రాజ్యసభ ఎన్నికలకు సోనియా గాంధీ బుధవారం (ఫిబ్రవరి 14) నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు రాజ్యసభకు వెళుతుండటంపై పలువురు విమర్శిస్తున్నారు. ఈ నేపధ్యంలో సోనియా గాంధీ ఆ విమర్శలకు వివరణగా రాయ్‌బరేలీ ప్రజలను ఉద్దేశిస్తూ భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు.
‘ఢిల్లీలో మా కుటుంబం అసంపూర్ణంగా ఉంది. రాయ్‌బరేలీకి వచ్చి మిమ్మల్ని కలవడం ద్వారా దీనికి సంపూర్ణత ఏర్పడింది. ఈ సన్నిహిత సంబంధం ఎంతో పాతది. నా అత్తమామల నుండి నాకు అదృష్టంలా వచ్చింది’ అని సోనియా గాంధీ ఆ లేఖలో రాశారు.
CPP चेयरपर्सन श्रीमती सोनिया गांधी जी का रायबरेली की जनता के नाम संदेश- pic.twitter.com/6zlJkWjwvi
— Congress (@INCIndia) February 15, 2024
రాయ్‌బరేలీతో అనుబంధం..
‘రాయ్‌బరేలీతో మా కుటుంబ సంబంధాలు చాలా లోతుగా ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల్లో మీరు నా మామగారైన ఫిరోజ్ గాంధీని ఇక్కడి నుంచి గెలిపించారు. ఆయన తర్వాత నా అత్తగారు ఇందిరాగాంధీని కూడా ఇలానే ఢిల్లీకి పంపారు. నా జీవితంలోని ఒడిదుడుకులలలో మీ ప్రేమ, ఉత్సాహం దొరికింది’
గత రెండు దఫాల ఎన్నికల్లో..
‘నా అత్తగారిని, నా జీవిత భాగస్వామిని కోల్పోయిన తరువాత, నేను మీ వద్దకు వచ్చాను. మీరు నా కోసం ఆప్యాయంగా చేతులు చాచారు. గత రెండు దఫాల ఎన్నికల్లో మీరు నాకు అండగా నిలిచిన సంగతి మరచిపోలేను. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది మీ కారణంగానే అని గర్వంగా చెబుతాను. మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నిరంతరం ప్రయత్నించాను’
ఆరోగ్యం, పెరుగుతున్న వయస్సు..
‘ఇప్పుడు నా ఆరోగ్యం, పెరుగుతున్న వయస్సు కారణంగా నేను రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఈ నిర్ణయం తీసుకున్నాక నేను మీకు నేరుగా సేవ చేసే అవకాశాన్ని పొందలేను. నా మనసులో ఈ వేదన అలానే ఉంటుంది. అయితే నా ప్రాణం ఎప్పుడూ ఇక్కడే ఉంటుంది. ఇప్పటి వరకు నన్ను మీరు ఆదుకున్నట్లే ఇకపై నన్ను, నా కుటుంబాన్ని ప్రతి కష్టంలోనూ మీరు ఆదుకుంటారని నాకు తెలుసు.పెద్దలకు నమస్కారాలు, పిల్లలకు ప్రేమాభినందనలు. త్వరలోనే కలుస్తానని వాగ్దానం చేస్తున్నాను’ అని సోనియా ఆ లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment