తోటి ఉద్యోగిని కాల్చి చంపిన ఆర్మీ జవాను | Army man shoots colleague dead in Meerut | Sakshi
Sakshi News home page

తోటి ఉద్యోగిని కాల్చి చంపిన ఆర్మీ జవాను

Published Mon, Apr 13 2015 6:29 PM | Last Updated on Sun, Sep 3 2017 12:15 AM

Army man shoots colleague dead in Meerut

లక్నో: ఓ ఆర్మీ జవాను తన సహోద్యోగిని కాల్చి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మీరట్ లో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమిత్, అరవింద్ లు ఆర్మీ జవాన్లు. అయితే వారిద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. బలియా గ్రామంలో అమిత్  నివాసం ఉంటుండగా, మీరట్ లో అరవింద్ ఉంటున్నాడు. ఈ క్రమంలోనే అరవింద్ ఇంటికి వెళ్లిన అమిత్ తన వద్ద నున్న గన్ తో కాల్పులకు పాల్పడ్డాడు.

 

అరవింద్ నిద్రిస్తున్న సమయంలో అతనిపై అమిత్ కాల్పులు జరిపినట్లు పోలీసు అధికారి తెలిపారు. ప్రస్తుతం అక్కడి నుంచి పరారైన జవాను అమిత్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అమిత్ భార్యతో అరవింద్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తమ ప్రాథమిక విచారణలో తేలిందని.. ఈ కారణంతోనే అరవింద్ మృతికి అమిత్ కారణమై ఉండవచ్చని పోలీస్ అధికారి తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement