army man
-
రన్నింగ్ రైలు నుంచి నెట్టివేత.. విషమంగా సైనికుడి పరిస్థితి
క్రైమ్: టికెట్ విషయంలో ఆ ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగింది. అయితే కోపంతో వేగంగా వెళ్తున్న రైలు నుంచి కిందకు నెట్టేయడంతో.. భారత సైన్యంలో పని చేసే ఆ వ్యక్తి తన కాలును కోల్పోయాడు. అంతేకాదు అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తర ప్రదేశ్ బరేలీ జంక్షన్ వద్ద గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సోనూ అనే సైనికుడు.. దిబ్రుఘడ్-కొత్త ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో టీటీఈ సుపాన్ బోర్ అక్కడికి వచ్చాడు. ఇద్దరి మధ్య జరిగిన టికెట్ విషయంలో ఏదో గొడవ జరిగింది. వాగ్వాదం జరుగుతున్న టైంలో కోపం కట్టలు తెంచుకున్న సుపాన్.. సోనూని ఒక్కసారిగా రైలు బయటకు నెట్టేశాడు. దీంతో రైలు కిందకు వెళ్లిపోయి తీవ్రంగా గాయపడ్డాడు సోనూ. అది గమనించిన స్థానికులు రైలును ఆపేసి.. టీటీఈని చితకబాదారు. దీంతో సుపాన్ బోర్ అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే సోనూని మిలిటరీ ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు అతని కాలిని తొలగించినట్లు తెలుస్తోంది. సోను పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం. మర్డర్ అటెంప్ట్ నేరం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న సుపాన్ కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ఏం జరిగిందో పరిశీలిస్తామని రైల్వే అధికారులు చెప్తున్నారు. -
వీడియో లీక్ ఘటన.. అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసిన ఆర్మీ జవాన్ అరెస్టు
చండీగఢ్: దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన చండీగఢ్ యూనివర్సిటీ వీడియో లీక్ కేసుకు సంబంధించి ఆర్మీ జవాన్ సంజీవ్ సింగ్‌ను శనివారం అరెస్టు చేశారు మొహాలీ పోలీసులు. అరుణాచల్ ప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తున్న ఇతను వీడియో లీక్ చేసిన విద్యార్థినిని బ్లాక్మెయిల్ చేశాడని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన డిజిటల్, ఫోరెన్సిక్ ఆధారాలు లభించిన తర్వతే సంజీవ్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ వెల్లడించారు. ఇందుకు అరుణాచల్ పోలీసులు సహకరించినట్లు పేర్కొన్నారు. ఆర్మీ అధికారులు కూడా సంజీవ్ సింగ్ అరెస్టును ధ్రువీకరించారు. ఈ కేసుతో అతనికి సంబంధం ఉందని ఆధారాలు లభించిన తర్వాత పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్ పోలీసులకు తాము సహకరించామని పేర్కొన్నారు. విచారణలో మరిన్ని విషయాలు తెలుస్తాయన్నారు. సంజీవ్ సింగ్ అరెస్టుతో ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లయింది. మరోవైపు చండీగఢ్ వీడియో లీక్ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని పంజాబ్, హర్యానా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణకు ధర్మాసనం తేదీని నిర్ణయించాల్సి ఉంది. చండీగఢ్ యూనివర్సీటీలో 60 మంది అమ్మాయిలు బాత్రూంలో స్నానం చేసే వీడియోలు లీక్ అయ్యాయని కొద్ది రోజుల క్రితం వార్తలు రావడం దుమారం రేపింది. అయితే విచారణలో ఒక్క అమ్మాయి వీడియో మాత్రమే లీక్ అయినట్లు తేలిందని పోలీసులు తెలిపారు. అది కూడా ఆ అమ్మాయే స్వయంగా తన వీడియోను రికార్డు చేసుకుని బాయ్‌ఫ్రెండ్‌కు పంపిందని చెప్పారు. చదవండి: 60 మంది అమ్మాయిల వీడియోలు లీక్..? స్పందించిన యూనివర్సిటీ -
జవాన్ల గ్రామం.. ఊరి తల్లిదండ్రులకు పాదాభివందనం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ప్రాణాలు పణంగా పెట్టి సరిహద్దుల్లో పహారా కాసే జవాన్లుగా ప్రత్యక్షంగా దేశసేవ చేస్తూ తమ ఊరికే కాక నిజామాబాద్ జిల్లాకే గర్వకారణంగా నిలుస్తున్నారు ఈ యువకులు. మాక్లూర్ మండలంలోని అడవి మామిడిపల్లి నుంచి గత 21 ఏళ్లలో సగటున ఏడాదికొకరు చొప్పున 21 మంది యువకులు ఆర్మీ, ఐటీబీపీ (ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్) దళాల్లోకి వెళ్లారు. మొత్తం ఉత్తర తెలంగాణలోనే ఈ ఊరి ప్రత్యేకతను చాటుతున్నారు. దీంతో ఈ గ్రామాన్ని ‘అడవి మామిడిపల్లి’ అని కాకుండా ‘జైహింద్ మామిడిపల్లి’ అని మార్చాలనే స్ఫూర్తిని కలిగిస్తోంది. ఇక ఊరిలోకి అడుగుపెట్టగానే స్వామి వివేకానంద విగ్రహం కనిపిస్తుంది. ఊరి మధ్యలో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాలు దర్శనమిస్తాయి. దేశభక్తి స్ఫూర్తిగా విగ్రహాలు నెలకొల్పడంతో పాటు తమ బిడ్డలను దేశ రక్షణ కోసం సరిహద్దుల పహారాకు పంపుతున్న ఆ ఊరి తల్లిదండ్రులకు పాదాభివందనం చేయాలని పలువురు చెబుతుండడంలో అతిశయోక్తి లేదు. చాలాసార్లు ఏడుపొస్తుంది మా కుమారుడు కల్లెడి సాయికుమార్ 2012లో ఆర్మీలోకి వెళ్లాడు. ఉన్న ఎకరం అమ్మి కుమార్తె పెళ్లి చేశాం. మాకు ఇల్లు లేదు. అద్దెకు ఉంటున్నాం. ఇంటర్ తర్వాత చదివించలేకపోయాం. ఉన్న ఒక్క కొడుకు పట్టుబట్టి ఆర్మీలోకి వెళ్లాడు. ఒక్కడే కొడుకు కావడంతో బాధతో చాలాసార్లు ఏడుస్తాం. అయినా దేశానికి సేవ చేస్తున్నందుకు గర్వంగా ఉంది. ఫోన్ చేసి ఏడవద్దని ఓదారుస్తాడు. మా కోడలి డెలివరీకి సైతం అతి కష్టంమీద సెలవు తీసుకుని వచ్చి వెళ్లాడు. –కల్లెడి జయ, నారాయణ దంపతులు అగ్నిపథ్‌కు ముందుకొస్తున్నారు.. మా ఊరి నుంచి యువకులు సైన్యంలోకి వెళ్లడం 2000 సంవత్సరం నుంచి మొదలైంది. ఇప్పటి వరకు 21 మంది యువకులు ఆర్మీ, ఐటీబీపీ విభాగాల్లోకి వెళ్లారు. ముగ్గురు ఇప్పటికే ఆర్మీ నుంచి రిటైర్ కాగా మిగిలినవారు సర్వీసులో ఉన్నారు. మరో ఎనిమిది మంది యువకులు అగ్నిపథ్‌కు దరఖాస్తులు చేసుకున్నారు. 600 గడపలు ఉన్న మా ఊరి నుంచి క్రమం తప్పకుండా యువకులు సైన్యంలోకి వెళుతుండడం ఊరంతటికీ గర్వకారణం. – గంగోని సంతోష్, మాజీ సర్పంచ్ ఎన్ఎస్జీలో పనిచేశాను.. దేశ సేవ చేయాలని ఆర్మీలోకి వెళ్లాను. అసోంలో పనిచేసే సమయంలో కఠినంగా సాధన చేసి ఎన్ఎస్జీ(నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్)కి ఎంపికయ్యా. ఎన్ఎస్జీలో మూడేళ్లు పనిచేశా. 90 రోజుల కఠిన శిక్షణలో నెగ్గితేనే దీనికి ఎంపిక చేశారు. మిలిటెంట్ ఆపరేషన్, వీఐపీ పర్యటనలు, బాంబ్ స్క్వాడ్ విధుల్లో పాల్గొన్నాను. 16 ఏళ్ల సర్వీసు పూర్తయ్యాక ఊరికి వచ్చి కౌలు వ్యవసాయం చేస్తున్నా. ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగావకాశాలు ఇవ్వడం లేదు. – కాపుకారి జానకీరాం, మాజీ జవాన్ శ్రీనగర్‌లో హవల్దార్‌గా.. గత 19 సంవత్సరాలుగా ఆర్మీలో పనిచేస్తున్నా. సిపాయిగా ఎంపికై లాన్స్‌నాయక్, నాయక్‌గా ఉన్నతి పొంది ప్రస్తుతం హవల్దార్‌గా ఉన్నాను. ప్రస్తుతం శ్రీనగర్‌లో విధులు నిర్వహిస్తున్నాను. పలుసార్లు తీవ్ర మంచులో ఆపరేషన్లలో పనిచేశాను. రోడ్లు ధ్వంసమై, కొండచరియలు విరిగిపడిన సందర్భాల్లో నెలలతరబడి బయటకు రాలేని పరిస్థితి. కనీసం ఎవరితోనూ కమ్యూనికేషన్ లేకుండా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. – కేతావత్ రవీందర్ పెద్దనాన్న మృతి సైతం తెలియలేదు.. 2011లో ఆర్మీలో చేరాను. ప్రస్తుతం జమ్ములో నాయక్ హోదాలో పనిచేస్తున్నా. మహారాష్ట్ర, రాజస్థాన్, సికింద్రాబాద్, కశ్మీర్‌లలో పనిచేశాను. మేం మరణించినా సరే శత్రువును చంపడమే లక్ష్యంగా పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది. కొన్ని సందర్భాల్లో 3 నెలల పాటు కుటుంబ సభ్యులతో పాటు మరెవరితోనూ కమ్యూనికేషన్ లేదు. నా పెద్దనాన్న మృతి గురించి కూడా తెలియకుండా అయింది. – బాణావత్ నరేశ్ ఆర్టికల్ 370 రద్దు తరువాత.. 2012లో ఆర్మీలో చేరి ప్రస్తుతం జమ్ములో హవల్దార్‌గా విధులు నిర్వహిస్తున్నా. ఆర్టికల్ 370 రద్దు చేసిన సమయంలో మూడు నెలల పాటు ఏమాత్రం కమ్యూనికేషన్ అనేది లేకుండా పోయింది. బయటి ప్రపంచంతో సంబంధం లేని లేకుండా విధులు నిర్వహించాం. ఆర్మీలో పనిచేయడం ఆనందంగా ఉంది. – సంగెం అనిల్ 17 ఏళ్ల సర్వీసు పూర్తి.. మా ఊరి నుంచి మొదటిసారి 2000 సంవత్సరంలో చంద్రశేఖర్ ఆర్మీలోకి వెళ్లారు. ఆయన స్ఫూర్తితో నేను సైతం దేశ సేవ చేసేందుకు 2004లో ఆర్మీలో చేరాను. జమ్ము కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో పనిచేశాను. 17ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుని 2021లో వచ్చాను. అప్పటినుంచి గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్నా. – మావూరి రవీందర్, మాజీ జవాన్ భర్త గురించి టెన్షన్ పడ్డా.. నా భర్త జానకీరాం ఆర్మీలో చేసే సమ యంలో నేను కూడా పంజాబ్, ఢిల్లీ, జమ్ము కశ్మీర్, హైదరాబాద్ క్వార్టర్స్‌లో ఉన్నా. అయితే అభినందన్ వర్ధమాన్ ఘటన నేపథ్యంలో నా భర్త కిట్ బ్యాగులతో వెళ్లిన సందర్భంలో ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందాను. నా భర్త ఏ విషయం చెప్పకపోవడంతో బాగా టెన్షన్ కలిగింది. ప్రస్తుతం సర్వీసు పూర్తి చేసుకుని ఊర్లోనే ఉంటున్నాం. – కాపుకారి భవిత గర్వంగా ఉంది.. నా భర్త అనిల్ ఆర్మీ లో పనిచేస్తున్నాడంటే ఏదో ఉద్యోగం అనుకున్నా. అయితే ఇది దేశం కోసం చేసే అత్యంత రిస్క్ అని తెలిసి ఆందో ళన చెందినప్పటికీ గర్వంగానే ఉంటోంది. కు టుంబాన్ని మిస్ అవుతున్నప్పటికీ మాకు గర్వమే. గతంలో ఢిల్లీలో ఉన్నాను. ఇప్పుడు నా భర్త జమ్ములో పనిచేస్తుండగా, నేను ఇద్దరు పిల్లలు, అత్త, మామలను చూసుకుంటూ ఊర్లోనే ఉంటున్నా. – సంగెం వాణి అప్పుడప్పుడు బాధ కలుగుతుంది మాకు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఏకైక కుమారుడు అనిల్ జమ్ము లో ఆర్మీలో పనిచేస్తున్నాడు. అందరికీ పెళ్లిళ్లు చేశాను. ఒక్కగానొక్క కొడుకును ఆర్మీలోకి ఎలా పంపావని చాలామంది అడుగుతుంటే, జమ్ము కశ్మీర్లో విధ్వంసకర వార్తలు వస్తుంటే బాధ కలుగుతుంది. అయినప్పటికీ మా కొడుకు విషయంలో గర్వంగా ఉంటోంది. – సంగెం చిన్న హనుమాండ్లు -
14 ఏళ్ల జైలు శిక్ష.. కథలో కొస మెరుపు తెలుసా?
భోపాల్ : చేయని తప్పుకు 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు ఓ మాజీ ఆర్మీ ఉద్యోగి. విడుదలకు సిద్ధంగా ఉన్న 11 రోజుల ముందు అతడు నిర్ధోషని తేలటం కథలో కొస మెరుపు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మొరెనా జిల్లా భర్రద్‌కు చెందిన బల్వీర్‌సింగ్ యాదవ్ అనే మాజీ ఆర్మీ ఉద్యోగి 2006లో ఓ మర్డర్ కేసులో కొందరు స్నేహితులతో పాటు అరెస్టయ్యారు. ఆయనకు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ జనవరిలో శిక్ష కాలం పూర్తి కావస్తోంది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ హైకోర్టు మర్డర్ కేసులో బల్వీర్‌సింగ్‌ను నిర్థోషిగా తేల్చింది. విడుదలకు 11 రోజుల మందు ఈ తీర్పు రావటం గమనార్హం. దీనిపై బల్వీర్ మాట్లాడుతూ.. ‘‘ నేను చివరిసారిగా సురేంద్ర యాదవ్(హతుడు)ను చూసినందుకు నన్ను నిందితుడిగా చేర్చారు. మధ్యప్రదేశ్ హైకోర్టు తాజాగా నన్ను నిర్ధోషిగా తేల్చినందుకు సంతోషంగా ఉంది. కానీ, నేను నా జాబ్‌ను, గౌరవాన్ని, విలువైన 14 సంవత్సరాల కాలాన్ని పోగొట్టుకున్నాను. అయినప్పటికి న్యాయవ్యవస్థపై నాకు నమ్మకం పెరిగింది. న్యాయవ్యవస్థ ఏదైనా తీర్పు ఇవ్వటానికి కచ్చితమైన గడువు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఎందుకంటే నేను చేయని తప్పుకు శిక్ష అనుభవించటం చాలా కష్టంగా ఉండింది’’ అని అన్నారు. -
విశాఖ జిల్లాలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి రామారావు హత్యకు కుట్ర
-
నకిలీ నోట్ల రాకెట్ : షాకైన పోలీసులు
సాక్షి, ముంబై : మహరాష్ట్రలోని పుణేలో భారీ ఎత్తున నకిలీ నోట్లను ముద్రిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసిన పోలీసులు ఈ రాకెట్‌ను ఛేదించారు. కోట్లాది రూపాయల విలువైన స్వదేశీ, విదేశీ కరెన్సీని చూసి పోలీసు ఉన్నతాధికారులే షాక్ అయ్యారు. దీనికి సంబంధించి ఆర్మీ సిబ్బంది సహా ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. సదరన్ కమాండ్ ఇంటెలిజెన్స్ వింగ్, పూణె క్రైం బ్రాంచ్ జాయింట్ ఆపరేషన్‌లో బుధవారం(జూన్ 10)న ఈ గ్యాంగ్ ను అదుపులోకి తీసుకున్నారు. మిలటరీ ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందడంతో ఈ దాడులు నిర్వహించామని డిప్యూటీ పోలీసు కమిషనర్ క్రైమ్ బచ్చన్ సింగ్ వెల్లడించారు. మిలటరీ ఇంటెలిజెన్స్ సహకారంతో నిర్వహించిన దాడిలో ఒక జవానుతో పాటు మరికొందరు దొంగ నోట్లను ముద్రిస్తున్నారని చెప్పారు. వీటిలో వెయ్యి రూపాయల నోట్లను మినహాయించి రూ. 43.4 కోట్లు స్వదేశీ నోట్లు, రూ. 4.2 కోట్లు విదేశీ కరెన్సీ ఉన్నట్టు వివరించారు. దీనిపై ఉన్నతాధికారులు మరింత విచారణ జరుపుతున్నారనీ అదుపులోకి తీసుకున్న జవాన్‌ను పూణెలోని ఆర్మీ అధికారులకు అప్పగించామని తెలిపారు. (పెట్రో వడ్డింపు : ఎంత పెరిగిందంటే) అరెస్టయిన ఆరుగురిలో భారత ఆర్మీ జవాన్ షేక్ అలీమ్ గులాబ్ ఖాన్, ఇతరులు సునీల్ బద్రీనారాయణ సర్దా, రితేష్ రత్నాకర్, తుఫైల్ అహ్మద్ మహ్మద్ ఖాన్, రెహ్ముతుల్లా ఖాన్, అబ్దుల్ రెహమాన్ ఖాన్ అని పూణే సంయుక్త పోలీసు కమిషనర్ రవీంద్ర షిస్వే తెలిపారు. (ఫెడ్ ఎఫెక్ట్ : లాభాలకు చెక్) పోలీసులు అందించిన మరిన్ని వివరాలు రూ .43.4 కోట్ల విలువైన భారత కరెన్సీ, రూ .4.2 కోట్ల విలువైన యుఎస్ డాలర్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బదులుగా ‘చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ పేరుతో ముద్రణ వీటిలో 2016 లో కేంద్రం రద్దు చేసిన పెద్ద నోట్లు కూడా ఉన్నాయి. ఈ నకిలీ నోట్ల కట్టల్లో మొదటి నోటు మాత్రమే అసలుది ఉంటుంది. ఒక నకిలీ పిస్తోల్ స్వాధీనం Six persons, including one serving military personnel detained in possession of multiple denominations of fake Indian and foreign currency. Counting of currency & further investigation underway: Crime Branch, Pune #Maharashtra pic.twitter.com/KamjyHelV3 — ANI (@ANI) June 10, 2020 -
భూకబ్జాపై సైనికుడి సెల్ఫీ వీడియో
సాక్షి, గంగాధరనెల్లూరు(చిత్తూరు) : మండలంలోని ఎల్లాపల్లెకు చెందిన సైనికుడు చంద్రబాబు తన తల్లికి ప్రాణభయం ఉంద ని సెల్ఫీ వీడియో తీసి పెట్టడంతో అధికారులు స్పందించారు. గ్రామానికి వెళ్లి సమస్యను అక్కడికక్కడే పరిష్కరించారు.వివరాలు.. ఎల్లాపల్లెకు చెందిన కుప్పమ్మ కుమారులు చంద్రబాబు,మహేంద్ర ఆర్మీ లో పనిచేస్తున్నారు. అదేగ్రామానికి చెందిన శోభన్‌బాబు, సాంబశివనాయుడు తమ భూములు కబ్జా చేశారని, గ్రామంలో బెదిరింపులు ఎదురవుతున్నాయని చంద్రబాబు అప్లోడ్ చేసిన సెల్ఫీవీడియో మంగళవారం వైరల్ అయ్యింది. దీంతో తహసీల్దారు భవానీ, ఎస్ఐ నాగసౌజన్య ఆర్ఐ చంద్రశేఖర్, అడిషనల్ సర్వేయర్ బాబు, వీఆర్వో రవి గ్రామానికి వెళ్లి విచారణ చేశారు. గ్రామంలో గ్రామకంఠం 6 ఎకరాల పైచిలుకు ఉందని గుర్తించారు. ఈ భూముల్లో గ్రామస్తులు స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఇందులో చంద్రబాబు కుటుంబానికి అధికారులు రెండు ఇంటి పట్టాలు ఇచ్చి ఉన్నారు. ఇందులో సాంబశివనాయుడుకు, చంద్రబాబు తల్లి కుప్పమ్మకు దారి సమస్య ఉండడాన్ని అధికారులు గుర్తించడంతో అసలు నిజం బయటపడింది. వెంటనే భూమిని సర్వేచేశారు. 15 అడుగుల వెడల్పుతో దారిని ఏర్పాటు చేసి, సమస్యను అక్కడికక్కడే పరిష్కరించారు. గ్రామస్తులు కలసి మెలసి ఉండాలని అధికారులు హితవు పలికారు. గొడవలు జరిగితే కేసులు నమోదు చేస్తామన్నారు. -
ప్రాణాలు కాపాడినవ్.. జవాన్‌కు పాదాభివందనం!
ముంబై : కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు పలు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఒకచోట కాకుంటే మరోచోట వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మహారాష్ట్రలో వరదలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా వరదల ప్రభావంగా తీవ్రంగా ఉన్న సంగ్లీ జిల్లాలో పరిస్థితి దయనీయంగా ఉంది. ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, కోస్ట్ గార్డ్ దళాలు సహాయ చర్యల్లో పాలుపంచుకుంటూ.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితప్రాంతాలకు తరలిస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఇదే జిల్లాలో పడవ బోల్తా పడి 14 మంది మరణించిన సంగతి తెలిసిందే. సంగ్లీ జిల్లాలో జవాన్లు ముమ్మరంగా చేపడుతున్న సహాయక చర్యలకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది. జర్నలిస్టు నీరజ్ రాజ్‌పుత్ తన ట్విటర్ ఖాతాలో ఈ జిల్లాకు సంబంధించిన ఓ భావోద్వేగమైన వీడియోను పంచుకున్నారు. వరదల్లో చిక్కుకుని బిక్కుబిక్కుమంటున్న ప్రజలను కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నందుకు ఆర్మీ అధికారి కాళ్లుమొక్కి ఓ మహిళ కృతజ్ఞత చాటుకున్నారు. ఆపదలో ఆదుకుంటున్న జవాన్ల పట్ల ఆమె చూపిన కృతజ్ఞతాభావం నెటిజన్లను కట్టిపడేస్తోంది. పురాతన సంప్రదాయాలు పల్లెల్లో ఇంకా సజీవంగానే ఉన్నాయని, కృతజ్ఞతాభావం చాటడంలో పల్లెవాసులు ముందుంటారని నెటిజన్లు కామెంట్లతో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. Heart warming video from #sangli where a woman pays gratitude by touching soldiers' feets for rescuing them#Floods2019 #FloodSangli @adgpi pic.twitter.com/FIp7nTXyao — Neeraj Rajput (@neeraj_rajput) August 10, 2019 -
వైరల్ ఫోటోలు : గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేసినా ఆర్మీ ఆఫీసర్
చెన్నై : ప్రేమించడం అంటే అమ్మలా అక్కున చేర్చుకోవడం.. నాన్నలా బాధ్యతగా చూసుకోవడం.. సోదరునిలా తోడుగా నిలవడం.. మిత్రునిగా సుఖసంతోషాలు పంచుకోవడం.. కానీ నేడు చాలా మంది ప్రేమ అనే పేరుకు కనీసం అర్థం కూడా తెలియని వయసులో.. ప్రేమ పేరు చెప్పి వెర్రిమొర్రి వేషాలు వేస్తూ.. బరువు బాధ్యతలను మర్చిపోయి తిరుగుతున్నారు. ప్రేమ పేరుతో అడ్డు అదుపూ లేకుండా తిరగడం.. బాధ్యతలు మీద పడే సమయానికి నమ్ముకున్న వారిని నట్టేటముంచడం.. కొందరు మరో అడుగు ముందుకు వేసి ప్రేమించిన వ్యక్తి తనకు కాకుండా మరేవరికి దక్కకూడదనే ఆవేశంలో పైశాచికంగా ఎదుటి వ్యక్తి ప్రాణాలు కూడా తీయడానికి వెనకడాకపోవడం.. ఇది నేటి కాలం ప్రేమ, ప్రేమికుల పరిస్థితి. అయితే అందరూ ఇలానే ఉంటారా అంటే ఉండరు. ప్రేమించిన వ్యక్తిని జీవితాంతం సంతోషంగా ఉంచాలి అనుకునే వారు ముందు అందుకు తగిన విధంగా తమ జీవితాన్ని మార్చుకుంటారు.. మలచుకుంటారు. ఈ కోవకు చెందిన వ్యక్తే చంద్రేష్ సింగ్. ప్రేమించిన స్నేహితురాలిని వివాహం చేసుకోవాలనుకున్నాడు. కానీ దానికంటే ముందు జీవితంలో స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు. అందుకుగాను దాదాపు మూడేళ్లపాటు శ్రమించి కోరుకున్న చెలిని మాత్రమే కాక మనసుకు నచ్చిన ఉద్యగాన్ని కూడా సాధించి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. వివారాలు.. ఠాకూర్ చంద్రేష్ సింగ్(25) డిగ్రీ చదవడం కోసం 2012లో బెంగళూరులోని సెయింట్ జోసఫ్ కాలేజ్‌లో చేరాడు. అక్కడ అతనికి ధారా పరిచయమయ్యింది. ఈ క్రమంలో చంద్రేష్, ధారాను ప్రేమించాడు. తన మనసులోని మాటను ధారాకు చెప్పడానికి కంటే ముందు మరో ముఖ్యమైన బాధ్యత అతనికి గుర్తుకు వచ్చింది. ‘ప్రేమించడం తేలికే. కానీ ఆ ప్రేమను జీవితాంతం నిలబెట్టుకోవాలన్నా.. ధారా తల్లిదండ్రులు నా ప్రేమను అంగీకరించాలన్నా ముందు నేను జీవితంలో స్థిరపడాలి. నన్ను నేను నిరూపించుకోవాలి. అందుకోసం నాకిష్టమైన ఆర్మీలో చేరతాను. ఉద్యోగం సాధించిన తరువాతనే ధారాకు నా మనసులోని మాటను చెప్తాను’ అని నిశ్చయించుకున్నాడు. కానీ చంద్రేష్ ఆర్మీలో చేరడానికి ముందే ధారా గురించి తన కుటుంబ సభ్యులకు చెప్పి వారి అనుమతి పొందాడు. అనంతరం చెన్నైలోని ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలో చేరాడు. దాదాపు మూడున్నరేళ్ల తర్వాత శిక్షణ చివరి రోజున తన తల్లిదండ్రులతో పాటు ధారాను, ఆమె తల్లిదండ్రులను కూడా ఆహ్వానించాడు. శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్నందుకు గుర్తుగా చంద్రేష్ తల్లిదండ్రులు అతనికి స్టార్స్ అలంకిరంచారు. అనంతరం వారందరి సమక్షంలో చంద్రేష్, ధారాకు తన ప్రేమను తెలియజేసి ఆమెను వివాహం చేసుకుంటానంటూ కోరాడు. అందుకు ధారా కూడా సంతోషంగా ఒప్పుకుంది. అటూ ఇరుకుటుంబాల పెద్దలు కూడా వీరి ప్రేమను అంగీకరించడమే కాకా త్వరలోనే వివాహం చేస్తామని తెలిపారు. ఒకే రోజు ఇష్టమైన కొలువును.. మనసుకు నచ్చిన అమ్మాయిని పోందిని చంద్రేష్, ధారాల ఫోటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పటికే ఈ ఫోటోలను కొన్ని వేల మంది వీక్షించడమే కాక చంద్రేష్ - ధారాలను అభినందనలతో ముంచేత్తుతూ మీ ప్రేమ ఎందరికో ఆదర్శం అంటూ పొగుడుతున్నారు. View this post on Instagram Beautiful pictures from OTA Chennai ⚔️🇮🇳❤️ #indianarmy A post shared by SSBCrack™ (@ssbcrackofficial) on Sep 11, 2018 at 6:42am PDT -
భూ ఆక్రమణపై సైనికుడి దీక్ష
రొంపిచెర్ల: తాతల కాలం నుంచి అనుభవంలో ఉన్న భూమిని ఒక విశ్రాంత ఉద్యోగి ఆక్రమించుకున్నాడని ఓ జవాన్ భూమి వద్ద నిరసన దీక్ష చేపట్టాడు. ఈ సంఘటన రొంపిచెర్ల మండలం మోటుమల్లెల గ్రామ పంచాయతీలోని గంగిరెడ్డిగారిపల్లె సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. కొత్తపల్లెకు చెందిన జగన్మోహన్రెడ్డి 2003వ సంవత్సరం నుంచి జవాన్‌గా పనిచేస్తున్నారు. సర్వే నంబరు 2082–7లో ఎకరా భూమి 150 సంవత్సరాలుగా తాతల కాలం నుంచి తమ ఆధీనంలోనే ఉందని తెలిపారు. గంగిరెడ్డిగారిపల్లె గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేశాడని తెలిపారు. న్యాయం కోసం నిరసన దీక్షకు దిగామని తెలిపారు. జవాన్ జగన్మో హన్‌రెడ్డికి చెందిన భూమి ఇతరులు అక్రమించుకోకుండా న్యాయం చేస్తామని తహసీల్దార్ వెంకటకృష్ణుడు తెలిపారు. జవాన్ పొలం వద్ద దీక్ష చేస్తున్నారని తెలియడంతో అప్పటికప్పుడే వీఆర్వో దామోదర్‌ను విచారణ కోసం పంపించామని తెలిపారు. ఆక్రమణ దారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
పెళ్లి చేసుకుంటానని నమ్మించి..
సాక్షి, విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లాలో దారుణం జరిగింది. మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ ఆర్మీ ఉద్యోగి గర్భవతిని చేసిన సంఘటన స్ధానికంగా కలకలం రేపింది. ఈ ఘటన విశాఖపట్నంలోని చోడవరం మండలం గౌరవరం గ్రామంలో చోటుచేసుకుంది. జొన్నపల్లి జగన్నాథం అనే ఆర్మీ ఉద్యోగి ఓ మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక బంధువులు చోడవరం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆర్మీ ఉద్యోగిపై నిర్భయ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మైనర్ బాలికకు న్యాయం చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. -
రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాను మృతి
ప్రకాశం: వేగంగా వెళ్తున్న లారీ.. ముందు వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గూనిరెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణమైన లారీ బైకును సుమూరు మూడు కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. వివరాలు.. గిద్దలూరుకు చెందిన ఆర్మీ జవాను నక్కపాండు (42) శుక్రవారం తెల్లవారుజామున తాడిచర్లకు బైక్ పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో గూనిరెడ్డిపల్లి గ్రామంలోని స్పీడ్ బ్రేకర్ వద్ద వాహనం నెమ్మదించడంతో వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. మృతదేహాన్నిస్పీడ్ బ్రేకర్ నుంచి సుమారు వంద మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లిన లారీ అక్కడ పడేసింది. ఆ తర్వాత అలాగే ముందుకు వెళ్లిపోయింది. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చెక్‌పోస్ట్ వద్ద.. లారీ కింది భాగంలో బైక్ ఇరుక్కున్న విషయం గుర్తించిన.. కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
తోటి ఉద్యోగిని కాల్చి చంపిన ఆర్మీ జవాను
లక్నో: ఓ ఆర్మీ జవాను తన సహోద్యోగిని కాల్చి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మీరట్ లో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమిత్, అరవింద్ లు ఆర్మీ జవాన్లు. అయితే వారిద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. బలియా గ్రామంలో అమిత్ నివాసం ఉంటుండగా, మీరట్ లో అరవింద్ ఉంటున్నాడు. ఈ క్రమంలోనే అరవింద్ ఇంటికి వెళ్లిన అమిత్ తన వద్ద నున్న గన్ తో కాల్పులకు పాల్పడ్డాడు. అరవింద్ నిద్రిస్తున్న సమయంలో అతనిపై అమిత్ కాల్పులు జరిపినట్లు పోలీసు అధికారి తెలిపారు. ప్రస్తుతం అక్కడి నుంచి పరారైన జవాను అమిత్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అమిత్ భార్యతో అరవింద్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తమ ప్రాథమిక విచారణలో తేలిందని.. ఈ కారణంతోనే అరవింద్ మృతికి అమిత్ కారణమై ఉండవచ్చని పోలీస్ అధికారి తెలిపాడు. -
స్వగ్రామానికి జవాన్ మృతదేహం
హైదరాబాద్ సిటీ: కశ్మీర్లో కొండచరియలు విరిగిపడి రాష్ట్రానికి చెందిన జవాను శివశంకర్ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, ఆయన మృతదేహం సోమవారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నట్లు సమాచారం. అనంతరం అక్కడి నుంచి జవాన్ సొంత ఊరు అయిన మహాబూబ్‌నగర్ జిల్లాలోని కమరం గ్రామానికి తీసుకెళ్లనున్నారు. సొంత గ్రామంలో మిలటరీ లాంఛనాల ప్రకారం మంగళవారం ఆయన అంత్యక్రియలు జరుపుతారు. -
ఆర్మీ జవాన్ ఆత్మహత్య
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ నగరం ఎల్లారెడ్డి గూడలోని తన నివాసంలోనే ఎన్ సతీష్ కుమార్ అనే ఆర్మీ జవాన్ బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సతీష్ ఈ నెల 7న స్వగృహ ప్రవేశం నిమిత్తం ఢిల్లీ నుంచి వచ్చాడు. ఆర్ధిక ఇబ్బందులతోనే బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇల్లు కట్టడానికి సుమారు రూ.6 లక్షలు అప్పు చేసినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.