క్యాన్సర్‌తో బాధపడుతున్న హీరోయిన్ సొనాలీ బింద్రే ప్రస్తుతం న్యూయార్క్‌లో చికిత్స పొందుతోన్న విషయం తెలిసిందే. చికిత్సలో భాగంగా జుట్టు కత్తిరించుకున్న సొనాలీ భావోద్వేగానికి లోనయ్యారు. తన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సొనాలి.. కష్ట సమయంలో తోడుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సుదీర్ఘమైన పోస్ట్ చేశారు.
‘నా అభిమాన రచయిత్రి ఇసాబెల్ అలెండే మాటలు ఎప్పుడూ నాకు గుర్తుంటాయి. కష్టం వచ్చినపుడే మనలో దాగున్న ధైర్య సాహసాలు వెలుగులోకి వస్తాయి. విషాదకరమైన సమయాల్లోనే కొన్ని అద్భుతాలు చోటు చేసుకుంటాయి. నాపై ఇంతగా ప్రేమాభిమానాలు కురిపిస్తున్న అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా తమ స్ఫూర్తివంతమైన కథలతో నాలో ధైర్యం నింపుతున్న వారికి రుణపడి ఉంటాను. క్యాన్సర్‌ను జయించిన మీ వంటి వారి గురించి తెలుసుకున్నపుడు నేను ఒంటరిని కాననే భావన నాలో కొత్త ఆశల్ని చిగురింపజేస్తుంది. ప్రస్తుతం నా జీవితంలో ప్రతిరోజూ ఒక సవాలుతో కూడుకున్నదే. సూర్యోదయం కోసం సానుకూల దృక్పథంతో ఎదురుచూస్తున్నానంటూ’ ఆమె చేసిన పోస్ట్ చేసిన సందేశం అభిమానుల హృదయాలను గెలుచుకుంటోంది.
ఆమె ఓ స్ఫూర్తి ప్రధాత..
ఇసాబెల్ అలెండే చిలీకి చెందిన ప్రఖ్యాత రచయిత్రి. పెరూలోని లీమాలో జన్మించిన ఆమె రెండేళ్ల వయసులో తండ్రి వృత్తి రీత్యా చిలీకి వచ్చారు. ఆ తర్వాతి కాలంలో ఇసాబెల్ తండ్రి సాల్వెడార్ అలండే 1970లో చిలీ దేశానికి తొలి సామ్యవాద అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇసాబెల్ జర్నలిస్టుగా తన కెరీర్‌ను ఆరంభించారు. 1973లో మిలటరీ కుట్ర కారణంగా ఇసాబెల్ తండ్రి సాల్వెడార్ ఆత్మహత్య చేసుకున్నారు.
జీవితంలో ఎన్నో కష్టానష్టాలను అనుభవించిన అలండే వాటికి అక్షరరూపం ఇచ్చారు. అవే పలువురికి స్పూర్తిగా నిలిచాయి. ఆమె చెప్పిన నాలుగు మాటలను తలుచుకున్న మన బాలీవుడ్ నటి సోనాలీ బింద్రే మనోధైర్యంతో క్యాన్సర్‌పై పోరాడుతున్నారు. ఇసాబెల్ రచనల్లో ది హౌజ్ ఆఫ్ స్పిరిట్స్, సిటీ ఆఫ్ బీస్ట్స్‌లు ప్రముఖమైనవి. అమెరికా అత్యున్నత పురస్కారం ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌ను కూడా ఇసాబెల్ అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment