రన్నింగ్‌ రైలు నుంచి నెట్టివేత.. విషమంగా సైనికుడి పరిస్థితి | Army Man Threw From Running Train Lost Leg In UP Bareilly | Sakshi
Sakshi News home page

ఘోరం: రన్నింగ్‌ ట్రెయిన్‌లో నుంచి నెట్టివేత.. కాలు కోల్పోయి విషమంగా ఆర్మీ మ్యాన్‌ పరిస్థితి

Published Fri, Nov 18 2022 8:52 AM | Last Updated on Fri, Nov 18 2022 10:10 AM

Army Man Threw From Running Train Lost Leg In UP Bareilly - Sakshi

క్రైమ్‌:  టికెట్‌ విషయంలో ఆ ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగింది. అయితే కోపంతో వేగంగా వెళ్తున్న రైలు నుంచి కిందకు నెట్టేయడంతో.. భారత సైన్యంలో పని చేసే ఆ వ్యక్తి తన కాలును కోల్పోయాడు. అంతేకాదు అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఉత్తర ప్రదేశ్‌ బరేలీ జంక్షన్‌ వద్ద గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సోనూ అనే సైనికుడు.. దిబ్రుఘడ్‌-కొత్త ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో టీటీఈ సుపాన్‌ బోర్‌ అక్కడికి వచ్చాడు. ఇద్దరి మధ్య జరిగిన టికెట్‌ విషయంలో ఏదో గొడవ జరిగింది. వాగ్వాదం జరుగుతున్న టైంలో కోపం కట్టలు తెంచుకున్న సుపాన్‌.. సోనూని ఒక్కసారిగా రైలు బయటకు నెట్టేశాడు.  

దీంతో రైలు కిందకు వెళ్లిపోయి తీవ్రంగా గాయపడ్డాడు సోనూ. అది గమనించిన స్థానికులు రైలును ఆపేసి.. టీటీఈని చితకబాదారు. దీంతో సుపాన్‌ బోర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే సోనూని మిలిటరీ ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు అతని కాలిని తొలగించినట్లు తెలుస్తోంది. సోను పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం. మర్డర్‌ అటెంప్ట్‌ నేరం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న సుపాన్‌ కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ఏం జరిగిందో పరిశీలిస్తామని రైల్వే అధికారులు చెప్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement