విడాకులు తీసుకుని ఒంటరి జీవితం.. అతడితో క్లోజ్‌గా ఉంటూ.. | Murder Attempt On Women At Tamil Nadu | Sakshi
Sakshi News home page

విడాకులు తీసుకుని ఒంటరి జీవితం.. ఆమెపై అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు..

Aug 5 2022 5:16 AM | Updated on Aug 5 2022 5:21 AM

Murder Attempt On Women At Tamil Nadu - Sakshi

భర్తతో విడాకులు తీసుకుని ఒంటరి జీవితం గడుపుతోంది.

తిరువళ్లూరు: ఓ మహిళను గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కత్తితో పొడిచి పరారయ్యారు. ఈ షాకింగ్‌ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. కాంచీపురం జిల్లా శ్రీపెరంబదూరు తాలుకా వలర్‌పురం గ్రామానికి చెందిన కార్తికేయన్‌ (45) దుబాయ్‌లోని ప్రింటింగ్‌ ప్రెస్‌లో తనతో పాటు పని చేసే శ్రీలంకకు చెందిన రోహిణివసంతి(41)ని 2005లో ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 

కొంతకాలం తరువాత తమ సొంత గ్రామానికి వచ్చి జీవనం సాగిస్తున్నారు. అయితే రోహిణి పలువురు పురుషులతో సన్నిహితంగా మెలుగుతుండడంతో పాటు ప్రవర్తనలో మార్పురాకపోవడంతో విడాకులు తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు 2017 నుంచి నెలకు రూ.50 వేలు పిల్లల పోషణ కోసం కార్తికేయన్‌ చెల్లిస్తున్నాడు. కాగా, తిరువళ్లూరులోని అద్దె ఇంట్లో నివాసం ఉంటూ ఆమె టైలరింగ్‌ షాపు నిర్వహిస్తోంది. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో టైలర్‌షాపులోనే ఆమెను ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి పరారయ్యారు. 

ఇన్‌స్పెక్టర్‌ పద్మశ్రీబబ్బి రక్తపుమడుగులో పడి ఉన్న ఆమెను తిరువళ్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి విచారణ చేపట్టారు. విచారణలో ఈమె కమలకన్నన్‌తో సహజీవనం చేస్తూనే, మరో కొంతమందితో సన్నిహితంగా మెలుగుతున్నట్టు తేలింది. అక్రమ సంబంధాలే హత్యాయత్నానికి కారణమై ఉండొచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.   

ఇది కూడా చదవండి: నాలుగేళ్ల క్రితమే భర్త మృతి.. అతడితో పరిచయం కాస్తా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement