టీటీఈపై ప్రయాణికుల దాడి
గాయపడడంతో ఉస్మానియాకు తరలింపు
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఎంఎంటీఎస్‌లో రైలులో ఓ టీటీఈ(ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్)పై ముగ్గురు మహిళలు దాడికి పాల్పడ్డారు. నాంపల్లి జీఆర్‌పీ పోలీసుల కథనం ప్రకారం... టీటీఈ కౌసల్య సికింద్రాబాద్ నుంచి లింగంపల్లికి వెళ్లే ఎంఎంటీఎస్(47150) ట్రైన్‌లో బుధవార ం ఉదయం విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కుమారి, పద్మ, రాధ అనే ప్రయాణికులు బేగంపేట్ రైల్వేస్టేషన్ సమీపంలో టికెట్ లేకుండా పట్టుబడ్డారు. దీంతో వారిపై రూ.250 చొప్పున జరి మానా విధించారు. దీంతో వాగ్వాదానికి దిగి టీటీఈపై దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు బేగంపేట్ స్టేషన్‌లో పద్మ, కుమారీలను అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ కౌసల్యను ఉస్మానియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలిం చారు. టీటీఈపై దాడిని నిరసిస్తూ మజ్దూర్ యూని యన్ నాంపల్లి జీఆర్‌పి స్టేషన్ వద్ద నిరసన చేపట్టిం ది. టికెట్టు తీసుకోకపోవడం తప్పే. ఫైన్ కట్టలేదని చేతిలోని సెల్‌ఫోన్‌ను లాక్కున్నారు. బోగీల్లోంచి కిందకు ఈడ్చుకు వెళ్లింది, చెంపపై కొట్టింది.
టీటీఈల వెంట సాయుధ పోలీసులు...
టీటీఈల వెంట ఇక నుంచి సాయుధులైన పోలీసులు పంపేలా రైల్వే అధికారులు నిర్ణయిం చారు. విధులకు అడ్డుపడి దురుసుగా వ్యవహరిస్తే ఆరునెలల జైలు శిక్ష, రూ.వేయి వరకు జరిమానా విధించనునున్నారు.