Anjani Sinha
-
ఎన్ఎస్ఈఎల్ స్కామ్‌లో ఐదుగురిపై చార్జిషీట్
ముంబై: నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ (ఎన్ఎస్ఈఎల్)లో రూ.5,600 కోట్ల చెల్లిం పుల సంక్షోభానికి సంబంధించి అదుపులోకి తీసుకున్న ఐదుగురిపై ముంబై పోలీసులు 9,100 పేజీల చార్జిషీట్‌ను సోవువారం దాఖలు చేశారు. ఎన్ఎస్ఈఎల్ వూజీ సీఈఓ అంజనీ సిన్హా కూడా వీరిలో ఉన్నారు. కేసు దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదనీ, పరిశోధనలో వెల్లడయ్యే అంశాల ప్రకారం వురికొన్ని చార్జిషీట్లు దాఖలు చేస్తావునీ పోలీస్ జారుుంట్ కమిషనర్ హివూంశు రాయ్ తెలిపారు. చార్జిషీట్లు దాఖలైన వారిలో ఎన్ఎస్ఈఎల్ వూజీ వైస్ ప్రెసిడెంట్ (బిజినెస్ డెవలప్మెంట్) అమిత్ ముఖర్జీ, మాజీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ జయ్ బాహుఖుండీ, ఎన్కే ప్రొటీన్స్ లిమిటెడ్ ఎండీ నీలేశ్ పటేల్, లోటస్ రిఫైనరీస్ సీఎండీ అరుణ్ శర్మ ఉన్నారు. ఈ కుంభకోణంలో కీలకపాత్ర పోషించి నట్లు ఆరోపణలున్న ఎన్ఎస్ఈఎల్ ప్రమోటర్, డెరైక్టర్ జిగ్నేశ్ షా, జోసఫ్ వూసే, తదితరుల పేర్లు చార్జిషీట్లో లేవు. తొలి చార్జిషీట్లో పేరు లేనంత వూత్రాన వారికి క్లీన్చిట్ ఇచ్చినట్లు భావించవద్దని రాయ్ వివరణ ఇచ్చారు. జిగ్నేశ్ షా కూడా నిందితుడనీ, స్కామ్ లో ఆయునకు పూర్తి పాత్ర ఉందనీ పేర్కొన్నారు. -
ఎన్ఎస్ఈఎల్ స్కామ్.. 25 స్థిరాస్తుల అటాచ్మెంట్
ముంబై/న్యూఢిల్లీ: నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ స్కామ్‌కు సంబంధించి ముంబై పోలీసులు కొన్ని రుణగ్రహీత కంపెనీల స్థిరాస్తులను అటాచ్ చేయడం ప్రారంభించారు. ముంబై పోలీసులు గురువారం 25 స్థిరాస్తులను అటాచ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి దాదాపు వంద స్థిరాస్తులను షార్ట్‌లిస్ట్ చేశామని ముంబై పోలీస్‌కు చెందిన ఆర్థిక నేరాల విభాగం ఉన్నతాధికారొకరు చెప్పారు. రూ.5,600 కోట్లను రికవరీ చేయడానికి ఈ వంద ఆస్తులు సరిపోతాయని అయన చెప్పారు. కాగా నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్(ఎన్ఎస్ఈఎల్), ఈ ఎక్స్ఛేంజ్ మాతృ కంపెనీ ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీల్లో డెరైక్టర్ల స్థాయిలో నిబంధనల ఉల్లంఘన జరిగిందా అన్న విషయమై కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. ఈ రెండు కంపెనీలతో పాటుగా ఎంసీఎక్స్ కంపెనీ రికార్డుల తనిఖీ నివేదిక కూడా త్వరలో ఈ మంత్రిత్వ శాఖకు అందనున్నది. ఈ కంపెనీల డెరైక్టర్ల బోర్డ్ నిబంధనల మేరకే వ్యవహరించిందా, లేదా నిబంధనలను ఉల్లంఘించిందా అన్న అంశాన్ని పరిశీలిస్తామని ఈ మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఎన్ఎస్ఈఎల్ రూ. 5,600 కోట్ల చెల్లింపుల సంక్షోభంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. -
కుంభకోణానికి కారణం నువ్వే.. కాదు నువ్వే...
ముంబై: చెల్లింపుల సంక్షోభంలో చిక్కుకున్న ఎన్ఎస్ఈఎల్ మాజీ సీఈవో అంజనీ సిన్హా, సంస్థ ప్రమోటర్ జిగ్నేష్ షా ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగారు. కుంభకోణానికి కారణం నువ్వంటే.. నువ్వంటూ విమర్శలు గుప్పించుకున్నారు. ముంబై పోలీసుశాఖలోని ఆర్థిక నేరాల వింగ్ (ఈవోడబ్ల్యూ) సిన్హా సమక్షంలో జిగ్నేష్ షాని విచారణ చేస్తుండగా ఇది జరిగింది. విచారణ సమయంలో.. సంక్షోభానికి పూర్తి బాధ్యత షా, ఇతర బోర్డు సభ్యులదేనని, వారు ఇచ్చిన ఆదేశాలు మాత్రమే తాను పాటించానని సిన్హా పేర్కొన్నారు. కానీ, దీనికి బాధ్యుడు సిన్హానేనని షా ఆరోపించారు. షాని ఇప్పటికే రెండు సార్లు ప్రశ్నించిన పోలీసులు అవసరమైతే మళ్లీ పిలిపిస్తామన్నారు. మరోవైపు, కుంభకోణం ఆరోపణలపై అరెస్టయిన ఎన్ఎస్ఈఎల్ మాజీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ ముఖర్జీకి సంబంధించి ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. సంస్థ వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో... బ్యాంకులు బ్లాక్‌లిస్టులో ఉంచిన సంస్థలకు ముఖర్జీ ఎన్ఎస్ఈఎల్ నుంచి రుణాలిప్పించేవారని విచారణలో వెల్లడైంది. ఇందుకోసం ముందుగా బ్యాంకుల వద్దకి వెళ్లి అవి బ్లాక్‌లిస్టు చేసిన సంస్థల జాబితాను ఆయన తీసుకునేవారు. ఆ తర్వాత ఎన్ఎస్ఈఎల్ నుంచి రుణాలిప్పిస్తానంటూ ఆయా సంస్థలను సంప్రతించేవారని పోలీసు అధికారులు తెలిపారు. జూలైలో వెలుగుచూసిన రూ. 5,600 కోట్ల కుంభకోణానికి సంబంధించి పోలీసులు ఇప్పటిదాకా నలుగురిని అరెస్టు చేశారు.