రాయ్బరేలీలో పార్టీ ప్రక్షాళనకు నడుం కట్టిన ప్రియాంకాగాంధీ | Priyanka Gandhi on stock-taking mission in Rae Bareilly | Sakshi
Sakshi News home page

రాయ్బరేలీలో పార్టీ ప్రక్షాళనకు నడుం కట్టిన ప్రియాంకాగాంధీ

Published Mon, Oct 28 2013 10:52 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

రాయ్బరేలీలో పార్టీ ప్రక్షాళనకు నడుం కట్టిన ప్రియాంకాగాంధీ - Sakshi

రాయ్బరేలీలో పార్టీ ప్రక్షాళనకు నడుం కట్టిన ప్రియాంకాగాంధీ

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నియోజకవర్గంలో పార్టీ సంస్థాగత వ్యవహారాలను చక్కబెట్టేందుకు ప్రియాంకా గాంధీ వాద్రా నడుం కట్టారు. అక్కడి పార్టీ నిర్మాణం మొత్తాన్ని పునర్వ్యవస్థీకరించే పనిలో ఆమె పడినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆమె సోమవారంనాడు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ముందుగా పార్టీ ఆఫీసు బేరర్లతో సమావేశమై.. ఆ తర్వాత జిల్లాలోని కిందిస్థాయి కార్యకర్తలతో కూడా ఆమె భేటీ అవుతారని నాయకులు తెలిపారు.

దీనివల్ల అసలు క్షేత్రస్థాయి నుంచి పార్టీ పరిస్థితిని అర్థం చేసుకోడానికి ఆమెకు వీలవుతుందని భావిస్తున్నారు. నియోజకవర్గం ప్రజలను కూడా ఆమె కలుస్తారు. రాయ్బరేలి నియోజకవర్గంలో ప్రియాంక పర్యటించడం నెలలోనే ఇది రెండోసారి. తన తల్లి సోనియాతో కలిసి అక్టోబర్ 9వ తేదీన ఆమె నియోజకవర్గ పర్యటనలో పాల్గొన్నారు. ఎయిమ్స్కు శంకుస్థాపన సహా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement