ముంబై: నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఈఎల్)లో రూ.5,600 కోట్ల చెల్లిం పుల సంక్షోభానికి సంబంధించి అదుపులోకి తీసుకున్న ఐదుగురిపై ముంబై పోలీసులు 9,100 పేజీల చార్జిషీట్‌ను సోవువారం దాఖలు చేశారు. ఎన్‌ఎస్‌ఈఎల్ వూజీ సీఈఓ అంజనీ సిన్హా కూడా వీరిలో ఉన్నారు. కేసు దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదనీ, పరిశోధనలో వెల్లడయ్యే అంశాల ప్రకారం వురికొన్ని చార్జిషీట్లు దాఖలు చేస్తావునీ పోలీస్ జారుుంట్ కమిషనర్ హివూంశు రాయ్ తెలిపారు.
చార్జిషీట్లు దాఖలైన వారిలో ఎన్‌ఎస్‌ఈఎల్ వూజీ వైస్ ప్రెసిడెంట్ (బిజినెస్ డెవలప్‌మెంట్) అమిత్ ముఖర్జీ, మాజీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ జయ్ బాహుఖుండీ, ఎన్‌కే ప్రొటీన్స్ లిమిటెడ్ ఎండీ నీలేశ్ పటేల్, లోటస్ రిఫైనరీస్ సీఎండీ అరుణ్ శర్మ ఉన్నారు. ఈ కుంభకోణంలో కీలకపాత్ర పోషించి నట్లు ఆరోపణలున్న ఎన్‌ఎస్‌ఈఎల్ ప్రమోటర్, డెరైక్టర్ జిగ్నేశ్ షా, జోసఫ్ వూసే, తదితరుల పేర్లు చార్జిషీట్లో లేవు. తొలి చార్జిషీట్లో పేరు లేనంత వూత్రాన వారికి క్లీన్‌చిట్ ఇచ్చినట్లు భావించవద్దని రాయ్ వివరణ ఇచ్చారు. జిగ్నేశ్ షా కూడా నిందితుడనీ, స్కామ్ లో ఆయునకు పూర్తి పాత్ర ఉందనీ పేర్కొన్నారు.