ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గం 2024- లోక్‌సభ ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారింది. చాలా ఏళ్లుగా కాంగ్రెస్, రాహుల్ గాంధీలకు కంచుకోటగా ఉన్న ఈ స్థానం ఆ తరువాత బీజేపీకి దక్కింది. ఇక్కడి నుంచి స్మృతి ఇరానీ ఎంపీ అయ్యారు. ఈసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తిరిగి అమేథీ నుంచి పోటీ చేయనున్నారనే ప్రచారం గతంలో జోరుగా సాగినా అది కార్యరూపం దాల్చలేదు. కాంగ్రెస్ హైకమాండ్ స్మృతి ఇరానీ ఎదుట కేఎల్ శర్మను తమ అభ్యర్థిగా ప్రకటించింది. రాహుల్ గాంధీకి రాయ్ బరేలీ స్థానాన్ని అప్పగించింది. అదిమొదలు బీజేజీ ప్రతిపక్ష పార్టీపై మాటల దాడి చేస్తూనే ఉంది. స్మృతి ఇరానీపై రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఎందుకు పోటీకి దిగలేదంటూ ప్రశ్నిస్తోంది.
దీనికి రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ సమాధానం ఇచ్చారు. కేఎల్ శర్మ 40 ఏళ్లుగా కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్నారని, గాంధీ కుటుంబం ఆధ్వర్యంలో పగలు రాత్రి పనిచేసిన శర్మను అమేథీ అభ్యర్థిగా ఎంపిక చేయడంలో తప్పేముంది? రాహుల్ గాంధీనే అమేథీకి ఎందుకు వెళ్లాలని, కేఎల్ శర్మ సరిపోతారని గెహ్లాట్ అన్నారు.
రాహుల్ గాంధీని రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయించాలని పార్టీ భావించిందని, అక్కడ రాహుల్ గెలుస్తారని అన్నారు. అమేథీలో కెఎల్ శర్మ విపక్షాలను ఎదుర్కొంటారని పేర్కొన్నారు. శర్మ అటు పార్టీ కోసం ఇటు ప్రజల కోసం పనిచేస్తున్నారని తెలిపారు. సోనియా గాంధీ కూడా శర్మను మెచ్చుకున్నారని, అతనికి అమేథీ ప్రజల సమస్యల గురించి తెలుసని, అక్కడి సమస్యల పరిష్కారానికి ఆయన ఒక ప్రణాళిక రూపొందించారని గెహ్లాట్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment