license suspend
-
ఎంఎంటీసీకి భారీ షాక్: స్టాక్ బ్రోకర్ లైసెన్స్ రద్దు
న్యూఢిల్లీ: మూతపడిన నేషనల్ స్పాట్ ఎక్సే్ఛంజ్ లిమిటెడ్ (ఎన్ఎస్ఈఎల్) కేసులో ఎంఎంటీసీ స్టాక్ బ్రోకర్ లైసెన్స్‌ను సెబీ రద్దు చేసింది. ఎన్‌ఎస్‌ఈఎల్‌కు సంబంధించి కొన్ని లావాదేవీల్లో చట్టవిరుద్ధమైన పాత్ర ఉండడంతో ఎంఎంటీసీపై ఈ చర్య తీసుకుంది. ఎంఎంటీసీ క్లయింట్లు తమ నిధులను, సెక్యూరిటీలను వెనక్కి తీసుకోవడానికి వీలుగా 15 రోజుల గడువు విధించింది. (ఎంజీ బుల్లి కామెట్ ఈవీస్పెషల్ గేమర్ ఎడిషన్: ధర పెరిగిందా?) ఒకవేళ క్లయింట్లు తమ నిధులు, సెక్యూరిటీలను 15రోజుల్లోపు తీసుకోకపోతే, క్లయింట్ల సూచన మేరకు ఎంఎంటీసీయే వాటిని మరో బ్రోకర్‌కు తదుపరి 15 రోజుల్లో బదిలీ చేయాలని సెబీ ఆదేశించింది. ఎంఎంటీసీ 2015 నుంచి సెబీ వద్ద కమోడిటీ డెరివేటివ్స్ బ్రోకర్‌గా నమోదై ఉంది. ప్రస్తుతం ఎంసీఎక్స్ మెంబర్‌గా కొనసాగుతోంది. తన అనుమతి లేకుండా ఎన్ఎస్ఈఎల్ పెయిర్డ్ కాంట్రాక్టుల్లో ఎంఎంటీసీ లావాదేవీలు నిర్వహించినట్టు సెబీ తన ఆదేశాల్లో పేర్కొంది. (కొత్త సేఫ్టీ ఫీచర్లు, షాకింగ్ ధర: 2023 టయోటా వెల్ఫైర్ ) -
బ్రిక్వర్క్స్పై సెబీ కొరడా
న్యూఢిల్లీ: పదే పదే నిబంధనలను ఉల్లంఘిస్తోందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ (సీఆర్ఏ) బ్రిక్‌వర్క్ రేటింగ్స్ ఇండియాపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొరడా ఝుళిపించింది. సంస్థ లైసెన్సును రద్దు చేసింది. ఆరు నెలల్లోగా కార్యకలాపాలాన్నీ నిలిపివేయాలని ఆదేశించింది. కొత్తగా క్లయింట్లను తీసుకోరాదంటూ నిషేధం విధించింది. ఒక క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీపై సెబీ ఇంత తీవ్ర చర్యలు తీసుకోవడం బహుశా ఇదే తొలిసారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. రేటింగ్స్ ఇచ్చే క్రమంలో నిర్దేశిత ప్రక్రియలు పాటించడంలోనూ, మదింపు విషయంలో సరిగ్గా వ్యవహరించడంలోనూ బ్రిక్‌వర్క్ విఫలమైందని సెబీ తన ఆదేశాల్లో పేర్కొంది. అంతే కాకుండా కంపెనీలకు తాను ఇచ్చిన రేటింగ్స్‌ను సమర్ధించుకునేందుకు అవసరమైన రికార్డులను భద్రపర్చుకోవడంలోనూ సంస్థ విఫలమైందని వ్యాఖ్యానించింది. ‘ఒక సీఆర్ఏగా బ్రిక్‌వర్క్ తన విధులను నిర్వర్తించడానికి సంబంధించి నైపుణ్యాలను ఉపయోగించుకోవడంలోనూ, జాగ్రత్తలు తీసుకోవడంలోను విఫలమైంది. ఇన్వెస్టర్లకు భద్రత కల్పించడంతో పాటు క్రమబద్ధంగా సెక్యూరిటీల మార్కెట్లను అభివృద్ధి చేయాలన్న నిబంధనల లక్ష్యాలకు తూట్లు పొడించింది‘ అని సెబీ ఆక్షేపించింది. అనేక దఫాలుగా తనిఖీలు చేసి, దిద్దుబాటు చర్యలను సూచిస్తూ, జరిమానాలు విధిస్తూ ఉన్నప్పటికీ బ్రిక్‌వర్క్ తన వైఖరిని ఏమాత్రం మార్చుకోలేదని పేర్కొంది. ‘ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్ వ్యవస్థను కాపాడేందుకు నియంత్రణ సంస్థపరంగా కఠినమైన చర్యలు అవసరమని భావిస్తున్నాను‘ అని ఉత్తర్వుల్లో సెబీ హోల్‌టైమ్ సభ్యుడు అశ్వని భాటియా పేర్కొన్నారు. పదే పదే ఉల్లంఘనలు .. 2014 ఏప్రిల్ నుంచి 2015 సెప్టెంబర్, 2017 ఏప్రిల్–2018 సెప్టెంబర్ మధ్య బ్రిక్వర్క్లో సెబీ తనిఖీలు నిర్వహించింది. ఆయా సందర్భాల్లో పలు ఉల్లంఘనలు ఉన్నట్లు గుర్తించింది. వాటిపై విడిగా విచారణ జరిపింది. ఆ తర్వాత 2020 జనవరిలో ఆర్బీఐతో కలిసి 2018 అక్టోబర్–2019 నవంబర్ మధ్యకాలానికి సంబంధించి బ్రిక్‌వర్క్ రికార్డులను తనిఖీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా ఆర్బీఐతో కలిసి 2019 డిసెంబర్–2022 జనవరి మధ్య కాలానికి సంబంధించిన రికార్డులు, పత్రాలను తనిఖీ చేసింది. వీటన్నింటిలోనూ దాదాపు ఒకే తరహా ఉల్లంఘనలు బైటపడ్డాయి. -
కార్వీ కేసులో బ్యాంకులకు చుక్కెదురు
న్యూఢిల్లీ: క్లయింట్ల షేర్లు సొంతానికి వాడుకుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్) వ్యవహారంలో సెక్యూరిటీస్ అపీలేట్ ట్రిబ్యునల్‌లో (శాట్) బ్యాంకులకు చుక్కెదురైంది. తనఖా పెట్టిన షేర్లను క్లయింట్ల ఖాతాల్లోకి మళ్లించకుండా తక్షణం ఆదేశాలివ్వాలన్న బ్యాంకుల అభ్యర్థనను శాట్ తోసిపుచ్చింది. దీనిపై డిసెంబర్ 6లోగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీనే ఆశ్రయించాలని ఆదేశించింది. అలాగే ఆయా బ్యాంకుల వాదనలు విని, డిసెంబర్ 12లోగా తగు ఆదేశాలివ్వాలని సెబీకి సూచించింది. దీంతోపాటు, కార్వీ ట్రేడింగ్ లైసెన్సును రద్దు చేసిన అంశానికి సంబంధించి డిసెంబర్ 6లోగా తగు నిర్ణయం తీసుకోవాలని నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ (ఎన్ఎస్ఈ)ని ఆదేశించింది. కాగా, కార్వీ తనఖా పెట్టిన షేర్లపై రుణదాతలు మొత్తం రూ.1,400 కోట్ల మేర రుణాలిచ్చినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. సుమారు 95,000 క్లయింట్లకు చెందిన దాదాపు రూ. 2,800 కోట్ల విలువ చేసే షేర్లను తనఖా పెట్టి కార్వీ పెద్దమొత్తంలో రుణాలు తీసుకుందన్న ఆరోపణలు రావటం తెలిసిందే. ఈ షేర్లను ఆయా క్లయింట్ల ఖాతాల్లోకి బదలాయించాలన్న సెబీ ఆదేశాలను ఎన్ఎస్డీఎల్ అమలు చేస్తోంది. సుమారు 83వేల మంది క్లయింట్లకు ఇప్పటికే షేర్ల బదిలీ జరిగింది. అయితే, కార్వీ తనఖా ఉంచిన షేర్లను క్లయింట్ల ఖాతాల్లోకి బదిలీ చేయరాదని, వాటిని ఎస్క్రో ఖాతాలోకి మళ్లించాలని కోరుతూ బజాజ్ ఫైనాన్స్ వంటి ఆర్థిక సంస్థలు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు.. ఐసీఐసీఐ బ్యాంక్ శాట్‌ను ఆశ్రయించాయి. దీనిపై మంగళవారం శాట్ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. -
ఎఫ్ క్లబ్ లైసెన్స్ రద్దు, 14 పబ్‌లకు వార్నింగ్
హైదరాబాద్ : డ్రగ్స్ మాఫియా కేసులో సిట్ దూకుడు పెంచింది. నిబంధనలు అతిక్రమించిన ‘ఎఫ్’ క్లబ్ లైసెన్స్‌ను సిట్ రద్దు చేసింది. అంతేకాకుండా మరో 14 పబ్‌లు, బార్లకు వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే డ్రగ్స్ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు మరోవైపు నోటీసులు జారీ చేసినవారిని విచారణ చేస్తున్నారు. ఇప్పటివరకూ విచారణ ఎదుర్కొన్నవారు వెల్లడించిన ప్రకారం...పబ్బుల్లోనే డ్రగ్స్ కల్చర్ నడుస్తున్నట్లు వెల్లడించడంతో సిట్...పబ్బులపై దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగా నగరంలోని 17 పబ్బుల నిర్వాహకులను ఇవాళ (శనివారం) విచారణకు పిలిచారు. విచారణలో భాగంగా డ్రగ్స్ సరఫరా చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే డ్రగ్స్ కేసులో మరో ఇద్దర్ని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన మహ్మద్ ఉస్మాన్, అర్నవ్ మండల్ నుంచి 20 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.