women attack
-
వీళ్లు ఆడవాళ్లా లేక రౌడీలా?.. తప్పతాగి నడిరోడ్డులో యువతిపై దాడి
భోపాల్: తాగిన మత్తులో అర్ధరాత్రి నలుగురు మహిళలు నడిరోడ్డులో హల్చల్ చేశారు. మరో మహిళపై దాడి చేశారు. కాలితో తన్నుతూ, బెల్టుతో కొడుతూ చిత్రహింసలు పెట్టారు. చుట్టూ చాలా మంది ఉన్నా వారి దుశ్చర్యను ఎవరూ అడ్డుకోకపోగా.. వీడియోలు తీస్తూ ఉండిపోయారు. ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగింది. యువతిపై నలుగురు మహిళలు దాడి చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇండోర్‌లోని ఎల్ఐడీ జంక్షన్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. యువతి వెంట్రుకలు పట్టుకుని పిడిగుద్దులతో విరుచుకుపడటం, బెల్టుతో కొట్టటం, కిందపడేసి తన్నుతున్న దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనపిస్తున్నాయి. ఎలాంటి కారణం లేకుండానే తనపై నలుగురు మహిళలు దాడి చేశారని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు ఇండోర్‌లోని ఓ ఎరువుల దుకాణంలో సెల్స్పర్సన్గా పని చేస్తోందని, ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. WATCH - Indore: Video of 'drunk' girls beating another girl on road goes viral.#Indore #Fight https://t.co/HBnMtpAWWI pic.twitter.com/Lan7H8IW4i — Md fasahathullah siddiqui (@MdFasahathullah) November 7, 2022 ఇదీ చదవండి: మద్యం మత్తులో ఎమ్మెల్యే కొడుకు హంగామా.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ -
ప్రభుత్వ ఉపాధ్యాయుడికి బడితపూజ చేసిన మహిళలు.. వీడియో వైరల్
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ఆజంగఢ్‌లో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయునికి బడితపూజ చేశారు మహిళలు. కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో దాడి చేసి చెప్పులతో కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మహిళలు దాడి చేస్తుండగా.. ఆపేందుకు ఇతర ఉపాధ్యాయుల ప్రయత్నించారు. అయినా వాళ్లు మాత్రం వెనక్కితగ్గలేదు. అయితే ఈ ఉపాధ్యాయుడు పాఠశాలలోని అమ్మాయిలను లైంగికంగా వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన బాలికల దండ్రులు ఆగ్రహంతో అతనిపై దాడికి పాల్పడ్డారు. అక్కుడున్న ఇతర సిబ్బంది పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. आजमगढ़ के पवई थाना क्षेत्र में स्थित एक प्राथमिक विद्यालय में अध्यापक पर छात्रा के साथ कथित रूप से अश्लील हरकत करने का आरोप। महिला शिक्षकों ने मिलकर अध्यापक की कर दी पिटाई।#Azamgarh #UttarPradesh #Teacher pic.twitter.com/csLvFuc15t — UP Tak (@UPTakOfficial) October 20, 2022 చదవండి: 23వ అంతస్తు నుంచి దూకిన ప్రముఖ బిల్డర్ -
విడాకులు తీసుకుని ఒంటరి జీవితం.. అతడితో క్లోజ్‌గా ఉంటూ..
తిరువళ్లూరు: ఓ మహిళను గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కత్తితో పొడిచి పరారయ్యారు. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. కాంచీపురం జిల్లా శ్రీపెరంబదూరు తాలుకా వలర్పురం గ్రామానికి చెందిన కార్తికేయన్ (45) దుబాయ్‌లోని ప్రింటింగ్ ప్రెస్‌లో తనతో పాటు పని చేసే శ్రీలంకకు చెందిన రోహిణివసంతి(41)ని 2005లో ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలం తరువాత తమ సొంత గ్రామానికి వచ్చి జీవనం సాగిస్తున్నారు. అయితే రోహిణి పలువురు పురుషులతో సన్నిహితంగా మెలుగుతుండడంతో పాటు ప్రవర్తనలో మార్పురాకపోవడంతో విడాకులు తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు 2017 నుంచి నెలకు రూ.50 వేలు పిల్లల పోషణ కోసం కార్తికేయన్ చెల్లిస్తున్నాడు. కాగా, తిరువళ్లూరులోని అద్దె ఇంట్లో నివాసం ఉంటూ ఆమె టైలరింగ్ షాపు నిర్వహిస్తోంది. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో టైలర్‌షాపులోనే ఆమెను ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి పరారయ్యారు. ఇన్స్పెక్టర్ పద్మశ్రీబబ్బి రక్తపుమడుగులో పడి ఉన్న ఆమెను తిరువళ్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి విచారణ చేపట్టారు. విచారణలో ఈమె కమలకన్నన్‌తో సహజీవనం చేస్తూనే, మరో కొంతమందితో సన్నిహితంగా మెలుగుతున్నట్టు తేలింది. అక్రమ సంబంధాలే హత్యాయత్నానికి కారణమై ఉండొచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: నాలుగేళ్ల క్రితమే భర్త మృతి.. అతడితో పరిచయం కాస్తా.. -
మాస్క్ ధరించమన్నందుకు ఉబర్ డ్రైవర్‌పై మహిళ దాడి
వాషింగ్టన్: కరోనా సమయంలో మాస్క్ ధరించడాన్ని ప్రభుత్వాలు తప్పనిసరి చేశాయి. కొంతమంది ముఖానికి మాస్క్ ధరించడాన్ని విధిగా పాటిస్తున్నారు. మరికొంత మంది మాస్క్ వేసుకోవాడన్ని లేక్క చేయకుండా యథేచ్ఛగా తిరుగుతున్నారు. తాజాగా ఓ ఉబర్ డైవర్ తన కారులో ప్రయాణిస్తున్న మహిళను మాస్క్ ధరించాలని కోరగా ఆమె అతనిపై దాడికి దిగి, అసభ్యంగా ప్రవర్తించింది. ఈ ఘటన అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుభాకర్ ఖాడ్కా అనే ఉబర్ డ్రైవర్ ఆదివారం బేవ్యూ ప్రాంతంలో ముగ్గురు మహిళలను తన కారులో ఎక్కించుకున్నాడు. కారులో కూర్చున్న ముగ్గురు మహిళల్లో ఓ మహిళ మాస్క్ ధరించలేదు. దీంతో ఉబర్ డ్రైవర్ సదరు మహిళను మాస్క్ ధరించాలని కోరాడు. దీంతో ఆ మహిళ కోపంగా డ్రైవర్ మీదకు వెళ్లుతూ కావాలని దగ్గటం ప్రారంభించింది. అదీకాక తీవ్రంగా అరుస్తూ అతని మాస్క్, మొబైల్ ఫోన్‌ను లాక్కోవడానికి ప్రయత్నించింది. ఆ మహిళలు తమ గమ్యస్థానంలో కారు దిగి వెళ్లిపోయారు. ఈ ఘటనపై స్పందించిన ఉబర్ సంస్థ ఇక సదరు మహిళకు ఉబర్ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. డ్రైవర్ సుభాకర్ ఖాడ్కా మాట్లాడుతూ.. ఆ మహిళ కారులో తనపై పెప్పర్ స్ప్రే చల్లిందని తనకు శ్వాస తీసుకోవాడనికి చాలా ఇబ్బంది అయినట్లు తెలిపాడు. తనది నేపాల్దేశామని, ప్రయాణికులతో ఎప్పుడూ దురుసుగా ప్రవర్తించలేదని తెలిపాడు. తనది నేపాల్ దేశమని ఆ మహిళలు వివక్ష చూపి, దాడికి చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: వ్వాట్! ఏమన్నారూ.. అనేముందు ఆలోచించాలి -
కుక్క మొరిగిందని మహిళపై దాడి.. ఆపై!
ముంబై: ముంబైలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళకు చెందిన పెంపుడు కుక్క మొరిగిందని మరో నలుగురు మహిళలు ఆమెపై దాడి చేయడంతో బాధితురాలు గుండుపోటుతో మరణించింది. ఈ విషాద ఘటన డోంబివ్లిలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. నాగమ్మ శెట్టి(35) అనే వితంతు మహిళ తన కూతురితో కలిసి డొంబివ్లిలోని మన్పాడలో నివాసం ఉంటుంది. ఈ క్రమంలో ఆమె పెంపుడు కుక్క ఓ రోజు ఏకధాటిగా అరవడంతో అదే వీధికి చెందిన నలుగురు మహిళలు భరించలేక సదరు మహిళను కుక్క అరవకుండ చూసుకోమని హెచ్చరించారు. అయినప్పటికీ కుక్క అదే పనిగా అరవడంతో ఆవేశానికి లోనైన మహిళలు కుక్క యజమానితో వాగ్వాదానికి దిగారు. వీరి మధ్య మాటలు ముదిరి గొడవ తీవ్ర స్థాయికి చేరింది. అనంతరం ఆ నలుగురు మహిళలు దాడి చేసి కుక్క యజమానిని కింద పడేసి ఛాతిపై కాళ్లతో తన్నారు. దాడిలో గాయపడిన మహిళ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది. అనంతరం ఛాతిలో తీవ్రమైన నొప్పి రావడంతో ఆసుపత్రికి వెళ్లిన ఆమెకు చికిత్స అందిస్తుండగా మరణించింది. ఈ ఘటనపై డీసీపీ వివేక్ పన్సారీ మాట్లాడుతూ.. బాధితురాలైన నాగమ్మ శెట్టిపై నలుగురు మహిళలు గొడవ పడినట్లు ఆమె పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ముందుగా ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని సూచించినట్లు ఆయన చెప్పారు. అయితే అది పట్టించుకోని ఆ మహిళ ఇంటికి వెళ్లిందని, ఆ తరువాత తనకు ఛాతిలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు. చికిత్స చేస్తుండగా మధ్యలోనే ఆమె మరణించినట్లు తెలిపారు. పోస్టుమార్టం నివేదికలో మృతురాలు గుండె పోటుతో మరణించినట్లు డాక్టర్లు వెల్లడించినట్లను డీసీపీ పేర్కొన్నారు. -
మహిళపై టీడీపీ నాయకుడి దాష్టీకం
కళ్యాణదుర్గం: తెలుగుదేశం పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. అధికార పార్టీ నాయకుడి దాష్టీకం ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనవద్ద అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించండి అని మహిళ కోరడంతో ఆగ్రహించిన నాయకుడు విచక్షణ కోల్పోయి ఊరి మధ్యలో అందరూ చూస్తుండగా ఆమెను కిందపడేసి వివస్త్రను చేశాడు. బాధితురాలు చెప్పు తీసుకుని తిరగబడే సరికి సదరు నాయకుడు పలయానం చిత్తగించాడు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే... నియోజకవర్గంలోని ఓ మండల టీడీపీ మాజీ కన్వీనర్ తను సన్నిహితంగా ఉంటున్న మహిళ వద్ద అప్పు తీసుకున్నాడు. ఎన్ని రోజులైనా తిరిగి ఇవ్వకపోవడంతో సదరు మహిళ రెండు రోజుల కిందట నిలదీసింది. తన వద్ద తీసుకున్న అప్పు చెల్లించేయాలని డిమాండ్ చేసింది. దీంతో అతను అందరూ చూస్తుండగానే దుర్భాషలాడుతూ ఆమెను ఊరి మధ్యలో కిందపడేశాడు. చీరను లాగి.. జాకెట్ చించి వివస్త్రను చేశాడు. తన ఆత్మగౌరవానికి భంగం వాటిల్లడంతో బాధితురాలు చెప్పు తీసుకుని తిరగబడింది. అంతే ఆ నేత అక్కడి నుంచి పారిపోయాడు. టీడీపీ నేత తీరును ప్రతి ఒక్కరూ అసహ్యించుకున్నారు. ఒక మహిళ అని కూడా చూడకుండా నడి బజార్లో దుశ్వాసనపర్వానికి పాల్పడిన అతడిని తప్పుబట్టారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బాధిత కుటుంబ సభ్యులు భయపడుతున్నారు. పోలీసులు సదరు నాయకుడిని అదుపులోకి తీసుకున్నప్పటికీ టీడీపీ ముఖ్యనేతల నుంచి ఒత్తిళ్లు రావడంతో కనీస విచారణ కూడా చేయకుండా వదిలేశారు. -
వృద్ధురాలిపై మహిళ దాడి
నందిగామ(షాద్‌నగర్) రంగారెడ్డి : తన ఇంటి ఆవరణలో పెట్టిన సామగ్రిని తీసుకెళ్లమని చెప్పిన ఓ వృద్ధురాలిపై మరో మహిళ దాడి చేసిన సంఘటన మండలంలోని వీర్లపల్లి›లో ఆదివారం చోటుచేసుకుంది. నందిగామ ఏఎస్ఐ భాస్కర్‌రెడ్డి కథనం ప్రకారం.. వీర్లపల్లి గ్రామానికి చెందిన కాట్న పెంటమ్మ ఇంటి ఆవరణలో పొరుగింటి మహిళ రాములమ్మ తన పాత సామగ్రి పెట్టింది. ఈ విషయమై ఇక్కడి నుంచి సామగ్రిని తీసుకెళ్లమని రాములమ్మకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం మరోసారి పెంటమ్మ సామగ్రి తీసుకెళ్లమని సూచించగా రాములమ్మ వాగ్వాదానికి దిగింది. అంతటితో ఆగక కర్రతో పెంటమ్మ తలపై దాడి చేయగా ఆమెకు తలకు తీవ్రగాయాలయ్యాయి. పెంటమ్మ ఫిర్యాదు మేరకు రాములమ్మపై కేసు నమోదు చేసినట్లు భాస్కర్‌రెడ్డి వివరించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
కోలుకుంటున్న భూ బాధితులు
సాక్షి, బుచ్చెయ్యపేట(చోడవరం): మండలంలోని ఎంబీపాలెంలో గ్రామస్తుల దాడిలో గాయపడిన మహిళలు అనకాపల్లి ఏరియా ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. తమ భూమిలో జీడి పిక్కలు సేకరిస్తున్న గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు కలం వెంకట లక్ష్మి, అప్పాన మహాలక్ష్మిలపై అదే గ్రామానికి చెందిన కొందరు ఈ భూములు తమవంటూ శుక్రవారం దాడి చేసి గాయపరిచిన విషయం తెలిసిందే. అపస్మారక స్థితికి చేరిన ఇద్దరినీ 108లో అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల, చేతులు, ఇతర శరీర భాగాలపై తీవ్ర గాయాలైన అక్కాచెల్లెళ్లు మంచానికే పరిమితం అయ్యారు. 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కోడానికి నాయకులు, అధికారులు కలిసి తమను భయాందోళనలకు గురి చేస్తున్నారన్నారు. తమకు న్యాయం జరగడం లేదంటూ ఆరోపించారు. సెలవులతో ధర్నా వాయిదా.. మహిళలపై దాడికి నిరసనగా శనివారం బుచ్చెయ్యపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు బాధిత మహిళల కుటుంబీకులు, గ్రామస్తులు యోచించారు. శనివారం నుంచి సోమవారం వరకు వరుస సెలవులతో అధికారులు అందుబాటులో ఉండరని ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఎనిమిది మందిపై ఫిర్యాదు బాధితుల ఫిర్యాదు మేరకు ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన టీడీపీ ఎంపీటీసీ కుమారుడు కరణం నూకరాజుతో పాటు తహసీల్దార్ కె.వెంకట శివ, గ్రామానికి చెందిన అప్పాన అప్పలనాయుడు, ముత్యాలు, బేరా పడమటమ్మ, బర్ల చిన్న, పురిటి రాజు, సత్యంలు తమపై దాడితోపాటు అత్యాచారానికి ప్రయత్నించారని, బలవంతంగా భూములను లాక్కోవడానికి చూస్తున్నారని బాధితులు బుచ్చెయ్యపేట ఎస్ఐకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని ఎస్ఐ కృష్ణారావు తెలిపారు. తహసీల్దార్ తమను డబ్బులు డిమాండ్ చేశారని, తన గదిలోకి రమ్మన్నారని బాధిత మహిళలు ఆరోపించారు. -
చంటిబిడ్డతో షాపింగ్ చేస్తుండగా..
కెనడా: తన నాలుగు నెలల పసిబిడ్డతో కలిసి షాపింగ్‌కు వెళ్లిన ఓ మహిళపై మరో మహిళ దాడి చేసింది. అకారణంగా ఆమెతో గొడవపడి జుట్టుపట్టికొట్టి కిందపడేసి వెళ్లిపోయింది. అసలు ఆమె ఎవరు? ఎందుకు అలా దాడి చేసింది? అనే వివరాలు మాత్రం తెలియరాలేదు. అయితే, వివక్షతోనే ఆమె ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనను తాము అంత తేలికగా తీసుకోవడం లేదని చెప్పారు. లండన్‌లో ఒంటారియోలో ఓ సూపర్ మార్కెట్ వద్దకు ఓ మహిళ తన నాలుగు నెలల బాబుతో కలిసి వెళ్లింది. ఐదుగంటల ప్రాంతంలో షాపింగ్ తన బుల్లి బాబుకు కబుర్లు చెబుతూ ఆమె షాపింగ్ చేస్తుండగా ఆరెంజ్ కలర్ టీ షర్ట్ తో ఉన్న ఓ మహిళ వారి దగ్గరకు వచ్చింది. కారణంగా లేకుండానే వారిని తిట్టడం మొదలుపెట్టింది. ఆ వెంటనే ఆలస్యం చేయకుండా చేయి కూడా చేసుకుంది. జుట్టుపట్టి లాగి కిందపడేసింది. ఆ తర్వాత ఏదో వార్నింగ్ ఇస్తూ వెళ్లిపోతుండగా ఆ దాడి చేసిన మహిళను బాధితురాలు ఫొటోలు తీసింది. ప్రస్తుతం ఈ ఫొటో ఆధారంగా పోలీసులు దాడికి పాల్పడిన మహిళకోసం వెతుకుతున్నారు. -
కేబీఆర్ పార్క్‌లో మహిళపై దాడి
-
ప్రతాపం చూపిన సికింద్రాబాద్ మహిళలు!
సికింద్రాబాద్: నగరంలోని మహిళలు తమ ప్రతాపం చూపారు. వెంగళరావు నగర్‌లోని కల్లు కాంపౌండ్‌పై దాడి చేశారు. ఈ రోజే ఇక్కడ కల్లు కాంపౌండ్ ప్రారంభించారు. ప్రారంభించిన కొద్దిసేపటికే మహిళలు కాంపౌండ్‌పై దాడి చేశారు. కల్లు సీసాలను ధ్వంసం చేశారు. తమ బస్తీలో కల్లుకాంపౌండ్ వద్దని ఆందోళనకు దిగారు. మళ్లీ కల్లుకాంపౌండ్ తెరిచి తమ జీవితాలతో ఆడుకోవద్దని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భర్తలు, పిల్లలు కల్తీ కల్లుకు బానిసలై జీవితాలను ఛిద్రం చేసుకుంటారని వారు భయాందోళన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌లోని మూడు కల్లు దుకాణాలను మూసివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలిసి పోలీసులు సంఘటనా స్థాలానికి చేరుకున్నారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. ** -
మహిళపై కత్తులతో దుండగుల దాడి, పరిస్థితి విషమం
కరీంనగర్: దుండగుల ఆగడాలు రోజురోజుకీ మితిమీరుతున్నాయి. మహిళలపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ఒకవైపు ప్రభుత్వం హెచ్చరిస్తున్న దాడులు ఆగడం లేదు. మహిళలపై దాడులు ఎక్కడో ఒకచోట నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఒంటిరిగా మహిళలు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లాలోని హుజారాబాద్‌లో జ్యోతి అనే మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆమె తీవ్ర గాయాలపాలైంది. జ్యోతి పరిస్థితి విషమించడంతో ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
టీటీఈపై ప్రయాణికుల దాడి
గాయపడడంతో ఉస్మానియాకు తరలింపు హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఎంఎంటీఎస్‌లో రైలులో ఓ టీటీఈ(ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్)పై ముగ్గురు మహిళలు దాడికి పాల్పడ్డారు. నాంపల్లి జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం... టీటీఈ కౌసల్య సికింద్రాబాద్ నుంచి లింగంపల్లికి వెళ్లే ఎంఎంటీఎస్(47150) ట్రైన్లో బుధవార ం ఉదయం విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కుమారి, పద్మ, రాధ అనే ప్రయాణికులు బేగంపేట్ రైల్వేస్టేషన్ సమీపంలో టికెట్ లేకుండా పట్టుబడ్డారు. దీంతో వారిపై రూ.250 చొప్పున జరి మానా విధించారు. దీంతో వాగ్వాదానికి దిగి టీటీఈపై దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు బేగంపేట్ స్టేషన్లో పద్మ, కుమారీలను అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ కౌసల్యను ఉస్మానియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలిం చారు. టీటీఈపై దాడిని నిరసిస్తూ మజ్దూర్ యూని యన్ నాంపల్లి జీఆర్పి స్టేషన్ వద్ద నిరసన చేపట్టిం ది. టికెట్టు తీసుకోకపోవడం తప్పే. ఫైన్ కట్టలేదని చేతిలోని సెల్‌ఫోన్‌ను లాక్కున్నారు. బోగీల్లోంచి కిందకు ఈడ్చుకు వెళ్లింది, చెంపపై కొట్టింది. టీటీఈల వెంట సాయుధ పోలీసులు... టీటీఈల వెంట ఇక నుంచి సాయుధులైన పోలీసులు పంపేలా రైల్వే అధికారులు నిర్ణయిం చారు. విధులకు అడ్డుపడి దురుసుగా వ్యవహరిస్తే ఆరునెలల జైలు శిక్ష, రూ.వేయి వరకు జరిమానా విధించనునున్నారు. -
ఏటీఎం సెంటర్లో మహిళపై దాడికి పాల్పడ్డ దుండగుడు
బెంగళూరు: నగరంలోని ఏటీఎం సెంటర్లో డబ్బులు డ్రా చేస్తున్న ఓ మహిళ(38)పై గుర్తు తెలియని దుండగుడు దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మహిళ ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునేందుకు మంగళవారం ఉదయం ఏటీఎంకు వెళ్లిన సమయంలో ఈ దారుణమైన సంఘటన సంభవించింది. కార్పోరేషన్ బ్యాంక్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆ మహిళ ఏటీఎంలోకి వెళ్లిన వెంటనే అదే అదునుగా భావించిన ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆమె వెనుక ప్రవేశించి షట్టర్ మూసివేసి దాడికి పాల్పడ్డాడు. అతనితో ఆమె కాసేపు ప్రతిఘటించింది. కాగా, ఆ దుండగుడు ఆమెను విచక్షణరహితంగా గాయపరిచి మహిళ వద్ద ఉన్న బ్యాగుతో ఉడాయించాడు. దాడితో సృహ కోల్పోయిన ఆ మహిళ కాసేపటికి లేచి కేకలు వేయడంతో రోడ్డుపై వెళ్లే వారు ఏటీఏం తలుపులు తెరవడంతో ఈ ఉదంతం బయటపడింది. అతని చేతిలో ఉన్న కత్తితో ఆమెను తీవ్రంగా గాయపరిచిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో స్పష్టంగానే కనబడ్డాయి. ఆ దుండుగుడు దాడి చేయడానికి ముందుగానే సిద్ధమైనట్లు అతని వద్దనున్న మారణాయుధాల్ని బట్టి తెలుస్తోంది. ఈ దారుణమైన సంఘటన చోటు చేసుకోవడానికి ఏటీఎం వద్ద సరైన రక్షణ లేకపోకడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇటువంటి సంఘటనలు ఎన్ని చోటు చేసుకుంటున్నా ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ మహిళ తీవ్రంగా గాయపడటంతో విక్టోరియా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.