యూపీలోని కాంగ్రెస్ కంచుకోట రాయ్ బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ విషయమై పార్టీ అధిష్టానం ఏ క్షణంలోనైనా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాయ్‌బరేలీలో ఎన్నికల నిర్వహణ కోసం రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ 24 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. దీనిలో అసెంబ్లీ ప్రతినిధులు, ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, జిల్లా కాంగ్రెస్ కమిటీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
రాయ్‌బరేలీ నుంచి ఎవరు పోటీ చేయనున్నారనేది కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించనున్నారు. తాజాగా జరిగిన కాంగ్రెస్ సెంట్రల్ కోర్ కమిటీ సమావేశంలో మల్లికార్జున్ ఖర్గేకు టికెట్ ఖరారు చేసే అధికారాన్ని పార్టీ అధిష్టానం అప్పగించింది. ప్రస్తుతానికి ప్రియాంకగాంధీ పేరు ఫైనల్ అయినట్లు భావిస్తున్నప్పటికీ, అధిష్టానం అధికారికంగా ప్రకటించలేదు.
రాయ్‌బరేలీ లోక్‌సభ ఎన్నికల కోసం సోనియా గాంధీ ప్రత్యేకంగా 24 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో సోనియాగాంధీతోపాటు ఆమె ప్రతినిధి కేఎల్ శర్మ, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పంకజ్ తివారీ, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు ధీరజ్ శ్రీవాస్తవ, బచ్రావాన్ ఎమ్మెల్యే సుశీల్ పాసి, హర్‌చంద్‌పూర్ మాజీ ఎమ్మెల్యే సురేంద్ర విక్రమ్‌సింగ్, డాక్టర్ మనీష్ సింగ్ చౌహాన్, సరేని ఎమ్మెల్యే సుధా ద్వివేది, అతుల్ సింగ్, ఉంచహార్ ఎమ్మేల్యే సాహబ్ శరణ్ పాశ్వాన్, రాయ్‌బరేలీ మున్సిపాలిటీ అధ్యక్షుడు శత్రోహన్ సోంకర్, లాల్ గంజ్ నగర్ పంచాయతీ అధ్యక్షురాలు సరితా గుప్తా, రాయ్ బరేలీ మాజీ అధ్యక్షుడు ఇలియాస్, ఏఐసీసీ మాజీ సభ్యుడు కళ్యాణ్ సింగ్ గాంధీ, డీడీసీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత వీకే శుక్లాలు ఉన్నారు. ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్, ఉత్తరప్రదేశ్ ఇన్‌ఛార్జ్ అవినాష్ పాండే, రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆరాధన మిశ్రా రాయ్‌బరేలీ ఎన్నికల్లో వ్యూహకర్తలుగా కీలక పాత్ర పోషిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment