లక్నో : కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ అల్లుడు, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీ నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీనిపై అమేథీ బీజేపీ సిట్టింగ్ ఎంపీ స్మృతి ఇరానీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన బావ రాబర్ట్ వాద్రాపై విమర్శలు గుప్పించారు.
15ఏళ్ల పాటు ఎంపీగా బాధ్యతలు నిర్వర్తించిన రాహుల్ గాంధీ అమోథీలో ఎలాంటి అభివృద్ది చేయలేదు. అలాంటిది రాబర్ట్ వాద్రా వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ అధికారంలో ఉండగా చేయంది.. తాను కేవలం ఐదేళ్లలో చేసినట్లు తెలిపారు.
బస్సులో సీటు కోసం ఖర్చీఫ్ వేసుకున్నట్లు
అమోథీ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న స్మృతి ఇరానీ మాట్లాడారు. జమనాలో బస్సు ప్రయాణంలో మరొకరు కూర్చోకుండా సీట్లలో కర్చీఫ్ వేసేవాళ్లు. రాహుల్ గాంధీ కూడా తన అమోథీ ఎంపీ సీటు కోసం కర్చీఫ్ వేయాల్సి ఉంటుందేమో.. ఎందుకంటే రాబర్ట్ వాద్రా అదే సీటుపై కన్నేశారని ఎద్దేవా చేశారు.
పట్టుమని నెలరోజులు లేవు
అమోథీలో ఎన్నికల పోలింగ్ సమయం పట్టుమని నెలరోజుల కూడా లేదు. కాంగ్రెస్ ఇంతవరకు అభ్యర్ధిని నిలబెట్టలేదు. ఇలాంటి చోద్యం ఎప్పుడూ చూడలేదు. ఎస్. రాహుల్ గాంధీ 15 ఏళ్లలో చేయంది నేను కేవలం ఐదేళ్లలో చేశాను అని స్మృతి ఇరానీ అన్నారు.
పార్టీ ఆదేశిస్తే.. నేను ఆచరిస్తా
అంతకుముందు.. కేరళలోని వయనాడ్ లోక్‌సభ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రాహుల్ గాంధీని పలు మీడియా ప్రతినిధులు ‘మీరు అమేథీ లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దిగుతారా? అని ప్రశ్నించారు. అందుకు పార్టీ ఆదేశాలకు ప్రకారం తాను పనిచేస్తాను’ అని బదులిచ్చారు.
అమోథీలో నేనూ పోటీ చేస్తా
రాబర్ట్ వాద్రా సైతం ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టనున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడితే అది అమోథీని ఎంచుకుంటానని తెలిపారు. ఆ నియోజకవర్గ ప్రజలు కూడా గాంధీ-నెహ్రూ కుటుంబసభ్యులే కావాలని కోరుకుంటారని వాద్రా అన్నారు.
నా ఎంట్రీతో.. ఓటర్లు చేసిన తప్పును
ఈ సందర్భంగా అమేథీలో పోటీ చేస్తే.. ప్రస్తుతం అమేథీ సిట్టింగ్ ఎంపీ స్మృతి ఇరానీని ఎన్నుకుని తప్పు చేశామని భావిస్తున్న ఓటర్లు.. నేను అమోథీ నుంచి పోటీ చేస్తే వారు చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. నేను పోటీ చేస్తే ఓటర్లు నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని నేను నమ్ముతున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వరుస రాజకీయ పరిణామాలపై స్మృతి ఇరానీ తాజాగా స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment