఆర్థిక నివేదిక రూపొందించే బాధ్యతలు రైట్ కన్సల్టెంట్, జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజన్సీ (జాయ్కా)కి అప్పగించారు. ఎప్పటి నుంచో ఆటకెక్కిన ఈ ప్రాజెక్టు నరేంద్ర మోడీ ప్రధాని కాగానే మళ్లీ తెరమీదకు వచ్చింది. ఇటీవల ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో కూడా ఈ అంశం మరోసారి ప్రస్తావనకు వచ్చింది. తమ పదవి కాలంలోనే ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని మోడీ ప్రభుత్వం ధృఢ సంకల్పంతో ఉంది. ఆ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ పనులు మరింత వేగవంతం చేసింది. రైల్వేమార్గంలో మార్పు ముంబై-అహ్మదాబాద్ వయా ఠాణే మీదుగా 498.5 కి.మీ. దూరం ఉంది. ఈ రైళ్లను పశ్చిమ రైల్వే మార్గంలో ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్న ట్రాక్‌పైనే నడపాలని ప్రారంభంలో ప్రతిపాదిం చారు. కానీ ఈ ట్రాక్‌పై బుల్లెట్ ట్రేన్లు నడపడం సాధ్యం కాదని గుర్తించారు. అందుకు స్టాండర్డ్ గేజ్‌తో కూడిన రెండు ట్రాక్‌లు అదనంగా వేయాల్సి ఉంటుందని నివేదికలో స్పష్టం చేశారు. ఈ రైళ్లను పశ్చిమ మార్గంలోని ముంబెసైంట్రల్ నుంచి నడపాలంటే అనేక కట్టడాలను నేలమట్టం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో బీకేసీ నుంచి వయా ఠాణే-విరార్ మీదుగా అహ్మదాబాద్ వరకు నడపాలనే ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. అందుకు బీకేసీ మైదానంలో 200 మీటర్ల మేర భూగర్భంలో బుల్లెట్ ట్రేన్ టర్మినస్ నిర్మించనున్నారు. దీన్ని మెట్రో, సెంట్రల్, పశ్చిమ రైల్వే మార్గాలతో కనెక్టివిటీ చేయనున్నారు. ఈ రైలుకు 8 నుంచి 16 వరకు బోగీలుం టాయి. వేగం గంటకు 300-350 కి.మీ. ఉంటుంది. 200 కి.మీ. ప్రయాణానికి రూ 1,000, 500 కి.మీ. ప్రయాణానికి రూ.1,500చార్జీలు ఉంటాయని అం చన వేశారు. బీకేసీ నుంచి బయలుదేరిన ఈ బుల్లెట్ ట్రేన్ మార్గంలో ఠాణే, విరార్, బోయిసర్, డహాణు రోడ్, వాపి, వల్సాడ్, బిలిమోరియా, భరూచ్, ఆణంద్, ఆహ్మదాబాద్ ఇలా స్టేషన్లు ఉంటాయి.