దక్షిణాదిలో కొంతవరకూ తమ ఎన్నికల పోరు ముగిసిన తరువాత కాంగ్రెస్ థింక్ ట్యాంక్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని తమ రాయ్‌బరేలీ కోటను కాపాడుకునేందుకు సిద్ధమయ్యింది. తాజాగా ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ సెంట్రల్ కోర్ కమిటీ సమావేశంలో రాయ్‌బరేలీ రాజకీయ సమీకరణాలపై చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాయ్‌బరేలీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై నేడు (ఆదివారం)వెల్లడికానుంది.
ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని తెలుస్తున్నప్పటికీ ఆమె పేరును పార్టీ ఇంకా అధికారికంగా వెల్లడించాల్సివుంది. ప్రియాంక గాంధీ పోటీకి సంబంధించి జిల్లా కాంగ్రెస్ కమిటీకి ఇంకా హైకమాండ్ నుండి ఎటువంటి ఆదేశాలు రాలేదు. అయితే కాంగ్రెస్ జిల్లా కార్యాలయానికి రంగులు వేసే పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీకి రాగానే ఆమె తొలుత జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తారని, ఆ తర్వాత కోర్ కమిటీతో సంప్రదింపులు జరుపుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
జిల్లా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు ఈరోజు (ఆదివారం) చాలా ముఖ్యమైన రోజు. నేడు ప్రియాంక పోటీపై ఢిల్లీ నుంచి సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పంకజ్ తివారీ మాట్లాడుతూ ఇప్పుడు తాము ఢిల్లీ నుంచి వచ్చే సమచారం కోసం ఎదురు చూస్తున్నామన్నారు. ఏదిఏమైనప్పటికీ రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక పోటీ ఖాయమని, ఆమె ఇక్కడకు రాగానే ఎన్నికల సన్నాహాలు మొదలవుతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment