న్యూఢిల్లీ: మూతపడిన నేషనల్ స్పాట్ ఎక్సే్ఛంజ్ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఈఎల్) కేసులో ఎంఎంటీసీ స్టాక్ బ్రోకర్ లైసెన్స్‌ను సెబీ రద్దు చేసింది. ఎన్‌ఎస్‌ఈఎల్‌కు సంబంధించి కొన్ని లావాదేవీల్లో చట్టవిరుద్ధమైన పాత్ర ఉండడంతో ఎంఎంటీసీపై ఈ చర్య తీసుకుంది. ఎంఎంటీసీ క్లయింట్లు తమ నిధులను, సెక్యూరిటీలను వెనక్కి తీసుకోవడానికి వీలుగా 15 రోజుల గడువు విధించింది. (ఎంజీ బుల్లి కామెట్ ఈవీస్పెషల్ గేమర్ ఎడిషన్: ధర పెరిగిందా?)
ఒకవేళ క్లయింట్లు తమ నిధులు, సెక్యూరిటీలను 15రోజుల్లోపు తీసుకోకపోతే, క్లయింట్ల సూచన మేరకు ఎంఎంటీసీయే వాటిని మరో బ్రోకర్‌కు తదుపరి 15 రోజుల్లో బదిలీ చేయాలని సెబీ ఆదేశించింది. ఎంఎంటీసీ 2015 నుంచి సెబీ వద్ద కమోడిటీ డెరివేటివ్స్ బ్రోకర్‌గా నమోదై ఉంది. ప్రస్తుతం ఎంసీఎక్స్ మెంబర్‌గా కొనసాగుతోంది. తన అనుమతి లేకుండా ఎన్‌ఎస్‌ఈఎల్ పెయిర్డ్ కాంట్రాక్టుల్లో ఎంఎంటీసీ లావాదేవీలు నిర్వహించినట్టు సెబీ తన ఆదేశాల్లో పేర్కొంది. (కొత్త సేఫ్టీ ఫీచర్లు, షాకింగ్ ధర: 2023 టయోటా వెల్‌ఫైర్ )
Comments
Please login to add a commentAdd a comment