భూమి వద్ద భార్యతో కలసి నిరసన దీక్ష చేస్తున్న జవాన్ జగన్మోహన్‌రెడ్డి
రొంపిచెర్ల: తాతల కాలం నుంచి అనుభవంలో ఉన్న భూమిని ఒక విశ్రాంత ఉద్యోగి ఆక్రమించుకున్నాడని ఓ జవాన్ భూమి వద్ద నిరసన దీక్ష చేపట్టాడు. ఈ సంఘటన రొంపిచెర్ల మండలం మోటుమల్లెల గ్రామ పంచాయతీలోని గంగిరెడ్డిగారిపల్లె సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. కొత్తపల్లెకు చెందిన జగన్మోహన్‌రెడ్డి 2003వ సంవత్సరం నుంచి జవాన్‌గా పనిచేస్తున్నారు. సర్వే నంబరు 2082–7లో ఎకరా భూమి 150 సంవత్సరాలుగా తాతల కాలం నుంచి తమ ఆధీనంలోనే ఉందని తెలిపారు.
గంగిరెడ్డిగారిపల్లె గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేశాడని తెలిపారు. న్యాయం కోసం నిరసన దీక్షకు దిగామని తెలిపారు. జవాన్ జగన్మో హన్‌రెడ్డికి చెందిన భూమి ఇతరులు అక్రమించుకోకుండా న్యాయం చేస్తామని తహసీల్దార్ వెంకటకృష్ణుడు తెలిపారు. జవాన్ పొలం వద్ద దీక్ష చేస్తున్నారని తెలియడంతో అప్పటికప్పుడే వీఆర్వో దామోదర్‌ను విచారణ కోసం పంపించామని తెలిపారు. ఆక్రమణ దారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment