emotional letter
-
మీ నమ్మకాన్ని పొందటం నాకు గర్వకారణం
న్యూఢిల్లీ: దశాబ్దాలుగా రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి విజయం సాధిస్తూ ప్రస్తుతం వయోభారం కారణంగా ప్రజాసభను వదిలి ఎగువ సభకు తన రాజకీయ పథాన్ని మార్చుకుంటున్న కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ తన నియోజకవర్గ ఓటర్లకు భావోద్వేగంతో ఒక లేఖ రాశారు. ‘‘ నేనిప్పుడు ఈ స్థాయిలో ఉన్ననంటే దానికి మీరే కారణమని గర్వంగా చెబుతా. మీ వల్లే, మీరు నాపై ఉంచిన నమ్మకం వల్లే నా శక్తిమేరకు మీకు సేవచేయగలిగాను. అనారోగ్యం, వయోభారం సమస్యల కారణంగా ఇక మీదట లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయదల్చుకోలేదు. ఈ నిర్ణయం తర్వాత ప్రత్యక్షంగా మీకు సేవచేసే అవకాశం నాకు లేదని తెలుసు. కానీ నా మనసు నిండా మీరే ఉన్నారు. గతంలోలాగే ఇక మీదట కూడా మీరు నాకు, నా కుటుంబానికి అండగా నిలబడతారని తెలుసు’’ అని హిందీలో సోనియా ఓటర్లకు ఒక సందేశం పంపారు. ‘‘ మీరు లేకుండా ఢిల్లీలో నా కుటుంబం సంపూర్ణం కాదు. రాయ్‌బరేలీకి వచ్చి మిమ్మల్ని కలిసినప్పుడే మొత్తం కుటుంబం అనే భావన కలుగుతోంది. మీ బంధం దశాబ్దాలనాటిది. నా అత్తగారి నుంచే నేనీ బంధాన్ని వారసత్వంగా పొందా. రాయ్‌బరేలీతో నా కుటుంబ బంధం బలంగా పెనవేసుకుంది. నా మామగారు ఫిరోజ్ గాంధీ స్వాతంత్య్ర సిద్ధించాక తొలి సార్వత్రిక ఎన్నికల్లో ఇదే రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత ఇందిరా గాంధీని ఆశీర్వదించి లోక్‌సభకు పంపారు. జీవితంలో ఎన్ని ఎత్తుపల్లాలు ఎదురైనా తోడుగా నిలిచి బంధాన్ని మరింత పటిష్టం చేశారు. అత్తను కోల్పోయినప్పుడు, భర్తను కోల్పోయినప్పుడూ మీ చెంతకొచి్చన నన్ను ఆదరించి అక్కున చేర్చుకున్నారు. ఇంతటి మద్దతు, ప్రోత్సాహాన్ని జీవితంలో మరువను. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో గడ్డుపరిస్థితులు ఎదురైనా మీరు నావెంటే నడిచారు. నా కంటే పెద్దవారికి ధన్యవాదాలు, యువతకు ప్రేమాశీస్సులు. త్వరలోనే మిమ్మల్ని కలుస్తా’ అని సోనియా తన సందేశం పంపారు. రాజస్తాన్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలుచేసిన మరుసటి రోజు సోనియా తన నియోజకవర్గ ప్రజలను గుర్తుచేసుకుంటూ లేఖ రాయడం గమనార్హం. సోనియా కుమార్తె ప్రియాంక గాంధీ ఈసారి రాయ్‌బరేలీ నుంచి సార్వత్రిక సమరంలో నిలబడతారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. -
సోనియా గాంధీ భావోద్వేగ లేఖ!
రాజ్యసభ ఎన్నికలకు సోనియా గాంధీ బుధవారం (ఫిబ్రవరి 14) నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు రాజ్యసభకు వెళుతుండటంపై పలువురు విమర్శిస్తున్నారు. ఈ నేపధ్యంలో సోనియా గాంధీ ఆ విమర్శలకు వివరణగా రాయ్‌బరేలీ ప్రజలను ఉద్దేశిస్తూ భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ‘ఢిల్లీలో మా కుటుంబం అసంపూర్ణంగా ఉంది. రాయ్‌బరేలీకి వచ్చి మిమ్మల్ని కలవడం ద్వారా దీనికి సంపూర్ణత ఏర్పడింది. ఈ సన్నిహిత సంబంధం ఎంతో పాతది. నా అత్తమామల నుండి నాకు అదృష్టంలా వచ్చింది’ అని సోనియా గాంధీ ఆ లేఖలో రాశారు. CPP चेयरपर्सन श्रीमती सोनिया गांधी जी का रायबरेली की जनता के नाम संदेश- pic.twitter.com/6zlJkWjwvi — Congress (@INCIndia) February 15, 2024 రాయ్‌బరేలీతో అనుబంధం.. ‘రాయ్‌బరేలీతో మా కుటుంబ సంబంధాలు చాలా లోతుగా ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల్లో మీరు నా మామగారైన ఫిరోజ్ గాంధీని ఇక్కడి నుంచి గెలిపించారు. ఆయన తర్వాత నా అత్తగారు ఇందిరాగాంధీని కూడా ఇలానే ఢిల్లీకి పంపారు. నా జీవితంలోని ఒడిదుడుకులలలో మీ ప్రేమ, ఉత్సాహం దొరికింది’ గత రెండు దఫాల ఎన్నికల్లో.. ‘నా అత్తగారిని, నా జీవిత భాగస్వామిని కోల్పోయిన తరువాత, నేను మీ వద్దకు వచ్చాను. మీరు నా కోసం ఆప్యాయంగా చేతులు చాచారు. గత రెండు దఫాల ఎన్నికల్లో మీరు నాకు అండగా నిలిచిన సంగతి మరచిపోలేను. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది మీ కారణంగానే అని గర్వంగా చెబుతాను. మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నిరంతరం ప్రయత్నించాను’ ఆరోగ్యం, పెరుగుతున్న వయస్సు.. ‘ఇప్పుడు నా ఆరోగ్యం, పెరుగుతున్న వయస్సు కారణంగా నేను రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఈ నిర్ణయం తీసుకున్నాక నేను మీకు నేరుగా సేవ చేసే అవకాశాన్ని పొందలేను. నా మనసులో ఈ వేదన అలానే ఉంటుంది. అయితే నా ప్రాణం ఎప్పుడూ ఇక్కడే ఉంటుంది. ఇప్పటి వరకు నన్ను మీరు ఆదుకున్నట్లే ఇకపై నన్ను, నా కుటుంబాన్ని ప్రతి కష్టంలోనూ మీరు ఆదుకుంటారని నాకు తెలుసు.పెద్దలకు నమస్కారాలు, పిల్లలకు ప్రేమాభినందనలు. త్వరలోనే కలుస్తానని వాగ్దానం చేస్తున్నాను’ అని సోనియా ఆ లేఖలో పేర్కొన్నారు. -
కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రవల్లిక లెటర్
-
నా తనువు మట్టిలో కలిసినా.. కన్నీరు పెట్టిస్తున్న నిఖిల్ కవిత
మనుషుల్లో స్వార్థం పెరిగిపోతోంది. మానవ సంబంధాలు కేవలం డబ్బు చుట్టూరానే తిరుగుతున్నాయి. మనం బాగుంటే చాలూ.. పక్కవాడు ఏమైపోతే మాకేం అనుకునేవాళ్లు మనమధ్యే ఉన్నారు. రోడ్డు మీద ప్రాణం పోతున్నా పట్టించుకోకుండా సెల్ఫోన్లతో బంధించే యువత ఉన్న ఈ రోజుల్లో.. చదువుకున్న ఓ యువకుడి ఆలోచన శెభాష్ అనిపించడమే కాదు.. జీవితాన్ని ముందే పసిగట్టి అతను రాసిన లేఖ కంటతడి పెట్టిస్తోంది కూడా. చిన్ని నిఖిల్.. వనపర్తి జిల్లా అమరచింతకి చెందిన యువకుడు. బెంగళూరులో బీఏఎంస్ చేసి.. అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నాడు కూడా. అంతా సవ్యంగా ఉందనుకున్న టైంలో విధికి కన్నుకుట్టిందేమో.. 24 ఏళ్ల నిఖిల్‌ను రోడ్డు ప్రమాదం చలనం లేకుండా చేసేసింది. ఏప్రిల్ 29వ తేదీన బెంగళూరు నుంచి కావలికి వెళ్తున్న సమయంలో నిఖిల్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తలకు బలమైన గాయం కావడంతో.. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు కుటుంబ సభ్యులు. చివరకు మే 1వ తేదీన చికిత్స పొందుతున్న నిఖిల్‌కు బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే.. అంత శోకంలోనూ కొడుకు ఆశయం నెరవేర్చాలని ఆ తల్లిదండ్రులు రమేష్, భారతిలు ముందుకొచ్చారు. ప్రత్యేక ఆంబులెన్స్‌లో నిఖిల్‌ను సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. ఆరుగురికి అవయవదాతగా నిలిచాడు. స్టూడెంట్‌గా ఉన్న టైంలోనే.. ఆర్గాన్ డొనేషన్ ప్రతిజ్ఞ చేసిన నిఖిల్ అందుకు సమ్మతి పత్రాన్ని సైతం ఓ ఆర్గనైజేషన్‌కు అందజేశాడు. ఆ సమయంలో ఆ పత్రాలకు అతను జత చేసిన కవిత ఇలా ఉంది.. నా తనువు మట్టిలో కలిసినా.. అవయవదానంతో మరొకరిలో జీవిస్తా.. ఒక అమ్మకు బిడ్డగా మరణించినా.. మరో అమ్మ పిలుపులో బతికే ఉంటా.. ఏనాడూ వెలుగులు చూడని అభాగ్యులకు నా కళ్లు.. ఆగిపోవడానికి సిద్ధంగా ఉన్న గుండెకు బదులుగా నా గుండె కిడ్నీలు కోల్పోయిన వారికి మూత్రపిండాలు ఊపిరి అందక ఊగిసలాడుతున్న వారికి ఊపిరితిత్తులు కాలేయం పని చేయక కాలం ముందు ఓడిపోతున్న వారికి నా కాలేయం నాలోని ప్రతీ అణువూ అవసరమైన వారికి ఉపయోగపడాలి ఆపదలో ఉన్నవారిని ఆదుకోండి ఇదే మీకు నాకు ఇచ్చే గొప్ప బహుమతి ఇలా మీరు చేస్తే నేను కూడా సదా మీ మదిలో నిలుస్తాను.. చిరంజీవినై ఉంటాను అవయవదానం చేద్దాం.. మరో శ్వాసలో శ్వాసగా ఉందాం అంటూ పిలుపు ఇచ్చాడు నిఖిల్. ఇదీ చదవండి: తనలాంటి వాళ్లకు కృష్ణప్రియ చేసే సాయం ఇది -
‘అమ్మా.. తప్పకుండా తిరిగొస్తాను’ తల్లికి సంజయ్ రౌత్ భావోద్వేగ లేఖ
సాక్షి, ముంబై: పత్రాచల్ భూకుంభకోణంలో అరెస్టై ప్రస్తుతం జైల్లో ఉన్న శివసేన ఫైర్‌బ్రాండ్, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ తన తల్లికి భావోద్వేగ లేఖ రాశారు. తను ఖచ్చితంగా తిరిగి వస్తానని, అప్పటి వరకు ఉద్దవ్ ఠాక్రే, శివ సైనికులు నిన్ను(తల్లి) జాగ్రత్తగా చూసుకుంటారని హామీ ఇచ్చారు. శివసేనకు ద్రోహం చేసేలా ఒత్తిడి తీసుకొచ్చారని, వాళ్ల ఒత్తిళ్లకు లొంగకపోవడం వల్లే నేడు తల్లికి దూరంగా ఉన్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు ఈ లేఖను సంజయ రౌత్ తన ట్విటర్లో బుధవారం పోస్టు చేశారు. ‘నీలాగే(తల్లి) శివసేన కూడా నాకు అమ్మతో సమానం. నా తల్లికి(శివసేన) ద్రోహం చేసేలా ఒత్తిడి తీసుకొచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదని బెదిరించారు. వారి బెదిరింపులకు లొంగకపోవడం వల్ల జైలుకు వెళ్లాల్సి వస్తోంది. ఈ కారణం వల్లే ఈరోజు నేను నీకు దూరంగా ఉన్నాను. దేశం కోసం సరిహద్దుల్లో నిలబడి పోరాడుతున్న వేలాది మంది సైనికులు నెలల తరబడి ఇంటికి రారు. కొందరు ఇంటికి ఎప్పటికీ వెళ్లరు. నేను కూడా మహారాష్ట్ర, శివసేన శత్రువులకు తలవంచలేను. మహారాష్ట్ర, దేశ విధేయుడిని అంత తేలిగ్గా చంపలేరు. చదవండి: తండ్రి చితికి నిప్పుపెట్టిన మరునాడే అఖిలేశ్ ఎమోషనల్ పోస్ట్ రాజకీయ ప్రత్యర్థుల ముందు తలవంచబోను. ఈ ఆత్మగౌరవాన్ని నేను మీ నుంచే నేర్చుకున్నా. శివసేన, బాలాసాహెబ్ పట్ల నిజాయితీగా ఉండాలని మీరు కునా నేర్పించారు. శివసేన గడ్డు పరిస్థితుల్లో ఉంటే బాలాసాహెబ్ ఏమి చేస్తారో అది చేయాలని నేర్పించారు.’ అని లేఖలో పేర్కొన్నారు. అలాగే ఆగస్టు 8న రాసిన లేఖలో ఈడీ కస్టడీ ఇప్పుడే ముగిసిందని, జ్యుడీషియల్ కస్టడీలోకి వెళ్లే ముందు సెషన్స్ కోర్టు ప్రాంగణంలో కూర్చొని ఈ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. తల్లికి లేఖ రాసి చాలా ఏళ్లు అవుతోందని, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ లేఖ రాసేందుకు అవకాశం దక్కిందని పేర్కొన్నారు. प्रिय आई, जय महाराष्ट्र, .....तुझा संजय (बंधू) pic.twitter.com/EXAtkcyRLi — Sanjay Raut (@rautsanjay61) October 12, 2022 కాగా పత్రాచల్ ప్రాంత పునర్నిర్మాణ పనుల్లో అవకతవకల ఆరోపణలతో (మానీలాండరింగ్ కేసు) ఆగస్టు 1న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఈడీ కస్టడీ ముగియడంతో ఆగస్టు 8న ఆయన్ను జ్యూడీషియల్ కస్టడీగి అప్పగించారు అప్పటి నుంచి ఆయన జ్యూడీషియల్ కస్టడీని పొడిగిస్తూనే ఉన్నారు. కాగా ఈనెల 10న సంజయ్ రౌత్ కస్టడీని అక్టోబర్ 17 వరకు కోర్టు పొడిగిస్తూ తీర్పునిచ్చింది. అలాగే ఈ కేసులో ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఆయన భార్య, సన్నిహతుల ప్రమేయం ఉందని ఈడీ ఆరోపిస్తోంది. సంజయ్ రౌత్ భార్యను కూడా ఈడీ ప్రశ్నించింది. చదవండి: విషాదం.. ఉన్నట్టుండి స్టేజ్‌పై కుప్పకూలిన శివుడి వేషధారి.. -
భర్త మరణాంతరం తొలిసారి స్పందించిన నటి మీనా
భర్త మరణాంతరం మీనా తొలిసారి స్పందించారు. తన భర్త విద్యాసాగర్ మరణంపై సోషల్ మీడియాలో వస్తున్న ఆసత్య ప్రచారంపై ఆమె విచారం వ్యక్తం చేశారు. తన భర్త మృతిపై అసత్య ప్రచారాలు చేయొద్దని కోరారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె భావోద్వేగ పోస్ట్ షేర్ చేశారు. ‘భర్త దూరమయ్యారనే బాధలో ఉన్నాను. ఈ సమయంలో మా కుటుంబ ప్రైవసీకి భంగం కలిగించకండి. దయచేసి పరిస్థితి అర్థం చేసుకోండి. చదవండి: ‘భర్తను కాపాడుకునేందుకు మీనా చివరి వరకు పోరాడింది’ ‘విద్యాసాగర్ మృతిపై ఎలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కష్టకాలంలో మాకు అండగా నిలిచి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా భర్త ప్రాణాలను కాపాడేందుకు ఎంతో కృషి చేసిన వైద్య బృందం, తమిళనాడు సీఎం, ఆరోగ్య మంత్రి, ఐఏఎస్ రాధాకృష్ణన్, సన్నిహితులు, మిత్రులకు కృతజ్ఞతలు. అలాగే ఆయన కోలుకోవాలని ప్రార్థించిన అభిమానుల ప్రేమకు ధన్యవాదాలు’ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు మీనా. చదవండి: వివాదంలో నరేశ్ పెళ్లి.. తెరపైకి మూడో భార్య.. సంచలన విషయాలు.. కాగా గత కొంతకాలం ఊపితిత్తుల సమస్యలతో బాధపడుతున్న మీనా భర్త విద్యాసాగర్ చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే భర్తను బతికించుకునేందుకు మీనా ఎంతో ప్రయత్నించారని ప్రముఖ కొరియోగ్రాఫర్ కళా మాస్టర్ రీసెంట్గా ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) -
ప్రేమతో ఎన్టీఆర్ లేఖ.. ఒక్కొక్కరి గురించి ఏం చెప్పాడంటే ?
Jr NTR Emotional Letter To RRR Team On Movie Success: ‘‘నా కెరీర్లో ఓ ల్యాండ్ మార్క్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో భాగమైన అందరికీ, రిలీజ్ అయిన దగ్గర్నుంచి ప్రేమ, ప్రశంసలు అందిస్తున్న అందరికీ ధన్యవాదాలు’’ అంటూ మంగళవారం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ట్విటర్ ద్వారా తన మనోభావాలను ఈ విధంగా వ్యక్తపరిచారు. ‘‘నటుడిగా నేను నా ‘బెస్ట్’ ఇవ్వడానికి నన్ను ఇన్‌స్పయిర్ చేసినందుకు థ్యాంక్యూ జక్కన్నా (రాజమౌళిని ఉద్దేశించి). నాలోని బెస్ట్‌ని బయటకు తెచ్చి నన్ను నేను నీటి (‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ పాత్రను నీళ్లతో పోల్చారు రాజమౌళి)లా భావించేలా చేశారు’’ అన్నారు ఎన్టీఆర్. రామ్‌చరణ్‌ని ఉద్దేశించి.. ‘‘నువ్వు లేకుండా నేను ‘ఆర్ఆర్ఆర్’లో నటించడాన్ని ఊహించుకోలేకపోతున్నాను. అల్లూరి సీతారామరాజు పాత్రకు నువ్వు తప్ప వేరే ఎవరూ న్యాయం చేయలేకపోయేవారు. అలాగే నువ్వు లేకుండా భీమ్ (ఎన్టీఆర్ పాత్ర) పాత్ర అసంపూర్ణంగా ఉండేది’’ అని ఎన్టీఆర్ ప్రశంసించారు. ఇంకా రచయిత విజయేంద్ర ప్రసాద్, నిర్మాత దానయ్య, నటీనటులు ఆలియా భట్, అజయ్ దేవగన్, సంగీతదర్శకుడు కీరవాణి తదితరులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే నిరంతరం సపోర్ట్ చేస్తూ, ప్రేమాభిమానాలు కనబరుస్తున్న తన ఫ్యాన్స్‌కి థ్యాంక్స్ చెప్పి, ‘‘ఇక ముందు కూడా మిమ్మల్ని ఇలానే ఎంటర్టైన్ చేస్తా’’ అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. దర్శకదిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న విడుదలైన కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తూ థియేటర్లలో అదరగొడుతోంది. కేవలం మూడు రోజల్లోనే రూ. 500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బాహుబలి రికార్డుని తిరగరాసింది. I’m touched beyond words… pic.twitter.com/PIpmJCxTly — Jr NTR (@tarak9999) March 29, 2022 -
'భయమేస్తే గట్టిగా హత్తుకునేదాన్ని.. మిస్ యూ నాన్న'
ఆస్ట్రేలియన్ దిగ్గజం షేన్ వార్న్ భౌతికంగా దూరమై నాలుగు రోజులు కావొస్తుంది. ఇప్పటికి వార్న్‌కు ప్రపంచవ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా వార్న్ పిల్లలతో పాటు తల్లిదండ్రులు ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. కాగా పెద్ద కూతురు సమ్మర్ ''నాన్నకు ప్రేమతో.. అంటూ రాసిన నోట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ''ఇప్పటికే నిన్ను చాలా మిస్సవుతున్నా. చిన్నప్పుడు భయమేస్తే నిన్ను గట్టిగా హత్తుకొని నిద్రపోయేదాన్ని.. కానీ ఇకపై ఆ అవకాశం లేకుండా పోయింది. నీ చివరి క్షణాల్లో నేను పక్కన లేకపోవడం దురదృష్టంగా భావిస్తున్నా. ఆ సమయంలో నీ పక్కన ఉండి ఉంటే.. చేతిని పట్టుకొని ఏం కాదు అంతా సవ్యంగా జరుగుతుంది అని చెబుదామనుకున్నా. అడగకుండానే అన్నీ ఇచ్చారు.. బెస్ట్ డాడీగా ఉండడం మాకు వరం.'' అని పేర్కొంది. ''చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమతో పెంచారు. మీ జోకులతో మమ్మల్ని ఎన్నోసార్లు నవ్వించారు. ఈరోజు భౌతికంగా దూరమయ్యారంటే తట్టుకోలేకపోతున్నా.. మిస్ యూ నాన్న అంటూ వార్న్ చిన్న కూతురు బ్రూక్ ట్వీట్ చేసింది. ''నా గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటావు. నువ్వో గొప్ప తండ్రివి, స్నేహితుడివి'' అంటూ వార్న్ పెద్ద కుమారుడు జాక్సన్ తన బాధను వ్యక్తం చేశాడు. ''ఇది ఎప్పటికీ ముగిసిపోని పీడకలలాంటిది. వార్న్ లేని జీవితాన్ని ఊహించలేకపోతున్నాం. అతను అందించిన జ్ఞాపకాలతో బతికేస్తాం’' అని అతని తల్లిదండ్రులు కీత్, బ్రిగిట్ ఆవేదనతో కుమిలిపోయారు. ఇక గత శుక్రవారం థాయ్‌లాండ్‌లోని కోయ్ సమూహ్ ప్రాంతంలోని తన విల్లాలో వార్న్ అచేతన స్థితిలో మరణించాడు. అతని మృతిపై పలు రకాల అనుమానాలు వచ్చినప్పటికి.. వార్న్‌ది సహజ మరణమేనని థాయ్ పోలీసులు మరోసారి స్పష్టం చేశారు. వార్న్ అంత్యక్రియలను ఆస్ట్రేలియా ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు అతని కుటుంబ సభ్యులు అంగీకరించారు. వార్న్ కెరీర్లో ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలకు నెలవైన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో సుమారు లక్ష మంది అభిమానుల మధ్య ఈ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. ఎంసీజీ బయట వార్న్ విగ్రహం ఉండగా, మైదానంలో ఒక స్టాండ్‌కు కూడా అతని పేరు పెట్టనున్నారు. ఇంకా తేదీ ధ్రువీకరించకపోయినా... వచ్చే రెండు వారాల్లోగా అంత్యక్రియలు నిర్వహించవచ్చు. చదవండి: PAK vs AUS: దంపతులిద్దరు ఒకేసారి గ్రౌండ్లో.. అరుదైన దృశ్యం Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు సెలెక్టర్ల వార్నింగ్.. పది రోజులు ఉండాల్సిందే Shane Warne Death: ‘షేన్ వార్న్‌ది సహజ మరణమే’ -
పాకిస్తాన్‌కు వెళ్తున్నా.. వార్నర్ ఎమోషనల్ నోట్
దాదాపు 24 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా జట్టు పాకిస్తాన్లో పర్యటించనుంది. పాక్ గడ్డపై ఆసీస్ మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఒక టి20 మ్యాచ్ ఆడనుంది. మార్చి 8 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్ ఏప్రిల్ 5 వరకు కొనసాగనుంది. కాగా ఐపీఎల్ ప్రారంభ దశ పోటీలకు ఆస్ట్రేలియా క్రీడాకారులు దూరం కానున్నారు. ఈ విషయం పక్కనబెడితే ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు డేవిడ్ వార్నర్ పాక్ పర్యటన సందర్భంగా తన ఫ్యామిలీకి గుడ్‌బై చెబుతూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చాడు. తన భార్య కాండీస్, పిల్లలు ఇవి, ఇండీ, ఇస్లాలతో కలిసి దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ''నా పిల్లలకు గుడ్‌బై చెప్పడం ఎప్పుడు బాధగానే అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో నా భార్య, పిల్లలతో కలిసి సంతోషకరమైన క్షణాలు ఎన్నో గడిపాను. ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత పాక్ పర్యటనకు వెళ్లనుండడంతో మీకు దూరం కావాల్సి వస్తోంది. త్వరలోనే మిమ్నల్ని కలుస్తాను. ఐ మిస్ సో మచ్'' అంటూ ఉద్వేగంగా పేర్కొన్నాడు. ఇక పాక్ పర్యటన నేపథ్యంలో వార్నర్ ఆ టోర్నీ ముగిసిన తర్వాత నేరుగా ఐపీఎల్లో అడుగుపెట్టనున్నాడు. వన్డే సిరీస్, టి20 మ్యాచ్‌కు వార్నర్ ఎంపిక కానప్పటికి క్రికెట్ ఆస్ట్రేలియా ఎన్వోసీ ఇచ్చేవరకు వార్నర్ ఐపీఎల్ ఆడే వీలు లేదు. ఏప్రిల్ 5న పాక్ పర్యటన ముగియనున్న నేపథ్యంలో.. తర్వాతి రోజు ఆసీస్ క్రికెట్ బోర్డు ఆటగాళ్లకు ఎన్వోసీ ఇచ్చే అవకాశముంది. ఇక వార్నర్‌ను మెగావేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ.6.25 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. చదవండి: 'యుద్ధం ఆపేయండి'.. సొంత దేశాన్ని ఏకిపారేసిన టెన్నిస్ స్టార్ 'ఇప్పుడు నా టార్గెట్ అదే.. ఆ జట్టుకు హెడ్ కోచ్‌గా' View this post on Instagram A post shared by David Warner (@davidwarner31) -
నువ్వు గ్రేట్ మమ్మీ: బ్రాన్సన్ భావోద్వేగ లేఖ
రిచర్డ్ బ్రాన్సన్ ఆదివారం అంతరిక్షంలోకి వెళ్లి రావడానికి ముందు తల్లికి ఒక ఉత్తరం రాశారు. ఈ ఏడాది జనవరిలోనే ఆమె తన 96 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ‘నువ్వు గ్రేట్ మమ్మీ. నీ చిన్నతనంలో అబ్బాయిలా డ్రెస్ చేసుకుని గ్లైడర్ లెసన్స్ నేర్చుకున్నావు. రెండో ప్రపంచ యుద్ధ చరిత్రలో గ్రేట్ బ్రిటన్‌తో పాటు యోధురాలిగా నీ పేరూ ఉంది. ఆంట్రప్రెన్యూర్ అనే మాట పుట్టక ముందే నువ్వు ఆంట్రప్రెన్యూర్ అయ్యావు.. ‘ అంటూ ఒక ఉద్వేగభరితమైన, స్ఫూర్తిదాయక లేఖను బ్రాన్సన్ రాశారు. ‘ధైర్యవంతులే ఏదైనా సాధిస్తారు.. జాగ్రత్తపరులు కాదు అని కూడా అందులో ఆయన తన తల్లిని కొనియాడారు. గొప్ప ప్రారంభం ఏదైనా భయభక్తులతో, భక్తిశ్రద్ధలతో కూడి ఉంటుంది. ‘భగవంతుడా నీదే భారం’ అని ముకుళిత హస్తాలు ఆశీస్సులను వేడుకుంటాయి. శాస్త్రవేత్తలైనా అంతే! దైవాన్ని కాకుంటే, వాళ్లకు స్ఫూర్తిని ఇచ్చిన మనిషినైనా గుర్తుచేసుకుని కార్యోన్ముఖులౌతారు. యూఎస్‌లో ఉంటున్న బ్రిటన్ కోటీశ్వరుడు రిచర్డ్ బ్రాన్సన్ జూలై 11న ఆదివారం అంతరిక్షంలోకి వెళ్లే ముందు తన తల్లిని స్మరించుకున్నారు. ఆమెకొక లేఖను రాశారు. ఈవ్ బ్రాన్సన్ ఆమె పేరు. ఈ ఏడాది జనవరిలో కన్నుమూశారు. రిచర్డ్, మన తెలుగమ్మాయి శిరీషతో పాటు మరో నలుగురు వ్యోమగాములను రోదసీలోకి మోసుకెళ్లిన ‘వి.ఎం.ఎస్. ఈవ్’ వ్యోమనౌకలోని ‘ఈవ్’ అనే మాట రిచర్డ్ తన తల్లిపేరు లోంచి తీసుకున్నదే. వి.ఎం.ఎస్. అంటే ‘వర్జిన్ మదర్ షిప్’. పదిహేడేళ్ల క్రితం యూఎస్‌లో రిచర్డ్ స్థాపించిన బ్రిటిష్–అమెరికన్ స్పేస్ ఫ్లయిట్ కంపెనీ వర్జిన్ గెలాక్టిక్ విజయవంతంగా రోదసీలోకి పంపిన ఈ తొలి మానవ సహిత వ్యోమ నౌక ఆ ఆరుగురు అంతరిక్ష ప్రయాణికులను అదే రోజు క్షేమంగా భూమి మీదకు తీసుకొచ్చింది. కిందికి దిగీ దిగగానే రిచర్డ్ పట్టలేని ఆనందంతో తన సహ వ్యోమగామి శిరీషను భుజాల మీదకు ఎక్కించుకున్నారు. భూమి నుంచి 88 కి.మీ. ఎత్తులో ఆయన్ని ఆ భార రహిత స్థితిలో కనీసం నాలుగు నిముషాలు ఊయలలాడించిన ఒడి మాత్రం అతడి తల్లి ఈవ్ బ్రాన్సన్ ఇచ్చి వెళ్లిన ఉత్తేజమే . ‘అమ్మా.. దీవించు’ అని స్పేస్‌లోకి ఎగరడానికి ముందు రిచర్డ్ రాసిన లేఖను అతడి మాతృమూర్తి ఆత్మ చదివే ఉంటుందని ఆయన భావించి ఉంటారనేందుకు ఒక సంకేతంగా కూడా శిరీషను ఆయన ఎత్తుకోవడాన్ని చూడవచ్చు. ∙∙ తల్లికి రాసిన ఉత్తరంలో ‘అమ్మా నువ్వెప్పటికీ ఒక సాహసివి’ అని ఆమెను గుర్తు చేసుకున్నారు రిచర్డ్. తను చేయబోతున్న సాహసానికి ఆశీర్వచనాలను కోరారు. ఈవ్‌కు 26 ఏళ్ల వయసులో రిచర్డ్ జన్మించాడు. ముగ్గురు సంతానంలో తనే పెద్దవాడు. తర్వాత ఇద్దరు ఆడపిల్లలు. ఈవ్ తన పదిహేనవ యేటే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ‘ఉమెన్స్ రాయల్ నేవల్ సర్వీస్’లో పని చేశారు. అమ్మాయిల సైనిక బృందానికి నాయకత్వం వహించారు! ఇంకా చిన్న వయసులో అబ్బాయిల డ్రెస్ వేసుకుని గ్లైడింగ్ శిక్షణ తీసుకున్నారు. ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే బ్యాలే డాన్సర్‌గా పశ్చిమ జర్మనీలో పర్యటించారు. తిరిగొచ్చాక బ్రిటిష్ ఎయర్‌లైన్స్‌లో హోస్టెస్ అయ్యారు. ఇరవై ఐదో ఏట వివాహం చేసుకున్నారు. పెళ్లయ్యాక రియల్ ఎస్టేస్ బిజినెస్ చేపట్టారు. మిలటరీ ఆఫీసర్‌గా, ప్రొబేషన్ అధికారిగా కూడా పని చేశారు. నవలలు, పిల్లల పుస్తకాలు రాశారు. తల్లి అలసటన్నదే లేకుండా అనుక్షనం ఉత్తేజంగా ఏదో ఒక పని చేస్తుండటం రిచర్డ్ బ్రాన్సన్‌కి ఆశ్చర్యంగా ఉండేది. అతడు యువకుడు అయ్యేనాటికి బ్రిటన్‌లో పెద్ద ఆంట్రప్రెన్యూర్‌గా, గొప్ప పరోపకారిగా, బాలల సంక్షేమ సారథిగా ఆమె పేరు పొందారు. తల్లిని చూశాకే రిచర్డ్ తనొక ప్రయోగాల సాహసిగా మారాలనుకున్నాడు. ఆమె నుంచి స్ఫూర్తి పొంది అతడు సాధించిన తొలి విజయమే మొన్నటి వ్యోమయానం. ఈవ్, రిచర్డ్‌ల మధ్య అనుబంధం ప్రత్యేకమైనది. రిచర్డ్ తను ఎదుగుతున్న దశలో తల్లిని చూసి నేర్చుకున్నవే కాదు, తల్లి ఎదుగుతున్నప్పుడు ఆమె చిన్ననాటి విశేషాలు కూడా అతడిని సాహసి అయిన బిజినెస్ మాగ్నెట్గా మార్చాయి. తల్లికి రాసిన ‘ఆశీర్వచనాలను కోరే’ ఆ ఉత్తరంలో అవన్నీ గుర్తు చేసుకున్నారు రిచర్డ్. ‘ధైర్యవంతులే ఏదైనా సాధిస్తారు. జాగ్రత్తపరులు కాదు’ అని తన తల్లి ధైర్యాన్ని మహిళావనికి ఒక ఆదర్శంగా కీర్తించారు. -
రక్షాబంధన్ : సుశాంత్ సోదరి భావోద్వేగం
సాక్షి, ముంబై: అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల ప్రేమ బంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ సందర్భంగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి భావోద్వేగ పోస్ట్ షేర్ చేశారు. శ్వేతాసింగ్ కీర్తి రాఖీ పర్వదినం సందర్భంగా తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాఖీ శుభాకాంక్షలు..నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం..నువ్వు ఎప్పటికి మాకు గర్వకారణమే అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా గత జ్ఞాపకాల ఫోటోలను షేర్ చేశారు.(సుశాంత్ కేసు : మరో వివాదం) హ్యాపీ రక్షాబంధన్ మేరా స్వీట్ సా బేబీ...బహుత్ ప్యార్ కర్తే హై హమ్ ఆప్కో జాన్...ఔర్ హమేషా కర్తే రహెంగే...యూ వర్..ఆర్..యూ విల్..అవర్ ప్రైడ్ అంటూ శ్వేతా సింగ్ కీర్తి రాశారు. సోషల్ మీడియా ద్వారా సుశాంత్ సోదరి శ్వేతాతోపాటు మరో సోదరి నీతూ సింగ్ కూడా సుశాంత్ పై ప్రేమను వ్యక్తం చేశారు. గుల్షన్, నా బేబీ ..రక్షా బంధన్ రోజు నువ్వు లేకుండా ఎలా జీవించాలో అర్థం కావడం లేదు. నువ్వు శాశ్వతంగా దూరమైన రక్షా బంధన్ ఉంటుందని ఆలోచించలేదు. నువ్వు లేకుండా జీవించడం ఎలా నేర్చుకోవాలో నువ్వే చెప్పు అంటూ నీతూ సింగ్(రాణి దీ) పోస్ట్ చేశారు. (సుశాంత్ మరణం : షాకింగ్ వీడియో) కాగా జూన్ 14న సుశాంత్ ముంబైలోని బాంద్రా నివాసంలో ఉరికి వైలాడుతూ కనిపించిన సంగతి తెలిసిందే. సుశాంత్ మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నతరుణంలో రోజుకో కీలక పరిణామం వెలుగు చూస్తోంది. దీనిపై సీబీఐ దర్యాప్తు జరపాలంటూ పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు సుశాంత్ ఆత్మహత్యకు ప్రియురాలు రియా చక్రవర్తి కారణమంటూ సుశాంత్ తండ్రి బిహార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రియాపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో బిహార్, మహారాష్ట్ర పోలీసుల మధ్య వివాదం రగులుతున్న సంగతి తెలిసిందే. Happy Rakshabandhan mera sweet sa baby... bahut pyaar karte hain hum aapko jaan... aur hamesha karte rahenge... you were, you are and you will always be our PRIDE! ❤️ @sushantsinghrajput #HappyRakshaBandhan pic.twitter.com/SKWU4MlLd9 — shweta singh kirti (@shwetasinghkirt) August 3, 2020 -
ఈ వర్షం మనల్ని కలుపుతుంది: ఇర్ఫాన్ భార్య
ముంబై: బాలీవుడ్ దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ కు వర్షం, కలువ పూలు (తామర పువ్వు) అంటే చాలా ఇష్టమంటూ ఆయన భార్య సుతాప సిక్ధార్ సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేశారు. అదే విధంగా ఇర్ఫాన్ కలువ పూల కోసం సృష్టించిన లోటస్ పాండ్ ఫొటోలను ఆదివారం తన ఫేస్బుక్లో షేర్ చేసి భావోద్వేగ లేఖను పంచుకున్నారు. ‘ఈ కలువలు మిమ్మల్ని గుర్తు చేస్తున్నాయి ఇర్ఫాన్. వీటిని వికసించేలా చేయడానికి మీరు ఎంతగా తపించారో నాతో పాటు అవి కూడా చూశాయి. ఎండిపోతున్న కలువు పూలను సీసాలో తీసుకువచ్చి వాటి కోసం పాండ్‌ను నిర్మించడానికి ఎంతగా కష్టపడ్డారో’ అంటూ రాసుకొచ్చారు. (నా భర్త నాతోనే ఉన్నాడు: ఇర్ఫాన్ భార్య) మరో పోస్టులో వర్షం పడుతున్న వీడియోతో పాటు ఇర్ఫాన్ ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘మీకు ధన్యవాదాలు.. ఈ చినుకుల శబ్థంలో నేను మిమ్మల్ని విన్నాను. అవును ఇది మీకు, నాకు మధ్య వారధి అని నాకు తెలుసు. అది నా శరీరాన్ని, ఆత్మను తాకింది. రెండు లోకాలలో ఉన్న మనిద్దరినీ ఈ వర్షం కలుపుతుంది’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. విలక్షణ నటుడు ఇర్ఫాన్ న్యూరో ఎండోక్రిన్ క్యాన్సర్‌తో బాధపడుతూ ఏప్రిల్ 29న మరణించిన విషయం తెలిసిందే. (ఇర్ఫాన్ ఖాన్ వీడియో షేర్ చేసిన బాబిల్) -
అమ్మా.. మన ఇద్దరం తప్పనుకుంటా: సుశాంత్
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఈ నెల 14న ముంబైలోని తన నివాసంలో ఆత్యహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సుశాంత్ తన తల్లిని గుర్తు చేసుకుంటూ స్వహస్తాలతో రాసిన ఓ లేఖ అభిమానుల హృదయాలను కలచి వేస్తోంది. తల్లిని గుర్తు చేసుకుంటూ సుశాంత్ అందమైన కవితను రాశాడు. ‘నేను ఉన్నంత కాలం.. మీ జ్ఞాపకాలతోనే నేను సజీవంగా ఉన్నాను. ఓ నీడ వలే. కాలం ఎన్నటికి కదలదు. ఇది ఎంతో అందంగా ఉంది. ఇది ఎప్పటికి ఇలానే కొనసాగుతుంది. అమ్మా నీకు గుర్తుందా.. ఎప్పటికి నాతోనే ఉంటానని నువ్వు నాకు వాగ్దానం చేశావు. అలానే ఎలాంటి పరిస్థితుల్లో అయినా నవ్వుతూనే ఉంటానని నేను నీకు మాట ఇచ్చాను. చూడబోతే మన ఇద్దరం తప్పని తెలుస్తుంది అమ్మా’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.(సామాజిక దూరంతోనే ఆత్మహత్యలు!) Late #SushantSinghRajput’s handwritten note for his mother after she passed away. #RIPSushantSinghRajput pic.twitter.com/tQjEMe4wcJ — Filmfare (@filmfare) June 17, 2020 సుశాంత్‌కు తన తల్లితో గాఢమైన అనుబంధం ఉండేది. అయితే దురదృష్టవశాత్తు సుశాంత్ యుక్త వయసులోనే ఆమె మరణించారు. అయినప్పటికి సుశాంత్ ఆమెను తన హృదయంలో పదిలంగా దాచుకున్నారు. ఇదే కాక సుశాంత్ చివరి సోషల్ మీడియా మెసేజ్ కూడా తల్లిని ఉద్దేశిస్తూనే చేశాడు. (కరణ్ నంబర్ ఇచ్చాడు కదా అని ఫోన్ చేస్తే..) -
ప్రేమ సందేశాలు
గత నెలలో శ్రుతీహాసన్ పుట్టిన రోజుకు లండన్ నుంచి ప్రేమ సందేశాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు శ్రుతీ బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ కోర్సలే. సోమవారం మైఖేల్ పుట్టినరోజు. ఈసారి ప్రేమ సందేశాలను లండన్ పంపడం శ్రుతీ వంతైంది. ‘‘మైఖేల్.. ఈ ఏడాది నువ్వు ఇంకా అద్భుతంగా మారతావని, కెరీర్ మరింత కాంతివంతంగా మారుతుందని ఆశిస్తున్నాను. వీటితోపాటు నీ హృదయం మరింత విశాలంగా మారుతుందని (ఒకవేళ అవకాశముంటే). హ్యాపీ బర్త్‌డే బెస్ట్ ఫ్రెండ్. మై మ్యాన్.. మిస్ అవుతున్నాను’’ అని రాసుకొచ్చారు శ్రుతీ. ప్రేమ పంచుకుంటున్న వీళ్లు జీవితాన్ని ఎప్పుడు పంచుకుంటారో అని శ్రుతీ ఫ్యాన్స్ వెయిటింగ్. -
మేం పచ్చి అబద్దాలకోరులం..
కశ్మీర్లో తమ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేశారన్న ఆగ్రహంతో రాష్ట్ర పోలీస్ అధికారుల కుటుంబీకులు 11 మందిని హిజ్బుల్ ఉగ్రవాదుల కిడ్నాప్ చేయడం తెల్సిందే. ఈ నేపథ్యంలో పోలీస్ అధికారుల కుటుంబాలు పడుతున్న మానసిక క్షోభ, కశ్మీర్‌లోయలో పరిస్థితులపై ఓ పోలీస్ అధికారి భార్య, ఉద్యోగిని అయిన ఆరీఫా తౌసిఫ్ ఓ స్థానిక వార్తాపత్రికకు భావోద్వేగ లేఖ రాశారు. శారీరకంగా పక్కనున్నా మానసికంగా విధుల్లోనే ‘ఒంటరిగా ఇంట్లో నిద్రపోవడమన్నది పెద్ద సమస్యేం కాదు. కానీ అర్ధరాత్రి భయంతో ఉలిక్కిపడి లేచిన సందర్భాల్లో పక్కనుండి ఓదార్చేందుకు, ధైర్యం చెప్పేందుకు ఎవ్వరూ లేకపోవడంతో మానసిక క్షోభను అనుభవిస్తాం. అంతేకాదు భర్తతో కలసి ఈ రోజు లేదా రేపు లేదా ఎల్లుండి బయటకు వెళ్లాలనుకుని మేం అనుకుంటే అవి ఎప్పుడోకాని జరగవు. అదృష్టంకొద్దీ అది జరిగినా పోలీస్ అధికారులు శారీరకంగా మాత్రమే కుటుంబ సభ్యులతో ఇంట్లో ఉంటారు. కానీ మానసికంగా, ఫోన్ ద్వారా వాళ్లు అప్పుడు కూడా విధుల్లోనే ఉంటారు. కశ్మీర్లో ఆపరేషన్ల సందర్భంగా ఎక్కడ, ఏ పోలీస్ అధికారి చనిపోయినా మేమంతా తీవ్రమైన భయం, అభద్రతాభావంలోకి జారిపోతున్నాం’ బయటకు వెళ్లాలంటేనే భయమేస్తోంది కశ్మీర్లో పరిస్థితులపై స్పందిస్తూ.. ‘ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకనే కశ్మీర్లో యువకులు పోలీస్‌శాఖలో చేరుతున్నారు. వారు చదివింది ఒకటి. చేసేది మరోటి. దేశంలో కశ్మీర్లో మాత్రమే రిటైర్డ్ అధికారులు డిప్యూటీ సూపరింటెండెంట్(డీఎస్పీ)లుగా, ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీచేసిన వారు ప్రభుత్వ అధికారులుగా చేస్తున్నారు. కొన్నిసార్లు ఇంటినుంచి బయటికెళ్లాలంటే భయమేస్తోంది. భద్రతాబలగాలు జరిపిన కాల్పుల్లో పెల్లెట్లు తగలడంతో నష్టపోయినవారు, ఇతరులు ఆ దురదృష్టకర ఘటనకు మేమే బాధ్యులం అన్నట్లు చూస్తారు. ఏదైనా పోలీస్ అధికారికి ప్రమాదం జరిగితే కనీసం మా పట్ల సానుభూతి చూపేవారు ఒక్కరు కూడా ఉండటం లేదు. ఈ విషయాలను నా పిల్లలు చిన్నతనంలోనే అర్ధం చేసుకున్నారు. ప్రస్తుతం నా రాష్ట్రంపై కమ్ముకున్న కారు చీకట్లు తొలగిపోయి సుసంపన్నమైన, శాంతియుత కశ్మీర్‌ను చూడాలని నేను కోరుకుంటున్నా’ అంటూ తన భావోద్వేగ లేఖను ముగించారు. చిన్నచిన్న కోరికలూ సుదూర స్వప్నాలే.. ‘భర్తతో సరదాగా షికారు, కష్టసుఖాల్లో కలసిఉండటం వంటి చిన్నచిన్న కోరికలు సైతం పోలీస్ అధికారుల భార్యలకు సుదూర స్వప్నాలే. రాత్రి భర్త ఇంటికొస్తే కుటుంబమంతా కలసి భోంచేద్దామని ఎదురుచూస్తాం. కుటుంబంలో వేడుకలు, అంత్యక్రియలకు కలసి వెళ్లాలనుకుంటాం. పిల్లలతో కలసి షికారుకు వెళ్లాలనుకుంటా. కానీ వీటిలో ఏవీ నెరవేరవు. మా పిల్లలను ఒంటరిగా పెంచుతాం. మేం పచ్చి అబద్దాలకోరులం. మాలో చాలా మంది ‘నాన్న శనివారం ఇంటికొస్తారు’ ‘నాన్న పేరెంట్ మీటింగ్‌కు కచ్చితంగా వస్తారు’ ‘మనం ఈవారం నాన్నతో కలసి పిక్నిక్కు పోదాం’, ‘పండుగకు నాన్న ఇంటికొస్తానన్నారు’ అంటూ మా పిల్లలకు అబద్ధాలు చెబుతూనే ఉంటాం. అనారోగ్యంతో బాధపడే మా అత్తమామలకు ‘మీ అబ్బాయి ఫలానా రోజు వస్తానన్నారు’ అంటూ అబద్ధాలు చెబుతాం. ఇలా అబద్ధాలు చెబుతూ మమ్మల్ని మేమే మోసం చేసుకుంటున్నాం’ -
నాన్నా.. ఒక్కసారి పిలవొచ్చా : స్టాలిన్ భావోద్వేగం
చెన్నై : డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతిపట్ల ఆయన కుమారుడు, పార్టీ నాయకుడు ఎంకే స్టాలిన్ విషాదాన్ని వ్యక్తం చేస్తు భావోద్వేమైన లేఖను రాశారు. చివరిసారిగా ఒక్క సారి నాన్నా(అప్పా).. అని పిలవనా అంటూ బుధవారం ఉద్వేగపూరితమైన లేఖ రాశారు. ఆ లేఖలో ఏం ఉందంటే.. ‘ అప్పా(నాన్న) ..అప్పా అని పిలిచేబదులు మిమ్మల్ని మా నాయకుడు(తలైవార్) అనే ఎక్కువ సార్లు పిలిచేవాడిని. చివరి సారిగా ఒక్క సారి నాన్నా అని పిలువనా లీడర్. ఎక్కడి వెళ్లాల్సివచ్చినా మాకు ముందే సమాచారం ఇచ్చేవారు. ఇప్పుడు ఎందుకు చెప్పకుండా వెళ్లిపోయావు. 33 ఏళ్ల క్రితం సమాధి గురించి మీరు చెప్పిన వాఖ్యలు నాకు బాగా గుర్తుకు ఉన్నాయి. ఎవరైతే విశ్రాంతి లేకుండా పని చేస్తారో వారు ఇక్కడ(సమాధి) విశ్రాంతి పొందుతారు’ అని చెప్పారు. మీరు తమిళ ప్రజల కోసం విశ్రాంతి లేకుండా కృషి చేసి సంతృప్తితో అక్కడికి(సమాధి) సేద తీరడానికి వెళ్లారని ఆశిస్తున్నా’ అని లేఖలో పేర్కొన్నారు. సాయంత్రం 4 గంటలకు రాజాజీ హాల్ నుంచి కరుణానిధి అంతిమయాత్ర ప్రారంభమైంది. వాలాజా రోడ్, చెపాక్ స్టేడియం మీదుగా గంటన్నరపాటు అంతిమయాత్ర సాగనుంది. అనంతరం సాయంత్రం 6 గంటలకు మెరీనా బీచ్‌లోని అన్నా స్క్వేర్ ప్రాగంణంలో ప్రభుత్వ లాంఛనాలతో కరుణానిధి అంత్యక్రియలు జరగనున్నాయి. ஒரே ஒருமுறை இப்போதாவது ‘அப்பா’ என அழைத்து கொள்ளட்டுமா ‘தலைவரே’! pic.twitter.com/HWyMPkSmLj — M.K.Stalin (@mkstalin) 7 August 2018 -
‘తనకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు’
ప్రముఖ నటి సొనాలి బింద్రే క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్నారు. తన ఆరోగ్యానికి సంబంధించిన ప్రతీ విషయాన్ని ఎప్పటికపుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా.. కుమారుడు రణ్వీర్తో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సొనాలి... తాను క్యాన్సర్ బారిన పడిన విషయాన్ని అతడితో ఎలా పంచుకున్నది చెబుతూ రాసిన లేఖ నెటిజన్ల హృదయాల్ని కదిలిస్తోంది. తను నా తల్లిగా మారాడు.. ‘పన్నెండేళ్ల క్రితం జన్మించిన రణ్వీర్.. నా హృదయాన్ని పూర్తిగా ఆక్రమించేశాడు. అప్పటి నుంచి తన సంతోషం కోసమే అనుక్షణం తాపత్రయపడ్డాను. క్యాన్సర్ మహమ్మారి నాలో ప్రవేశించిన విషయం తెలియగానే.. ఈ విషయాన్ని తనకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. నాకు సంబంధించిన ప్రతీ విషయాన్ని వాడితో షేర్ చేసుకోవడం అలవాటు. కానీ ఈ విషయాన్ని దాచి వాడిని బాధను మరింతగా పెంచడం సరైంది అనిపించలేదు. అందుకే ధైర్యం చేసి ఈ చేదు నిజాన్ని చెప్పేశాను. కానీ నేను ఊహించిన దానికి భిన్నంగా రణ్వీర్ ఎంతో పరిపక్వంగా ఆలోచించాడు. చెప్పాలంటే తనే నాకు ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు. ఒక్కోసారి తనే తల్లిలా నన్ను లాలిస్తున్నాడు. ట్రీట్మెంట్కు సంబంధించిన అపాయింట్మెంట్ల గురించి గుర్తు చేస్తున్నాడు. మన ఆరోగ్యానికి సంబంధించిన విషయాల గురించి పిల్లలతో తప్పకుండా పంచుకోవాలి. అపుడే జీవితంలో సంభవించే కఠిన పరిస్థితులను ఎదుర్కోవడానికి వారు సిద్ధంగా ఉంటారు. ప్రస్తుతం నా కొడుకు నాతోనే ఉన్నాడు. నాకు ఇక ఏ బెంగా లేదంటూ’ సొనాలి బింద్రే భావోద్వేగానికి గురయ్యారు. From the moment he was born 12 years, 11 months and 8 days ago, my amazing @rockbehl took ownership of my heart. From then on, his happiness and wellbeing have been the centre of anything @goldiebehl and I ever did. And so, when the Big C reared its ugly head, our biggest dilemma was what and how we were going to tell him. As much as we wanted to protect him, we knew it was important to tell him the full facts. We’ve always been open and honest with him and this time it wasn’t going to be different. He took the news so maturely… and instantly became a source of strength and positivity for me. In some situations now, he even reverses roles and takes on being the parent, reminding me of things I need to do! I believe that it’s imperative to keep kids involved in a situation like this. They are a lot more resilient than we give them credit for. It’s important to spend time with them and include them, rather than make them wait on the side-lines, not being told yet instinctively knowing everything. In our effort to protect them from the pain and realities of life, we might end up doing the opposite. I’m spending time with Ranveer right now, while he’s on summer vacation. His madness and shenanigans help me #SwitchOnTheSunshine. And today, we derive strength from each other #OneDayAtATime A post shared by Sonali Bendre (@iamsonalibendre) on Jul 18, 2018 at 11:29pm PDT -
ఐష్.. నిన్ను చూసి గర్వపడుతున్నా..
ఐశ్వర్యా రాయ్‌కి 20 ఏళ్లు. ఏంటీ విచిత్రంగా ఉందా? నటిగా ఆమె వయసిది. 20 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో దాదాపు అలానే ఉన్నారు ఐష్. చెక్కు చెదరని అందంతో, సినిమా సినిమాకి మెరుగవుతున్న అభినయంతో ఐష్ తనకు తానే సాటి అనిపించుకుంటున్నారు. ఈ అందాల సుందరికి బోలెడంత మంది అభిమానులు ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలోనూ ఐష్‌ని అభిమానించేవాళ్లు ఉన్నారు. వాళ్లల్లో ఎవర్గ్రీన్ బ్యూటీ రేఖ ఒకరు. నటిగా ఐష్ రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె పట్ల తనకున్న అభిమానాన్ని లేఖ రూపంలో వర్ణించారు. ఆ లేఖ సారాంశం ఇది. ‘‘మై ఐష్... నువ్వు ప్రవహించే నదిలాంటిదానివి. ఎక్కడా ఆగకుండా ప్రవహిస్తూనే ఉన్నావు. నది ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తుంది. తన గమ్యాన్ని తను అన్నుకున్నట్లుగానే, తనలాగే చేరుకుంటుంది. నువ్వూ అంతే. నువ్వేం చెప్పావన్నది జనం మర్చిపోవచ్చు. నువ్వేం చేశావన్నది కూడా మర్చిపోవచ్చు. కానీ నువ్వు వాళ్లకు ఎలాంటి ఫీలింగ్ కలిగించావు అన్నది మాత్రం ఎప్పటికీ మర్చిపోరు. మనం ఏదైనా సాధించాలంటే మనకు ఉండాల్సిన అతి ముఖ్య లక్షణం ధైర్యం. ఎందుకంటే అది లేకపోతే మనం ఎందులోనూ నైపుణ్యం పొందలేం. ఈ విషయంలో నువ్వు దానికి లైవ్ ఎగ్జాంపుల్. నువ్వు నోరు తెరిచి మాట్లాడేలోపే నీ నమ్మకం, నీ శక్తి మాతో మాట్లాడేస్తాయి. నువ్వు అనుకున్నవన్నీ సాధించావు. అవి కూడా ఎంత అందంగా సాధించావంటే మా అందరి కళ్లు నీ నుంచి మరల్చుకోలేనంత. జీవితంలో చాలా దూరం వచ్చావు. ఎన్నో కష్టాలు అనుభవించావు. కానీ ఫీనిక్స్ పక్షి లాగా వీటన్నింటినీ దాటి పైకి లేచావు. నిన్ను చూసి నేనెంత గర్వపడుతున్నా అన్నది మాటల్లో వర్ణించలేకపోతున్నా. నువ్వు చాలా పాత్రలు అత్యద్భుతంగా పోషించావు. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అనిపించుకున్నావు. కానీ నువ్వు చేసిన అన్ని పాత్రల్లో నాకు ఇష్టమైందేంటో తెలుసా? ఇప్పుడు ఆరాధ్య అనే అద్భుతానికి పోషిస్తున్న ‘అమ్మ’ పాత్ర. ప్రేమిస్తూనే ఉండు, నీ మ్యాజిక్‌ని పంచుతూనే ఉండు. 20 ఏళ్లు అయిపోయిందా అప్పుడే! వావ్.నీ హృదయం మోయలేనన్ని, పట్టలేనన్ని శుభాకాంక్షలు, ఆశీర్వచనాలు. లవ్ యూ, జీతే రహో రేఖా మా’’. -
ఎందుకంటే నువ్వున్నావ్..
శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ అంతరంగం ఇది. తల్లంటే తనకు ఎంత ప్రేమ, గౌరవం ఉన్నాయో జాన్వీ ఎమోషనల్‌గా రాసిన ఈ లెటర్ చదివితే అర్థమవుతుంది. ‘‘ఒక రకమైన బాధతో నా హృదయం నిండిపోయి ఉంది. అలాంటి ఆవేదనతోనే ఇకపై బతకటం నేర్చుకోవాలని నాకు అర్థం అవుతోంది. ఇలాంటి స్తబ్దమైన పరిస్థితుల్లో కూడా.. నీ ప్రేమను నేను ఫీలవ్వగలుగుతున్నాను. ఇంత బాధలోను, దుఃఖంలోను కూడా.. నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నావనిపిస్తోంది. కనురెప్పలు మూసిన ప్రతిసారీ నీతో గడిపిన మధుర క్షణాలే గుర్తొస్తున్నాయి. నాకు తెలుసు అలా చేస్తుంది నువ్వే అని. నువ్వు మా జీవితాలకు దొరికిన వరం. మాలో ఒకదానిగా ఉండటం నిజంగా మా వరమనే భావిస్తున్నాను. అసలు నువ్వీ లోకంలో ఉండటానికి అర్హురాలివి కాదు. ఎందుకంటే యూ ఆర్ టూ గుడ్, టూ ప్యూర్ అండ్ మనస్సు నిండా ప్రేమతోనే నిండిపోయి ఉన్నదానివి. అందుకే.. ఆ దేవుడు అంత త్వరగా నిన్ను మా నుంచి లాగేసుకున్నాడు. నా ఫ్రెండ్స్ ఎప్పుడూ అంటుండేవారు ‘నువ్వెప్పుడూ సంతోషంగా కనిపిస్తావు’ అని. నాకా విషయం ఇప్పుడు అర్థం అవుతోంది. ఆ సంతోషం అంతా నీవల్లే అని. నన్ను ఎవరేమన్నా బాధ కలగలేదు, ఏ సమస్య కూడా పెద్ద సమస్యగా అనిపించలేదు, ఏ ఒక్క రోజు కూడా డల్‌గా అనిపించింది లేదు. ఎందుకంటే నువ్వున్నావ్, నన్ను ప్రేమగా చూసుకునే నువ్వున్నావ్. నాకెవ్వరి మీద, దేని మీదా ఆధారపడాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే నువ్వున్నావ్. నేను బాగా కోరుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే. నా సోల్లో నువ్వు కూడా ఒక భాగం. మై బెస్ట్ ఫ్రెండ్. నీ జీవితమంతా మాకు ఇస్తూనే ఉన్నావ్. ఇప్పుడు నేను కూడా నీకు అదే చేయదలిచాను. నువ్వు ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేలా చేస్తాను. నేనెలా అయితే నిన్ను చూసి గర్వంగా ఫీల్ అవుతున్నానో, నువ్వు కూడా నన్ను చూసి అలానే ఫీల్ అవ్వాలి అనే హోప్‌తో ప్రతి రోజూ నిద్ర లేచేదాన్ని. నీకు ప్రామిస్ చేస్తున్నాను, ఇకపై కూడా అదే హోప్‌తో నిద్రలేస్తాను. ఎందుకంటే.. నువ్వింకా ఇక్కడే ఉన్నావు. నేనది ఫీల్ అవ్వగలను. నువ్వు నాలోను, ఖుషీలోను, డాడీలోను మా అందరిలోనూ ఉన్నావు. నువ్వు వదిలి వెళ్లిన జ్ఞాపకాలు మాలో ఎంత బలంగా ముద్రించుకుపోయాయి అంటే.. అవి చాలు మమ్మల్ని ముందుకు నడపటానికి. కానీ అవి చాలవుగా నీ లోటు తీర్చటానికి’’. ఐ లవ్ యూ మై ఎవ్రీథింగ్ – జాన్వీ కపూర్ -
మీరు నా తండ్రిలాంటి వారు!
ప్రణబ్ ముఖర్జీకి ప్రధాని మోదీ లేఖ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనకు రాసిన లేఖను మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం ట్విట్టర్లో షేర్చేసుకున్నారు. రాష్ట్రపతిగా తన చివరిరోజున ఈ లేఖను అందుకున్నానని, ఈ లేఖ తనను కదిలించిందని ఆయన తెలిపారు. ప్రణబ్ ముఖర్జీ తనపై ఎంతో ప్రేమను, వాత్సల్యాన్ని చూపారని ప్రధాని మోదీ ఈ లేఖలో పేర్కొన్నారు. 'ప్రణబ్ దా.. మన రాజకీయ ప్రస్థానాలు విభిన్నమైన రాజకీయ పార్టీల్లో రూపుదిద్దుకున్నాయి. అయినా, మీ మేధోబలం, విజ్ఞత చేతనే మనం కలిసి సమిష్టతత్వంతో పనిచేయగలిగాం' అని అన్నారు. 'మూడేళ్ల కిందట ఒక బయటి వ్యక్తిగా నేను ఢిల్లీకి వచ్చాను. నా ముందు ఉన్న కర్తవ్యం ఎంతో పెద్దది. సవాలుతో కూడుకున్నది. ఈ సమయంలో మీరు ఎప్పుడు తండ్రిలాగా, గురువులాగా నాకు అండగా నిలిచారు' అని మోదీ అన్నారు. 'మీ మేధస్సు, మార్గదర్శకత్వం, వ్యక్తిగత అనుబంధం నాకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని, బలాన్ని ఇచ్చాయి. మీకున్న జ్ఞానం అపారమైన విషయం జగమెరిగినది. మీ మేధోనైపుణ్యం మా ప్రభుత్వానికి, నాకు ఎంతోగానో సహకరించాయి' అని మోది అన్నారు. విన్రమ ప్రజాసేవకుడిగా, అసాధారణ నాయకుడిగా రాష్ట్రపతి బాధ్యతలు నిర్వర్తించిన ప్రణబ్ ముఖర్జీని చూసి దేశం గర్వపడుతున్నదని మోదీ కొనియాడారు. తన మద్దతు, స్ఫూర్తిని, ప్రోత్సాహాన్ని మార్గదర్శకత్వాన్ని అందించినందుకు ప్రణబ్‌కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.