చంటిబిడ్డతో షాపింగ్ చేస్తుండగా.. | A Muslim woman and her infant child werent even safe in the supermarket | Sakshi
Sakshi News home page

చంటిబిడ్డతో షాపింగ్ చేస్తుండగా..

Published Thu, Jun 23 2016 8:35 AM | Last Updated on Mon, Sep 4 2017 3:13 AM

చంటిబిడ్డతో షాపింగ్ చేస్తుండగా..

చంటిబిడ్డతో షాపింగ్ చేస్తుండగా..

కెనడా: తన నాలుగు నెలల పసిబిడ్డతో కలిసి షాపింగ్కు వెళ్లిన ఓ మహిళపై మరో మహిళ దాడి చేసింది. అకారణంగా ఆమెతో గొడవపడి జుట్టుపట్టికొట్టి కిందపడేసి వెళ్లిపోయింది. అసలు ఆమె ఎవరు? ఎందుకు అలా దాడి చేసింది? అనే వివరాలు మాత్రం తెలియరాలేదు. అయితే, వివక్షతోనే ఆమె ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనను తాము అంత తేలికగా తీసుకోవడం లేదని చెప్పారు.

లండన్లో ఒంటారియోలో ఓ సూపర్ మార్కెట్ వద్దకు ఓ మహిళ తన నాలుగు నెలల బాబుతో కలిసి వెళ్లింది. ఐదుగంటల ప్రాంతంలో షాపింగ్ తన బుల్లి బాబుకు కబుర్లు చెబుతూ ఆమె షాపింగ్ చేస్తుండగా ఆరెంజ్ కలర్ టీ షర్ట్ తో ఉన్న ఓ మహిళ వారి దగ్గరకు వచ్చింది. కారణంగా లేకుండానే వారిని తిట్టడం మొదలుపెట్టింది. ఆ వెంటనే ఆలస్యం చేయకుండా చేయి కూడా చేసుకుంది. జుట్టుపట్టి లాగి కిందపడేసింది. ఆ తర్వాత ఏదో వార్నింగ్ ఇస్తూ వెళ్లిపోతుండగా ఆ దాడి చేసిన మహిళను బాధితురాలు ఫొటోలు తీసింది. ప్రస్తుతం ఈ ఫొటో ఆధారంగా పోలీసులు దాడికి పాల్పడిన మహిళకోసం వెతుకుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement