ఎన్‌ఎస్‌ఈఎల్ స్కామ్.. 25 స్థిరాస్తుల అటాచ్‌మెంట్ | EOW moves to seize properties of NSEL borrowers | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎస్‌ఈఎల్ స్కామ్.. 25 స్థిరాస్తుల అటాచ్‌మెంట్

Published Fri, Nov 8 2013 1:49 AM | Last Updated on Sat, Sep 2 2017 12:23 AM

EOW moves to seize properties of NSEL borrowers

ముంబై/న్యూఢిల్లీ: నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్  స్కామ్‌కు సంబంధించి ముంబై పోలీసులు కొన్ని  రుణగ్రహీత కంపెనీల స్థిరాస్తులను అటాచ్ చేయడం ప్రారంభించారు. ముంబై పోలీసులు గురువారం 25 స్థిరాస్తులను అటాచ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి దాదాపు వంద స్థిరాస్తులను షార్ట్‌లిస్ట్ చేశామని  ముంబై పోలీస్‌కు చెందిన ఆర్థిక నేరాల విభాగం ఉన్నతాధికారొకరు చెప్పారు. రూ.5,600 కోట్లను రికవరీ చేయడానికి ఈ వంద ఆస్తులు సరిపోతాయని అయన చెప్పారు.
 
 కాగా నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్(ఎన్‌ఎస్‌ఈఎల్), ఈ ఎక్స్ఛేంజ్ మాతృ కంపెనీ ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీల్లో డెరైక్టర్ల స్థాయిలో నిబంధనల ఉల్లంఘన జరిగిందా అన్న విషయమై కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. ఈ రెండు కంపెనీలతో పాటుగా ఎంసీఎక్స్ కంపెనీ రికార్డుల తనిఖీ నివేదిక కూడా త్వరలో ఈ మంత్రిత్వ శాఖకు అందనున్నది. ఈ కంపెనీల డెరైక్టర్ల బోర్డ్ నిబంధనల మేరకే వ్యవహరించిందా, లేదా నిబంధనలను ఉల్లంఘించిందా అన్న అంశాన్ని పరిశీలిస్తామని ఈ మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఎన్‌ఎస్‌ఈఎల్ రూ. 5,600 కోట్ల చెల్లింపుల సంక్షోభంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement