
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేశ్ బాబు తన చిన్నారి అభిమాని ఆకాంక్షను నెరవేర్చారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న పర్వీన్ అనే చిన్నారిని కలిసి కాసేపు ఆప్యాయంగా మాట్లాడారు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పర్వీన్ అనే చిన్నారి క్యాన్సర్‌తో బాధపడుతోంది. మహేశ్ బాబును అమితంగా ఇష్టపడే ఆమె.. తన ఫేవరేట్ హీరోను చూడాలని ఆరాటపడింది. ఈ విషయం తెలుసుకున్న మహేశ్.. ఆమెను కలిసి పరామర్శించారు.
పర్వీన్‌తో కాసేపు గడిపిన మహేశ్.. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక తన అభిమాన నటుడు తన కోసం రావడంతో ఆ చిన్నారి ఆనందంతో పరవశించిపోయింది. ప్రస్తుతం మహేశ్ బాబు ఆ చిన్నారితో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సూపర్ స్టార్ మంచి మనసుకు అందరూ ఫిదా అవుతున్నారు.
ప్రస్తుతం తన 25వ సినిమాగా తెరకెక్కుతున్న మహర్షి సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు మహేష్. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్‌రాజు, అశ్వనీదత్, పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తుండగా.. పూజా హేగ్డే హీరోయిన్‌గా అలరించనుంది.
Comments
Please login to add a commentAdd a comment