లోక్‌సభ ఎన్నికలు చివరి దశకు చేరుకుంటున్నాయి. ఐదు దశల ఎన్నికల ఓటింగ్ పూర్తియ్యింది. ఇక రెండు దశలు మాత్రమే మిగిలివున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి 400పైగా సీట్లను దక్కించుకుంటామని చెబుతోంది. అదే సమయంలో ఇండియా కూటమి కూడా తాము సాధించే సీట్లపై అంచనాలు వేసుకుంటోంది. ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ పార్టీ మాజీ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ అందరికన్నా మహనీయుడని వ్యంగ్యంగా అన్నారు.
రాహుల్ గాంధీ గొప్ప వ్యక్తి అని, ఆయన దేనికైనా సమాధానం చెప్పగలరని ప్రమోద్ కృష్ణం అన్నారు. మొదటి నుంచి రాహుల్ అన్ని విషయాలను ఎక్కువ చేసి చెబుతారని, అతని గురించి ఏమి చెప్పగలనని ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు. నాడు కాంగ్రెస్‌ను రద్దు చేయాలని మహాత్మా గాంధీ కలలు కన్నారు. అయితే బీజేపీ కూడా ఆ పని చేయలేకపోయింది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఆ పని చేస్తున్నారని ప్రమోద్ కృష్ణం పేర్కొన్నారు.
కాంగ్రెస్‌ను నాశనం చేసేందుకు రాహుల్ గాంధీ కంకణం కట్టుకున్నారని ప్రమోద్ కృష్ణం ఆరోపించారు. ఈ విషయంలో రాహుల్ తన బాధ్యతలను చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఈ విషయం దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కాంగ్రెస్ కార్యకర్తలకు తెలుసు. జూన్ 4 తర్వాత ఇప్పటి వరకు అతి తక్కువ సీట్లు గెలుచుకున్న పార్టీగా కాంగ్రెస్ నిలుస్తుందని ప్రమోద్ కృష్ణం అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment