National Spot Exchange Ltd
-
ఎంఎంటీసీకి భారీ షాక్: స్టాక్ బ్రోకర్ లైసెన్స్ రద్దు
న్యూఢిల్లీ: మూతపడిన నేషనల్ స్పాట్ ఎక్సే్ఛంజ్ లిమిటెడ్ (ఎన్ఎస్ఈఎల్) కేసులో ఎంఎంటీసీ స్టాక్ బ్రోకర్ లైసెన్స్‌ను సెబీ రద్దు చేసింది. ఎన్‌ఎస్‌ఈఎల్‌కు సంబంధించి కొన్ని లావాదేవీల్లో చట్టవిరుద్ధమైన పాత్ర ఉండడంతో ఎంఎంటీసీపై ఈ చర్య తీసుకుంది. ఎంఎంటీసీ క్లయింట్లు తమ నిధులను, సెక్యూరిటీలను వెనక్కి తీసుకోవడానికి వీలుగా 15 రోజుల గడువు విధించింది. (ఎంజీ బుల్లి కామెట్ ఈవీస్పెషల్ గేమర్ ఎడిషన్: ధర పెరిగిందా?) ఒకవేళ క్లయింట్లు తమ నిధులు, సెక్యూరిటీలను 15రోజుల్లోపు తీసుకోకపోతే, క్లయింట్ల సూచన మేరకు ఎంఎంటీసీయే వాటిని మరో బ్రోకర్‌కు తదుపరి 15 రోజుల్లో బదిలీ చేయాలని సెబీ ఆదేశించింది. ఎంఎంటీసీ 2015 నుంచి సెబీ వద్ద కమోడిటీ డెరివేటివ్స్ బ్రోకర్‌గా నమోదై ఉంది. ప్రస్తుతం ఎంసీఎక్స్ మెంబర్‌గా కొనసాగుతోంది. తన అనుమతి లేకుండా ఎన్ఎస్ఈఎల్ పెయిర్డ్ కాంట్రాక్టుల్లో ఎంఎంటీసీ లావాదేవీలు నిర్వహించినట్టు సెబీ తన ఆదేశాల్లో పేర్కొంది. (కొత్త సేఫ్టీ ఫీచర్లు, షాకింగ్ ధర: 2023 టయోటా వెల్ఫైర్ ) -
ఎన్ఎస్ఈఎల్ స్కామ్‌లో ఐదుగురిపై చార్జిషీట్
ముంబై: నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ (ఎన్ఎస్ఈఎల్)లో రూ.5,600 కోట్ల చెల్లిం పుల సంక్షోభానికి సంబంధించి అదుపులోకి తీసుకున్న ఐదుగురిపై ముంబై పోలీసులు 9,100 పేజీల చార్జిషీట్‌ను సోవువారం దాఖలు చేశారు. ఎన్ఎస్ఈఎల్ వూజీ సీఈఓ అంజనీ సిన్హా కూడా వీరిలో ఉన్నారు. కేసు దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదనీ, పరిశోధనలో వెల్లడయ్యే అంశాల ప్రకారం వురికొన్ని చార్జిషీట్లు దాఖలు చేస్తావునీ పోలీస్ జారుుంట్ కమిషనర్ హివూంశు రాయ్ తెలిపారు. చార్జిషీట్లు దాఖలైన వారిలో ఎన్ఎస్ఈఎల్ వూజీ వైస్ ప్రెసిడెంట్ (బిజినెస్ డెవలప్మెంట్) అమిత్ ముఖర్జీ, మాజీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ జయ్ బాహుఖుండీ, ఎన్కే ప్రొటీన్స్ లిమిటెడ్ ఎండీ నీలేశ్ పటేల్, లోటస్ రిఫైనరీస్ సీఎండీ అరుణ్ శర్మ ఉన్నారు. ఈ కుంభకోణంలో కీలకపాత్ర పోషించి నట్లు ఆరోపణలున్న ఎన్ఎస్ఈఎల్ ప్రమోటర్, డెరైక్టర్ జిగ్నేశ్ షా, జోసఫ్ వూసే, తదితరుల పేర్లు చార్జిషీట్లో లేవు. తొలి చార్జిషీట్లో పేరు లేనంత వూత్రాన వారికి క్లీన్చిట్ ఇచ్చినట్లు భావించవద్దని రాయ్ వివరణ ఇచ్చారు. జిగ్నేశ్ షా కూడా నిందితుడనీ, స్కామ్ లో ఆయునకు పూర్తి పాత్ర ఉందనీ పేర్కొన్నారు. -
జిగ్నేష్ షాకి ఎఫ్ఎంసీ షోకాజ్
న్యూఢిల్లీ: నేషనల్ స్పాట్ ఎక్స్చేంజీ చెల్లింపుల సంక్షోభం దరిమిలా ప్రమోటింగ్ సంస్థ ఎఫ్టీఐఎల్ వ్యవస్థాపకుడు జిగ్నేష్ షాతో పాటు మరో ముగ్గురు అధికారులకు ఫార్వర్డ్ మార్కెట్స్ కమిషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ వివాదం నేపథ్యంలో మ రో గ్రూప్ సంస్థ ఎంసీఎక్స్ని నిర్వహించేందుకు వారిని సమర్థులుగా ఎందుకు భావించాలో 2 వారాల్లో చెప్పాలంటూ ఆదేశిం చింది. పోలీసుల లుక్ అవుట్ నోటీసుల తరువాత షా కు.. ఇది మరో షాక్. -
ఎన్ఎస్ఈఎల్ ప్రమోటర్లపై ఆర్థిక నేరాల విభాగానికి ఫిర్యాదు
ముంబై: చెల్లింపుల విషయంలో విఫలమైన నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్) ప్రమోటర్లపై ఎన్ఎస్ఈఎల్ ఇన్వెస్టర్ ఫోరమ్ చైర్మన్ శరద్ సరాఫ్ ముంబైకి చెందిన ఆర్థిక నేరాల విభాగానికి(ఈవోడబ్ల్యూ) ఫిర్యాదు చేశారు. 58 మంది ఇన్వెస్టర్లు, 17 మంది బ్రోకర్లు, సభ్యులతో కూడిన ఫోరమ్ ఎన్ఎస్ఈఎల్, ఎక్స్ఛేంజీ ప్రమోటర్ జిగ్నేష్ షా, ఇతర ఎగ్జిక్యూటివ్‌లు అమిత్ ముఖర్జీ, జై భాఖుందీ, ఆడిటర్ ముకేష్ షాలపై ఈవోడబ్ల్యూ పోలీసుల వద్ద కేసును దాఖలు చేసినట్లు తెలిపింది.అంతేకాకుండా మరో 24 మంది చెల్లింపుల్లో విఫలమైన డిఫాల్టర్లు, తదితర క్లయింట్లపై కూడా ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. కాగా, ఎన్ఎస్ఈఎల్ కొత్త మేనేజ్మెంట్ టీమ్ ఇప్పటికే ఎక్స్ఛేంజీ మాజీ సీఈవో అంజనీ సిన్హాపై ఈవోడబ్ల్యూ వద్ద ఫిర్యాదును దాఖలు చేసింది. -
ఫైనాన్షియల్ టెక్ నుంచి మరో ఇద్దరు డెరైక్టర్ల రాజీనామా
న్యూఢిల్లీ: ఫైనాన్షియల్ టెక్నాలజీస్ బోర్డు నుంచి మరో ఇద్దరు డెరైక్టర్లు రాజీనామా చేశారు. దీంతో కంపెనీలో ప్రధాన ప్రమోటర్ జిగ్నేష్ షాతోపాటు మొత్తం ఐదుగురు డెరైక్టర్లు మాత్రమే మిగిలారు. తాజాగా రాజీనామా చేసిన డెరైక్టర్లలో సీఎం మణ్యర్, ఎన్.బాలసుబ్రమణ్యన్ ఉన్నారు. ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ప్రమోట్ చేసిన నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్) కమోడిటీ కాంట్రాక్ట్‌లకు సంబంధించిన చెల్లింపుల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఫైనాన్షియల్ టెక్నాలజీస్ బోర్డులో షాతోపాటు ఇద్దరు హోల్‌టైమ్ డెరైక్టర్లు దేవంగ్ నేరెళ్ల, మంజయ్ షా, మరో ఇద్దరు డెరైక్టర్లు చంద్రకాంత్ కామ్దార్, రవి కె.సేథ్ సభ్యులుగా కొనసాగుతున్నారు. ఈ విషయాన్ని కంపెనీ బీఎస్ఈకి తెలియజేసింది. గత వారం కూడా కంపెనీ నుంచి ఆర్.దేవరాజన్, పీఆర్ బార్పండే డెరైక్టర్ల పదవులకు రాజీనామా చేసిన విషయం విదితమే. వరుసగా రెండో అంచె చెల్లింపుల్లోనూ ఎన్ఎస్ఈఎల్ విఫలమైన నేపథ్యంలో ఫైనాన్షియల్ టెక్నాలజీస్ డెరైక్టర్ల రాజీనామాలకు ప్రాధాన్యత ఏర్పడింది. కాగా, తమ ప్రమోటర్ కంపెనీ ఫైనాన్షియల్ టెక్నాలజీస్ రూ. 177 కోట్లమేర రుణాన్ని అందించినట్లు ఎన్ఎస్ఈఎల్ తెలిపింది. ఈ నిధులను చిన్న ఇన్వెస్టర్లకు చెల్లించాల్సిన బకాయిలకు వినియోగించనున్నట్లు పేర్కొంది. -
మరిన్ని సంస్కరణలే మందు
న్యూఢిల్లీ: రూపాయి విలువ అడ్డూ అదుపూలేకుండా పడిపోయి.. ఇప్పుడు 66 స్థాయి దిగువకు సైతం కుప్పకూలడంతో ప్రభుత్వం దిక్కుతోచని పరిస్థితుల్లో చిక్కుకుంది. ఆర్థిక వ్యవస్థ దీనావస్థపై అన్నివైపుల నుంచి విమర్శలు పోటెత్తడంతో... మరిన్ని సంస్కరణలను ప్రవేశపెట్టడం ఒక్కటే దీనికి పరిష్కారమార్గమని ఆర్థిక మంత్రి చిదంబరం పేర్కొన్నారు. బొగ్గు, ఇనుప ఖనిజం రంగాల్లో నెలకొన్న అనిశ్చితి, స్తబ్దత తొలగితేనే వృద్ధికి ఊతం లభిస్తుందని తేల్చిచెప్పారు. మంగళవారం లోక్‌సభలో దేశ ఆర్థిక పరిస్థితిపై జరిగిన చర్చకు సమాధానంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అనుసరిస్తున్న అధ్వాన, చెత్త విధానాలవల్లే ఆర్థిక వ్యవస్థ మంటగలుస్తోందని, యూపీఏ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దింపేస్తేకానీ పరిస్థితులు మెరుగుపడవంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. కాగా, మందగమనంలోఉన్న ఆర్థిక వ్యవస్థను మళ్లీ 8 శాతం వృద్ధికి మళ్లించాలంటే తయారీ రంగం, ఎగుమతులకు చేయూతవంటి 10 ప్రధాన చర్యలను చిదంబరం ప్రస్తావించారు. ‘మనకు ఇప్పుడు తక్కువ నియంత్రణలు, మరిన్ని సంస్కరణల ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆర్థిక వ్యవస్థను మరింత సరళీకరించి, విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిస్తేనే గడ్డుపరిస్థితుల నుంచి గట్టెక్కగలం’ అని పేర్కొన్నారు. కరెన్సీ మహా పతనంపై... దేశీ కరెన్సీ విలువ ఉండాల్సిన దానికంటే మరీ తక్కువగా(అండర్వేల్యూడ్) ఉందని ఆర్థిక మంత్రి చిదంబరం వ్యాఖ్యానించారు. ‘వాస్తవ విలువకంటే ప్రస్తుతం రూపాయి మరీ ఘోరంగా పతనమైంది. అయితే, ఇన్వెస్టర్లలో సెంటిమెంట్‌ను మెరుగుపరిచేందుకు, అదేవిధంగా రూపాయి బలోపేతానికి సంబంధించి ప్రభుత్వం అవసరమైన చర్యలన్నీ తీసుకుంటుందని హామీఇస్తున్నా. అయితే, కొంత ఓపికతో ముందుకెళ్లాల్సి ఉంటుంది. ముందుగా ఆర్థిక వ్యవస్థ మూలాలను మరింత పటిష్టంచేసేవిధంగా విస్తృతస్థాయిలో చర్యలపై దృష్టిపెడుతున్నాం. తగినస్థాయికి రూపాయి తిరిగికోలుకుంటుందనే విశ్వాసం ఉంది’ అని రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా చిదంబరం వివరణ ఇచ్చారు. అంతకుముందు విలేకరులతో మాట్లాడుతూ... వర్థమాన దేశాలన్నీ ప్రస్తుతం ఇదేవిధమైన కరెన్సీ పతన, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నాయన్నారు. సోమవారం డాలరుతో రూపాయి మారకం విలువ కొత్త చరిత్రాత్మక కనిష్టం వద్ద(66.24)కు జారిపోవడం... సెన్సెక్స్ 600 పాయింట్లు కుప్పకూలిన నేపథ్యంలో చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, విదేశీ నిధుల సమీకరణకు సావరీన్ బాండ్ల జారీ వంటి అంశాలపై అడిగిన ప్రశ్నలకు... అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నామని, సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఉద్దీపనలు కూడా ముంచాయ్... 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడం కోసం అప్పట్లో ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలు కూడా తాజా సమస్యలకు కారణమని చెప్పారు. ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్-మూలధన పెట్టుబడులు మినహా దేశంలోకి వచ్చే, బయటికిపోయే విదేశీ మారకం నిధుల మధ్య వ్యత్యాసం)లు ఎగబాకేందుకు ఆజ్యంపోశాయన్నారు. ఆహార భద్రత చట్టాన్ని, ఇతర సబ్సిడీలన్నింటినీ అమలు చేసిన తర్వాత కూడా ఈ ఏడాది ద్రవ్యలోటును జీడీపీతో పోలిస్తే 4.8 శాతానికి కట్టడి చేయగలమన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ ఏడాది బడ్జెట్లో మొత్తం ఆహార సబ్సిడీ కేటాయింపులు రూ.90 వేల కోట్లు కాగా, ఆహార భద్రత చట్టం అమలుకు రూ.10 వేల కోట్లను వెచ్చించనున్నట్లు వెల్లడించారు. 70 బిలియన్ డాలర్లకు క్యాడ్ కట్టడి... పెట్టుబడులు, తయారీ రంగం పుంజుకుంటే ఆర్థిక వ్యవస్థకు గడ్డుపరిస్థితులు తొలగుతాయని. క్యాడ్కూ కళ్లెం పడుతుందని చిదంబరం వివరించారు. ప్రస్తుత 2013-14 ఏడాదిలో క్యాడ్‌ను జీడీపీతో పోలిస్తే 3.7 శాతానికి(70 బిలియన్ డాలర్లు) కట్టడి చేయగలమన్న విశ్వాసం వ్యక్తం చేశారు. గతేడాది క్యాడ్ చరిత్రాత్మక గరిష్టానికి(4.8%-88.2 బిలియన్ డాలర్లు) ఎగబాకడం తెలిసిందే. ఇక ఆర్బీఐ విషయానికొస్తే.. కేంద్ర బ్యాంకులేవైనా సరే వృద్ధికి, ఉద్యోగకల్పనకు పోత్సాహం ఇచ్చేవిధంగా విధాన నిర్ణయాలను తీసుకోవాలని మరోసారి నొక్కివక్కానించారు. రూ. 1.83 లక్షల కోట్ల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ పెట్టుబడులకు ఊతమిచ్చే దిశగా దాదాపు రూ. 1.83 లక్షల కోట్ల విలువ చేసే ఇన్ఫ్రా ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చిదంబరం తెలిపారు. పెట్టుబడుల క్యాబినెట్ కమిటీ (సీసీఐ) తాజా భేటీలో ఈ మేరకు ఆమోదముద్ర వేసినట్లు వివరించారు. క్లియరెన్స్ లభించిన ప్రాజెక్టుల్లో 18 విద్యుత్ ప్రాజెక్టులు.. అదే సంఖ్యలో రోడ్, రైల్వే, పెట్రోలియం ప్రాజెక్టులు ఉన్నట్లు విలేకరులకు చిదంబరం చెప్పారు. ఒడిశాలో జీఎంఆర్‌కి చెందిన 1,400 మెగావాట్ల కమలాంగా, ల్యాంకో నిర్మిస్తున్న బదాంధ్ పవర్ ప్లాంట్లతో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు బొగ్గు సరఫరాకు అడ్డంకులు తొలగినట్లేనని వివరించారు. వచ్చే నెల 6లోగా ఆయా సంస్థలు కోల్ ఇండియాతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని మంత్రి తెలిపారు. ఇక హైదరాబాద్‌లో ఎల్అండ్టీ మెట్రో రైల్ ప్రాజెక్టు, జార్ఖండ్‌లో ఎస్సార్ పవర్ ప్రాజెక్టు మొదలైన వాటికి కూడా ఆటంకాలు తొలగినట్లేనని ఆయన చెప్పారు. -
స్పాట్ ఎక్స్ఛేంజ్ యాజమాన్యంపై వేటు
ముంబై: సీఈవో అంజనీ సిన్హాసహా మొత్తం యాజమాన్యాన్ని(టాప్ మేనేజ్మెంట్) తొలగిస్తున్నట్లు నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్) మంగళవారం తెలిపింది. తొలి దశ చెల్లింపులలో విఫలంకావడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. కమోడిటీ కాంట్రాక్ట్‌ల సెటిల్మెంట్లకు సంబంధించి తొలి దశలో భాగంగా చెల్లించాల్సిన రూ. 175 కోట్లలో రూ. 92 కోట్లను మాత్రమే సమకూర్చినందున యాజమాన్యంపైవేటు వేసినట్లు ఎన్ఎస్ఈఎల్ బోర్డు వివరించింది. వెంటనే అమల్లోకివచ్చే విధంగా సీఎఫ్‌వో శశిధర్ కోటియాన్తోపాటు మరో ఐదుగురిని తొలగించినట్లు తెలిపింది. అంతేకాకుండా ఎక్స్ఛేంజీ విధులను నిర్వర్తించేందుకు ప్రత్యేక అధికారి(ఓఎస్ఈడీ)గా పీఆర్ రమేష్‌కు ఎంపిక చేసినట్లు వెల్లడించింది. సీఈవో అధికారాలను రమేష్ కలిగి ఉంటారని, బోర్డుకు ప్రత్యక్ష జవాబుదారీగా వ్యవహరిస్తారని తెలిపింది. కాగా, తొలి దశ చెల్లింపుల్లోనే విఫలంకావడంతో ఎక్స్ఛేంజీ విశ్వసనీయతపై అనుమానాలు రేకెత్తుతాయని ఎన్ఎస్ఈఎల్ బోర్డుకి ఫార్వార్డ్ మార్కెట్ కమిషన్(ఎఫ్ఎంసీ) తెలియజేసింది. తొలి దశ చెల్లింపులకు సంబంధించిన 15 మంది సభ్యులలో 9మంది విఫలమైనట్లు(డిఫాల్టర్స్) ఎన్ఎస్ఈఎల్ తెలిపింది. డిఫాల్టర్లలో ఆర్క్ ఇంపోర్ట్స్, లోయిల్ ఓవర్సీస్ ఫుడ్స్, లోటస్ రిఫైనరీస్, ఎన్కే ప్రొటీన్స్, ఎన్సీసీ షుగర్స్, స్పిన్ కాట్ టెక్స్టైల్స్, తవిషీ ఎంటర్ప్రైజెస్, విమలాదేవీ ఆగ్రోటెక్, యథురీ అసోసియేట్స్ ఉన్నాయి. కాగా, కమోడిటీ మార్కెట్ల నియంత్రణ సంస్థ ఎఫ్ఎంసీను ఆర్థిక శాఖ పర్యవేక్షణలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎఫ్ఎంసీ ప్రస్తుతం వినియోగ వ్యవహారాల శాఖ కింద పనిచేస్తోంది. -
స్పాట్ ఎక్స్ఛేంజీ సమస్యలపై ప్రభుత్వ ప్రత్యేక టీమ్ !
న్యూఢిల్లీ: చెల్లింపుల సంక్షోభంలో చిక్కుకున్న నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్) సమస్యలపై దృష్టి సారించేందుకు ప్రత్యేక బృందాన్ని(టీమ్‌ను) ఏర్పాటు చేయాలని ప్రధాని కార్యాలయం భావిస్తోంది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్ మాయారామ్ సారథ్యంలో టీమ్‌ను ఏర్పాటు చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వినియోగ వ్యవహారాలు, కార్పొరేట్ వ్యవహారాల శాఖల కార్యదర్శులతోపాటు, రిజర్వ్ బ్యాంకు, సెబీ, ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ తదితర నియంత్రణ సంస్థల అధికారులకు టీమ్‌లో స్థానం కల్పించనున్నట్లు తెలిపాయి. వివిధ కమోడిటీ కాంట్రాక్ట్‌ల సెటిల్మెంట్కు సంబంధించి రూ. 5,600 కోట్ల చెల్లింపుల విషయంలో ఎన్ఎస్ఈఎల్ విఫలంకాగా, ప్రభుత్వం కల్పించుకుని ట్రేడింగ్‌ను నిలిపివేసిన సంగతి తెలిసిందే. సెటిల్మెంట్ ప్రణాళిక : ఎన్ఎస్ఈఎల్ రూ. 5,600 కోట్ల చెల్లింపులకు సంబంధించిన ప్రణాళికను కమోడిటీ మార్కెట్ల నియంత్రణ సంస్థ ఫార్వార్డ్ మార్కెట్ కమిషన్(ఎఫ్ఎంసీ)కు నివేదించింది. వివిధ కమోడిటీ కాంట్రాక్ట్‌ల సెటిల్మెంట్కు సంబంధించిన చెల్లింపులను ఏడు నెలల్లో చెల్లించేందుకు వీలుగా ఈ ప్రణాళికను రూపొందించింది. అయితే బ్రోకర్లు, ఇన్వెస్టర్ల నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నాక దీనిపై ఒక నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు ఎఫ్ఎంసీ తెలిపింది. మరోవైపు ఇండియన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్(ఐబీఎంఏ)కు అనుమతి లేకుండా ఎలాంటి చెల్లింపులనూ చేపట్టవద్దని ఎన్‌ఎస్‌ఈఎల్‌ను ఆదేశించింది. ఎన్ఎస్ఈఎల్ తాజా ప్రణాళిక ప్రకారం చెల్లింపులు ఈ నెల 16న మొదలై వచ్చే ఏడాది మార్చి 11వరకూ కొనసాగనున్నాయి. అయితే సెటిల్మెంట్లో భాగంగా 13,000 మంది ఇన్వెస్టర్లకు ఐదు నెలల్లో చెల్లింపులను చేపట్టేందుకు సిద్ధమంటూ ఇంతక్రితం ప్రకటించిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం.