Rae Bareilly
-
రాహుల్ పోటీ చేస్తున్న రాయ్‌బరేలీలో ఏం జరుగుతోంది?
దేశంలో ఎక్కడకు వెళ్లినా ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన చర్చలే వినిపిస్తున్నాయి. వీటిలో యూపీలోని రాయ్‌బరేలీ స్థానం పలువురి నోళ్లలో నానుతోంది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని సోనియా గాంధీ ప్రకటించినప్పటి నుంచి ఆమె ప్రాతినిధ్యం వహించిన రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం భవితవ్యంపై చర్చలు మొదలయ్యాయి.కాంగ్రెస్ అధిష్ఠానం పలు దఫాలుగా చర్చలు నిర్వహించిన దరిమిలా పార్టీ రాహుల్ గాంధీని రాయ్ బరేలీ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో రాయ్‌బరేలీలోని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. ప్రస్తుతం ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు పార్టీ వ్యూహకర్తల బృందం కాంగ్రెస్‌కు అనుకూలంగా అక్కడి వాతావరణాన్ని సృష్టించే పనిలో బిజీగా ఉంది.గత ఎన్నికల్లో అమేథీ విజయం తర్వాత రాయ్‌బరేలీపై కన్నేసిన బీజేపీ ఈ స్థానంలోనూ విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తోంది. అయితే గాంధీ కుటుంబ వారసత్వానికి కంచుకోటగా నిలిచిన ఈ సీటును దక్కించుకోవడం బీజేపీకి సవాల్‌గా మారింది.గత లోక్‌సభ ఎన్నికల్లో అమేథీని కోల్పోయి, రాయబరేలీకి మాత్రమే పరిమితమైన కాంగ్రెస్‌కు ఇప్పుడు ఈ స్థానాన్ని కాపాడుకోవడం ప్రతిష్టాత్మకంగా మారింది. అందుకే రాయ్ బరేలీ స్థానం నుంచి రాహుల్ గాంధీని పోటీకి దింపాలని కాంగ్రెస్ అధిష్టానం చివరి నిమిషంలో నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం కాంగ్రెస్ పోటీ చేస్తున్న రాష్ట్రంలోని ఇతర 16 స్థానాలపై ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ నేతలు భావించి ఉంటారని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాయ్‌బరేలీలో బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్‌పై రాహుల్ గాంధీ పోటీకి దిగారు.2009 నుంచి సమాజ్‌వాదీ పార్టీ రాయ్‌బరేలీ స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో తమ అభ్యర్థిని నిలబెట్టలేదు. ఈసారి కాంగ్రెస్, ఎస్పీ మధ్య పొత్తు ఉంది. పలువురు ఎస్పీ నేతలు తమ పార్టీ జెండాలు చేతపట్టుకుని కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని పూర్తి సహకారం అందించారు. కాగా రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గంలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మే 20న ఐదవ దశలో రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరగున్నాయి. -
రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకా గాంధీ!
దక్షిణాదిలో కొంతవరకూ తమ ఎన్నికల పోరు ముగిసిన తరువాత కాంగ్రెస్ థింక్ ట్యాంక్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని తమ రాయ్‌బరేలీ కోటను కాపాడుకునేందుకు సిద్ధమయ్యింది. తాజాగా ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ సెంట్రల్ కోర్ కమిటీ సమావేశంలో రాయ్‌బరేలీ రాజకీయ సమీకరణాలపై చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాయ్‌బరేలీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై నేడు (ఆదివారం)వెల్లడికానుంది.ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని తెలుస్తున్నప్పటికీ ఆమె పేరును పార్టీ ఇంకా అధికారికంగా వెల్లడించాల్సివుంది. ప్రియాంక గాంధీ పోటీకి సంబంధించి జిల్లా కాంగ్రెస్ కమిటీకి ఇంకా హైకమాండ్ నుండి ఎటువంటి ఆదేశాలు రాలేదు. అయితే కాంగ్రెస్ జిల్లా కార్యాలయానికి రంగులు వేసే పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీకి రాగానే ఆమె తొలుత జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తారని, ఆ తర్వాత కోర్ కమిటీతో సంప్రదింపులు జరుపుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.జిల్లా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు ఈరోజు (ఆదివారం) చాలా ముఖ్యమైన రోజు. నేడు ప్రియాంక పోటీపై ఢిల్లీ నుంచి సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పంకజ్ తివారీ మాట్లాడుతూ ఇప్పుడు తాము ఢిల్లీ నుంచి వచ్చే సమచారం కోసం ఎదురు చూస్తున్నామన్నారు. ఏదిఏమైనప్పటికీ రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక పోటీ ఖాయమని, ఆమె ఇక్కడకు రాగానే ఎన్నికల సన్నాహాలు మొదలవుతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
అమేథీ నుంచి రాహుల్.. రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక? నామినేషన్లకు సన్నాహాలు?
దేశంలో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలల్లో తమ నామినేషన్లు వేసేముందు వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాలు అయోధ్యలోని రామ్ లల్లాను దర్శించుకోనున్నారని సమాచారం. కాంగ్రెస్ వర్గాల నుంచి మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఏప్రిల్ 26న కేరళలోని వయనాడ్‌కు పోలింగ్ పూర్తయిన తర్వాత గాంధీ కుటుంబం అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గాలపై దృష్టి పెట్టనున్నదని సమాచారం. అమేథీలో రాహుల్ గాంధీ, రాయ్‌బరేలీలో ప్రియాంక గాంధీ వాద్రా నామినేషన్ వేయనున్నారని, దీనికి ముందు వారు అయోధ్యలో కొలువైన రామ్‌లల్లాను దర్శించుకోనున్నారని సమాచారం. వయనాడ్‌లో ఓటింగ్ ఏప్రిల్ 26న ముగియనుంది. అదే రోజున రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలకు నామినేషన్ ప్రక్రియ మొదలు కానుంది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం అమేథీ, రాయ్‌బరేలీలలో పోటీ విషయమై ఏప్రిల్ 30లోపు కాంగ్రెస్ అధికారిక ప్రకటన చేయనున్నదని సమాచారం. ఈ స్థానాల అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ మౌనం వహిస్తూ వస్తోంది. అయితే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు.. అమేథీ, రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్న పక్షంలో మే ఒకటి నుంచి మూడవ తేదీలోపు నామినేషన్లు దాఖలు చేసే అవకాశముంది. ఈ రెండు నియోజకవర్గాల్లో నామినేషన్లకు మే 3 చివరి రోజు. మే 20న ఐదవ విడతలో ఈ రెండు లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది.రాహుల్, ప్రియాంకలు యూపీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని కాంగ్రెస్ కమ్యూనికేషన్ సెల్ ఇన్చార్జి జైరాం రమేష్‌తో పాటు పలువురు నేతలు గతంలోనే సూచన ప్రాయంగా తెలియజేశారు. తాజాగా అమేథీలోని రాహుల్ నివసించే బంగ్లాను శుభ్రం చేసి, పెయింటింగ్ వేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించాయి. ఈ నేపధ్యంలో రాహుల్ అమేథీ నుంచి, ప్రియాంక రాయ్‌బరేలీ నుంచి పోటీచేయవచ్చని స్పష్టమవుతోంది. -
సోనియా గాంధీ భావోద్వేగ లేఖ!
రాజ్యసభ ఎన్నికలకు సోనియా గాంధీ బుధవారం (ఫిబ్రవరి 14) నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు రాజ్యసభకు వెళుతుండటంపై పలువురు విమర్శిస్తున్నారు. ఈ నేపధ్యంలో సోనియా గాంధీ ఆ విమర్శలకు వివరణగా రాయ్‌బరేలీ ప్రజలను ఉద్దేశిస్తూ భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ‘ఢిల్లీలో మా కుటుంబం అసంపూర్ణంగా ఉంది. రాయ్‌బరేలీకి వచ్చి మిమ్మల్ని కలవడం ద్వారా దీనికి సంపూర్ణత ఏర్పడింది. ఈ సన్నిహిత సంబంధం ఎంతో పాతది. నా అత్తమామల నుండి నాకు అదృష్టంలా వచ్చింది’ అని సోనియా గాంధీ ఆ లేఖలో రాశారు. CPP चेयरपर्सन श्रीमती सोनिया गांधी जी का रायबरेली की जनता के नाम संदेश- pic.twitter.com/6zlJkWjwvi — Congress (@INCIndia) February 15, 2024 రాయ్‌బరేలీతో అనుబంధం.. ‘రాయ్‌బరేలీతో మా కుటుంబ సంబంధాలు చాలా లోతుగా ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల్లో మీరు నా మామగారైన ఫిరోజ్ గాంధీని ఇక్కడి నుంచి గెలిపించారు. ఆయన తర్వాత నా అత్తగారు ఇందిరాగాంధీని కూడా ఇలానే ఢిల్లీకి పంపారు. నా జీవితంలోని ఒడిదుడుకులలలో మీ ప్రేమ, ఉత్సాహం దొరికింది’ గత రెండు దఫాల ఎన్నికల్లో.. ‘నా అత్తగారిని, నా జీవిత భాగస్వామిని కోల్పోయిన తరువాత, నేను మీ వద్దకు వచ్చాను. మీరు నా కోసం ఆప్యాయంగా చేతులు చాచారు. గత రెండు దఫాల ఎన్నికల్లో మీరు నాకు అండగా నిలిచిన సంగతి మరచిపోలేను. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది మీ కారణంగానే అని గర్వంగా చెబుతాను. మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నిరంతరం ప్రయత్నించాను’ ఆరోగ్యం, పెరుగుతున్న వయస్సు.. ‘ఇప్పుడు నా ఆరోగ్యం, పెరుగుతున్న వయస్సు కారణంగా నేను రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఈ నిర్ణయం తీసుకున్నాక నేను మీకు నేరుగా సేవ చేసే అవకాశాన్ని పొందలేను. నా మనసులో ఈ వేదన అలానే ఉంటుంది. అయితే నా ప్రాణం ఎప్పుడూ ఇక్కడే ఉంటుంది. ఇప్పటి వరకు నన్ను మీరు ఆదుకున్నట్లే ఇకపై నన్ను, నా కుటుంబాన్ని ప్రతి కష్టంలోనూ మీరు ఆదుకుంటారని నాకు తెలుసు.పెద్దలకు నమస్కారాలు, పిల్లలకు ప్రేమాభినందనలు. త్వరలోనే కలుస్తానని వాగ్దానం చేస్తున్నాను’ అని సోనియా ఆ లేఖలో పేర్కొన్నారు. -
రాయ్‌బరేలీలో పార్టీ ప్రక్షాళనకు నడుం కట్టిన ప్రియాంకాగాంధీ
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నియోజకవర్గంలో పార్టీ సంస్థాగత వ్యవహారాలను చక్కబెట్టేందుకు ప్రియాంకా గాంధీ వాద్రా నడుం కట్టారు. అక్కడి పార్టీ నిర్మాణం మొత్తాన్ని పునర్వ్యవస్థీకరించే పనిలో ఆమె పడినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆమె సోమవారంనాడు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ముందుగా పార్టీ ఆఫీసు బేరర్లతో సమావేశమై.. ఆ తర్వాత జిల్లాలోని కిందిస్థాయి కార్యకర్తలతో కూడా ఆమె భేటీ అవుతారని నాయకులు తెలిపారు. దీనివల్ల అసలు క్షేత్రస్థాయి నుంచి పార్టీ పరిస్థితిని అర్థం చేసుకోడానికి ఆమెకు వీలవుతుందని భావిస్తున్నారు. నియోజకవర్గం ప్రజలను కూడా ఆమె కలుస్తారు. రాయ్‌బరేలి నియోజకవర్గంలో ప్రియాంక పర్యటించడం నెలలోనే ఇది రెండోసారి. తన తల్లి సోనియాతో కలిసి అక్టోబర్ 9వ తేదీన ఆమె నియోజకవర్గ పర్యటనలో పాల్గొన్నారు. ఎయిమ్స్‌కు శంకుస్థాపన సహా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.