సాక్షి, ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబై-అహ్మదాబాద్‌ల మధ్య హై స్పీడ్ బుల్లెట్ ట్రేయిన్‌లు ప్రవేశపెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ కన్న కలలు త్వరలో సాకారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకు సంబంధించిన ఫైళ్ల కదలికలు వేగం పుం జుకున్నాయి. దేశంలో మొట్టమొదటి రైలు ఛత్రపతి శివాజీ టర్మినస్ (అప్పటి వీ.టీ.)-ఠాణేల మధ్య నడిచి చరిత్ర సృష్టించాయి.
ఇప్పుడు మొట్ట మొదటి బుల్లెట్ ట్రేయిన్ బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) నుంచి ఠాణే మీదుగా అహ్మద్‌బాద్ వరకు పరుగులు తీయనుంది. ఈ హై స్పీడ్ రైలు అందుబాటులోకి వస్తే 500 కి .మీ. ప్రయాణాన్ని కేవలం గంట న్నర లోపు అధిగమించవచ్చు. ఈ ప్రాజెక్టుకు సం బంధించిన తుది నివేదిక రైల్వే పరిపాలన విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది.ఈ నివేదికపై ఈ నెల 7వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం చర్చించనుంది.
2008లో ప్రతిపాదన
ఈ హై స్పీడ్ బుల్లెట్ ట్రే యిన్ నడపాలని 2008లో ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్‌లో ప్రకటించారు. ఆ ప్రకా రం ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య నడపాలని సంకల్పించారు. అందుకు అవసరమైన ఆర్థిక నివేదిక రూపొందించే బాధ్యతలు రైట్ కన్సల్టెంట్, జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజన్సీ (జాయ్‌కా)కి అప్పగించారు. ఎప్పటి నుంచో ఆటకెక్కిన ఈ ప్రాజెక్టు నరేంద్ర మోడీ ప్రధాని కాగానే మళ్లీ తెరమీదకు వచ్చింది. ఇటీవల ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో కూడా ఈ అంశం మరోసారి ప్రస్తావనకు వచ్చింది. తమ పదవి కాలంలోనే ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని మోడీ ప్రభుత్వం ధృఢ సంకల్పంతో ఉంది. ఆ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ పనులు మరింత వేగవంతం చేసింది.
రైల్వేమార్గంలో మార్పు
ముంబై-అహ్మదాబాద్ వయా ఠాణే మీదుగా 498.5 కి.మీ. దూరం ఉంది. ఈ రైళ్లను పశ్చిమ రైల్వే మార్గంలో ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్న ట్రాక్‌పైనే నడపాలని ప్రారంభంలో ప్రతిపాదిం చారు. కానీ ఈ ట్రాక్‌పై బుల్లెట్ ట్రేన్‌లు నడపడం సాధ్యం కాదని గుర్తించారు. అందుకు స్టాండర్డ్ గేజ్‌తో కూడిన రెండు ట్రాక్‌లు అదనంగా వేయాల్సి ఉంటుందని నివేదికలో స్పష్టం చేశారు. ఈ రైళ్లను పశ్చిమ మార్గంలోని ముంబెసైంట్రల్ నుంచి నడపాలంటే అనేక కట్టడాలను నేలమట్టం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో బీకేసీ నుంచి వయా ఠాణే-విరార్ మీదుగా అహ్మదాబాద్ వరకు నడపాలనే ప్రతిపాదన తెరమీదకు వచ్చింది.
అందుకు బీకేసీ మైదానంలో 200 మీటర్ల మేర భూగర్భంలో బుల్లెట్ ట్రేన్ టర్మినస్ నిర్మించనున్నారు. దీన్ని మెట్రో, సెంట్రల్, పశ్చిమ రైల్వే మార్గాలతో కనెక్టివిటీ చేయనున్నారు. ఈ రైలుకు 8 నుంచి 16 వరకు బోగీలుం టాయి. వేగం గంటకు 300-350 కి.మీ. ఉంటుంది. 200 కి.మీ. ప్రయాణానికి రూ 1,000, 500 కి.మీ. ప్రయాణానికి రూ.1,500చార్జీలు ఉంటాయని అం చన వేశారు. బీకేసీ నుంచి బయలుదేరిన ఈ బుల్లెట్ ట్రేన్ మార్గంలో ఠాణే, విరార్, బోయిసర్, డహాణు రోడ్, వాపి, వల్సాడ్, బిలిమోరియా, భరూచ్, ఆణంద్, ఆహ్మదాబాద్ ఇలా స్టేషన్లు ఉంటాయి.
దూసుకెళ్లొచ్చు..
Published Sun, Aug 3 2014 11:57 PM | Last Updated on Sat, Sep 2 2017 11:19 AM
Advertisement