
కేరళలో ఘోరం.. కేన్సర్ రోగిపై లైంగిక దాడి
కేరళలో ఘోరం జరిగింది. 90 ఏళ్ల వయసున్న కేన్సర్ రోగిపై ఆమె ఇంటి పక్కన ఉండే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన కొల్లాం జిల్లాలోని కడక్కల్‌లో జరిగింది. తన ఇంటి ఆనుపానుల గురించి అతడికి బాగా తెలుసని బాధితురాలు తెలిపారు. వెనక తలుపు లోంచి అతడు వచ్చాడని, ఇల్లు బాగా తెలిస్తేనే ఎవరైనా అలా చేయగలరని ఆమె అన్నారు. తనను ఏమీ చేయొద్దని అతడిని వేడుకున్నా వినిపించుకోలేదని, పోలీసులు వెంటనే అతడిని అరెస్టు చేయాలని చెప్పారు.
ఈ ఘోరం ఐదు రోజుల క్రితమే జరిగినా, బుధవారమే వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై ఐపీసీ 377 డి, 354 సెక్షన్ల కింద కేసు నమోదైంది. బాధితురాలి వాంగ్మూలం తీసుకున్నామని, ఇప్పటికే ఎఫ్ఐఆర్ దాఖలుచేశామని కొల్లాం రూరల్ ఎస్పీ అజితా బేగం తెలిపారు. ఆమె బంధువులను కూడా విచారించి వివరాలు తెలుసుకుంటామన్నారు.