‘తనకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు’ | Sonali Bendre Post Reveals How She Told The Bad News To Her Son | Sakshi
Sakshi News home page

తల్లిలా నన్ను లాలిస్తున్నాడు: సొనాలి

Published Thu, Jul 19 2018 4:54 PM | Last Updated on Thu, Jul 19 2018 5:18 PM

Sonali Bendre Post Reveals How She Told The Bad News To Her Son - Sakshi

ప్రముఖ నటి సొనాలి బింద్రే క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్నారు. తన ఆరోగ్యానికి సంబంధించిన ప్రతీ విషయాన్ని ఎప్పటికపుడు సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా.. కుమారుడు రణ్‌వీర్‌తో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన సొనాలి... తాను క్యాన్సర్‌ బారిన పడిన విషయాన్ని అతడితో ఎలా పంచుకున్నది చెబుతూ రాసిన లేఖ నెటిజన్ల హృదయాల్ని కదిలిస్తోంది.

తను నా తల్లిగా మారాడు..
‘పన్నెండేళ్ల క్రితం జన్మించిన రణ్‌వీర్.. నా హృదయాన్ని పూర్తిగా ఆక్రమించేశాడు. అప్పటి నుంచి తన సంతోషం కోసమే అనుక్షణం తాపత్రయపడ్డాను. క్యాన్సర్‌ మహమ్మారి నాలో ప్రవేశించిన విషయం తెలియగానే.. ఈ విషయాన్ని తనకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. నాకు సంబంధించిన ప్రతీ విషయాన్ని వాడితో షేర్‌ చేసుకోవడం అలవాటు. కానీ ఈ విషయాన్ని దాచి వాడిని బాధను మరింతగా పెంచడం సరైంది అనిపించలేదు. అందుకే ధైర్యం చేసి ఈ చేదు నిజాన్ని చెప్పేశాను. కానీ నేను ఊహించిన దానికి భిన్నంగా రణ్‌వీర్‌ ఎంతో పరిపక్వంగా ఆలోచించాడు. చెప్పాలంటే తనే నాకు ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు. ఒక్కోసారి తనే తల్లిలా నన్ను లాలిస్తున్నాడు. ట్రీట్‌మెంట్‌కు సంబంధించిన అపాయింట్‌మెంట్ల గురించి గుర్తు చేస్తున్నాడు. మన ఆరోగ్యానికి సంబంధించిన విషయాల గురించి పిల్లలతో తప్పకుండా పంచుకోవాలి. అపుడే జీవితంలో సంభవించే కఠిన పరిస్థితులను ఎదుర్కోవడానికి వారు సిద్ధంగా ఉంటారు. ప్రస్తుతం నా కొడుకు నాతోనే ఉన్నాడు. నాకు ఇక ఏ బెంగా లేదంటూ’ సొనాలి బింద్రే భావోద్వేగానికి గురయ్యారు.

From the moment he was born 12 years, 11 months and 8 days ago, my amazing @rockbehl took ownership of my heart. From then on, his happiness and wellbeing have been the centre of anything @goldiebehl and I ever did. And so, when the Big C reared its ugly head, our biggest dilemma was what and how we were going to tell him. As much as we wanted to protect him, we knew it was important to tell him the full facts. We’ve always been open and honest with him and this time it wasn’t going to be different. He took the news so maturely… and instantly became a source of strength and positivity for me. In some situations now, he even reverses roles and takes on being the parent, reminding me of things I need to do! I believe that it’s imperative to keep kids involved in a situation like this. They are a lot more resilient than we give them credit for. It’s important to spend time with them and include them, rather than make them wait on the side-lines, not being told yet instinctively knowing everything. In our effort to protect them from the pain and realities of life, we might end up doing the opposite. I’m spending time with Ranveer right now, while he’s on summer vacation. His madness and shenanigans help me #SwitchOnTheSunshine. And today, we derive strength from each other #OneDayAtATime

A post shared by Sonali Bendre (@iamsonalibendre) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement