లోక్‌సభ ఎన్నికల ఫలితాలు సంచలనం రేపుతున్నాయి. యూపీలోని అమేథీ లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెనుకంజలో ఉండటం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కిషోరి లాల్ శర్మ (కేఎల్ శర్మ) ఓట్ల ఆధిక్యంతో స్మృతీ ఇరానికి చుక్కలు చూపిస్తున్నారు. కాంగ్రెస్ వ్యూహం, దూకుడుతనం, ఎన్నికల ప్రచారం కేఎల్ శర్మకు కలసివచ్చే అంశాలుగా పరిణమించాయని అంటున్నారు. ఈ నేపధ్యంలో కేఎల్ శర్మ బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసుకునేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు.
కెఎల్ శర్మకు గాంధీ కుటుంబంతో పాత పరిచయం ఉంది. చాలా కాలంగా రాయ్‌బరేలీలో ఉంటూ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సలహాదారుగా శర్మ వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యకలాపాల్లో కీలకపాత్ర పోషించే ఆయన గాంధీ కుటుంబపు ఎన్నికల ప్రచారంలోనూ కీలకపాత్ర పోషిస్తుంటారు. కెఎల్ శర్మ రాజీవ్ గాంధీకి కూడా అత్యంత సన్నిహితునిగా పేరొందారు.
కేఎల్ శర్మ అమేథీలో 1983, 1991 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎంతగానో పాటుపడ్డారు. 1999లో సోనియా గాంధీ మొదటి ఎన్నికల ప్రచారంలో కూడా శర్మ కీలక పాత్ర పోషించారు. ఆయన కృషి కారణంగానే అమేథీలో సోనియా విజయం సాధించారని చెబుతారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీని బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ఓడించారు. మరి ఇప్పుడు కెఎల్ శర్మ ఎటువంటి ఫలితాలు రాబడతారనే దానిపై అందరి దృష్టి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment