
గతంలో మహేష్ బాబు పెద్దగా అభిమానులతో కలిసేవారు కాదు. తన సినిమా వేడుకల్లో తప్ప ఇతర ప్రైవేట్ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించేవారు కాదు. కానీ ఇటీవల మహేష్ తీరు మారుతోంది. సినిమా ప్రమోషన్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రెగ్యులర్‌గా మీడియాను కలుస్తూ, సోషల్ మీడియలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు మరింతగా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా ఓ మహిళా అభిమానికి సర్‌ప్రైజ్ ఇచ్చాడు మహేష్. సురేఖ, సూపర్ స్టార్ మహేష్ బాబుకు వీరాభిమాని. ఈ విషయం తెలుసుకున్న మహేష్, నమత్రలు ఆమె పెళ్లి రోజున ఓ గ్రీటింగ్ కార్డును పంపించారు. మహేష్, నమ్రతలు స్వయంగా సంతకం చేసిన ఆ గ్రీటింగ్ కార్డును సురేఖ కుటుంబ సభ్యులు పెళ్లి వేడుక జరుగుతుండగా ఆమె చేతికందించారు. తన అభిమాన నటుడి నుంచి శుభాకాంక్షలు తెలుపుతూ కార్డ్ రావటంతో సురేఖ తెగ సంబరపడిపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో వైరల్ గా మారాయి.
భరత్ అనే నేను సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మహేష్ త‍్వరలోనే తన 25వ సినిమాను ప్రారంభించనున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనీదత్‌ను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment