కేన్సర్ రోగితో రెహమాన్ పుట్టినరోజు వేడుకలు | reham celebrates birthday with ailing fan | Sakshi
Sakshi News home page

కేన్సర్ రోగితో రెహమాన్ పుట్టినరోజు వేడుకలు

Published Thu, Jan 8 2015 4:21 PM | Last Updated on Sat, Sep 2 2017 7:24 PM

కేన్సర్ రోగితో రెహమాన్ పుట్టినరోజు వేడుకలు

కేన్సర్ రోగితో రెహమాన్ పుట్టినరోజు వేడుకలు

చెన్నై: మ్యూజిక్ మాంత్రికుడు, ఆస్కార్ విజేత ఎ.ఆర్.రెహమాన్ తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు. మంగళవారం 48వ ఏట అడుగుపెట్టిన ఆయన.. చెన్నైలో కేన్సర్ తో బాధపడుతున్న ఓ అభిమానిని పరామర్శించారు. పుట్టినరోజున తన కుటుంబంతో కాసేపు గడిపిన రెహమాన్.. కేన్సర్ రోగిని పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం ఫేస్ బుక్ లో  అభిమానులతో కాసేపు చాట్ చేశారు. 'ఆయన తన పుట్టినరోజును విలాసవంతంగా జరుపుకోవడానికి ఏమాత్రం ఇష్టపడరు. తల్లి ఆశీర్వాదంతో ఆ  రోజును  ప్రారంభించిన రెహమాన్.. అనంతరం చెన్నై లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ కు  వెళ్లి అక్కడ కేన్సర్ తో బాధపడుతున్న ఆయన అభిమానిని పరామర్శించారు.' అని రెహమాన్ సన్నిహితులు వెల్లడించారు.

పుట్టినరోజున కూడా పని చేయడానికి ఆయన ఇష్టపడతారని, ఆ రోజు కూడా స్టూడియోలో కాసేపు గడిపారని తెలిపారు. అనంతరం తన ఫేస్ బుక్ అభిమానులతో చాటింగ్ చేసినట్టు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement