నగరంలో దోపిడీ దొంగలు బీభత్సం కొనసాగుతూనే ఉంది. తాజాగా బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద వాకింగ్ చేస్తున్న మహిళపై ఓ దుండగుడు చైన్ స్నాచింగ్కు యత్నించాడు. అయితే ఆ మహిళ... అతడిని ధైర్యంగా ఎదుర్కొంది. ఈ సందర్భంగా ఆమెపై దుండగుడు దాడి చేసి, గాయపరిచాడు. ఈ సంఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది.