
ప్రతీకాత్మక చిత్రం
నందిగామ(షాద్‌నగర్) రంగారెడ్డి : తన ఇంటి ఆవరణలో పెట్టిన సామగ్రిని తీసుకెళ్లమని చెప్పిన ఓ వృద్ధురాలిపై మరో మహిళ దాడి చేసిన సంఘటన మండలంలోని వీర్లపల్లి›లో ఆదివారం చోటుచేసుకుంది. నందిగామ ఏఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి కథనం ప్రకారం.. వీర్లపల్లి గ్రామానికి చెందిన కాట్న పెంటమ్మ ఇంటి ఆవరణలో పొరుగింటి మహిళ రాములమ్మ తన పాత సామగ్రి పెట్టింది.
ఈ విషయమై ఇక్కడి నుంచి సామగ్రిని తీసుకెళ్లమని రాములమ్మకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం మరోసారి పెంటమ్మ సామగ్రి తీసుకెళ్లమని సూచించగా రాములమ్మ వాగ్వాదానికి దిగింది. అంతటితో ఆగక కర్రతో పెంటమ్మ తలపై దాడి చేయగా ఆమెకు తలకు తీవ్రగాయాలయ్యాయి. పెంటమ్మ ఫిర్యాదు మేరకు రాములమ్మపై కేసు నమోదు చేసినట్లు భాస్కర్‌రెడ్డి వివరించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment