ప్రకాశం: వేగంగా వెళ్తున్న లారీ.. ముందు వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గూనిరెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణమైన లారీ బైకును సుమూరు మూడు కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. వివరాలు.. గిద్దలూరుకు చెందిన ఆర్మీ జవాను నక్కపాండు (42) శుక్రవారం తెల్లవారుజామున తాడిచర్లకు బైక్ పై వెళ్తున్నాడు.
ఈ క్రమంలో గూనిరెడ్డిపల్లి గ్రామంలోని స్పీడ్ బ్రేకర్ వద్ద వాహనం నెమ్మదించడంతో వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. మృతదేహాన్నిస్పీడ్ బ్రేకర్ నుంచి సుమారు వంద మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లిన లారీ అక్కడ పడేసింది. ఆ తర్వాత అలాగే ముందుకు వెళ్లిపోయింది. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చెక్‌పోస్ట్ వద్ద.. లారీ కింది భాగంలో బైక్ ఇరుక్కున్న విషయం గుర్తించిన.. కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాను మృతి
Published Fri, Jul 3 2015 11:39 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement